వైకుంఠ తీర్ధం-పాపవినాశనం

                                     వైకుంఠ తీర్ధం

తిరుమల శ్రీవారి ఆలయానికి 3 కి.మీ.దూరంలో వైకుంఠ తీర్ధం ఉంది. `వైకుంఠ  గుహ నుండి ప్రవహించే తీర్ధం కావడం వల్ల వైకుంఠ  తీర్ధం

రామావతారంలో శ్రీరామచంద్రుడు వానరులతో వెంకటాద్రికి వచ్చాడు.అంజనాదేవి,అంజనేయుల ప్రాద్ధనలతో ఓకే రోజు విడిది చేశాడు.వానరులు అరణ్న్య ప్రాంతమంతా తిరిగారు.గజ,గవాక్ష,గవయ మొదలయినవారు ఒక గుహను చూచి ప్రవేశించి అక్కడ `వైకుంఠన్ని` దర్శించారు. అయితే చర్తుర్భుజ్డడయిన వ్యక్తి వానరాలను బెదిరించడంతో పారిపోయారు.మరల గుహలో ప్రవేశించాలని అనుకున్నారు గాని సాధ్యపడలేదు







                          పాపవినాశనం

తిరుమలశ్రీవారి ఆలయానికి 5 కి.మి దూరంలో పాపవినాశనం ఉంది. ఈ తీర్ధ ప్రాశస్త్యం వరహః స్కంద పురాణాలలో వర్ణితం. రాక్షసజన్మ,దారిద్రభాద ఈ తీర్ధస్నానం వల్ల పోతాయని పురాణాలూ చెబుతాయి.ఏ మాసంలోనయినా సరే శుక్ల కృష్ణ పక్షాలలో ఎపుడయినా అదివారం సప్తమి హస్తనక్షత్రం కలిసి వచ్చిన రోజున పాపనాశన తీర్ధంలో స్నానం చేయడం పరమ పవిత్రమని వరాహ పురాణం చెబుతుంది.


 

No comments:

Post a Comment