స్వామి పుష్కరిణి


                                      మహాదేవుడుంటే శివుడు.స్వామి అంటే కుమార స్వామి అని రూడి .అందువల్ల .స్వామి పుష్కరిణి అంటే కుమారస్వామి పుష్కరిణి అని కొందరు చెబుతారు .తిరుమలలోని దేవుడు సుబ్రమణ్యస్వామి అని వాదించే వారు తామ వాదానికి బలంగా `స్వామి పుష్కరిణి`ని ఉదాహరిస్తారు అయితే సుబ్రమణ్య స్వామికి సంబందించిన కోనేటిని ఎక్కడ కూడా పుష్కరిణిగా వ్యవహరించడం లేదు .అందువల్ల కుమారస్వామి శ్రీనివాసుని అనుగ్రహం కోసం ఇక్కడ తపస్సు చేశాడని చెప్పడం ఉత్తమం

      ఈ పుష్కరిణి ప్రస్తావన వరాహ,పద్మ,మార్కండేయ ,వామన ,స్కంద ,బ్రహ్మ ,భవిషోత్తర పురాణాలలో విస్తారంగా వర్ణితం .వెంకటాచలంలోని ముడుకోట్ల తీర్ధాలకు ఈ పుష్కరిణి అవతార స్టానంగా పేర్క్కోనబడింది .ప్రపoచంలోని తిర్ధాలన్నిటికి `స్వామి కావడం వల్ల స్వామి పుష్కరిణి .తనలో స్నానo చేసిన వాళ్ళకు `రాజ్యాధికారాన్ని `ప్రదానం చేయగలిగిన  శక్తీ కలది కావడం వల్ల స్వామి పుష్కరిణి ,మార్గశిర శుద్ద ద్వాదశినాడు అరుణోదయ వేళలో మూడున్నర కోటి తీర్ధాలు స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని,ఆనాటి స్నానం పవిత్రమని వరాహ వామన పురాణాలూ చెబుతున్నాయి

   కార్తికేయుడు తారక వధానంతరం ఈ స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు .సామంతులు రాజ్య్యం అపహరిస్తే శంఖణుడునే రాజు ఆశరిరవాణి ఆజ్ఞ ప్రకారం స్వామి పుష్కరణిలో మూడు వేళల స్నానం ఆరు మాసాలు చేసి ,స్వామి అనుగ్రహం పొంది మరల మహారాజ పదవిని అలంకరించాడు .సంతాన రహితుడుయిన దశరధుడు   స్వామి పుష్కరిణిలో మునిగి శ్రీనివాసుని ఆష్టక్షరి మంత్రాన్ని జపించి స్వామి అనుగ్రహం పొంది సంతానవంతుడు అయ్యాడు .లెక్కలేనన్ని పాపాలు చేసి లేమితో క్రుంగి కృశించిపోతూ భాదపడుతున్న ఆత్మారాముడు వెంకటాచలం  చేరి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఐశ్వర్యవంతుడుఅయ్యాడు .కృతజ్ఞుడుయిన ధర్మగుప్త్తునికి పిచ్చిపట్టగా  జైమిని మహర్షి సలహామేరకు నందుడు కుమారుడుయిన ధర్మగుప్తుని స్వామి పుష్కరిణిలో స్నానంచేయిoచాడట.ధర్మగుప్తునికి `పిచ్చి `తగ్గి యధాస్టితి కలిగింది .అలాగే `సుమతి `అనే రాజు ఈ పుష్క్కరిణిలో స్నానం చేసి బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకున్నాడు

       స్వామి పుష్క్కరిణి 1.5 ఎకరాల విస్తేర్న్నం కలిగిన  కోనేరు .పుష్కరిణి మధ్య 1532 లో తాళ్లపాక పెదతిరుమలాచార్యుడు ఈ మండపాన్ని భాగు చేయిoచాడు .స్వామి పుష్కరిణి తీరంలో వరాహస్వామి ఆలయం ఒక  ఆశ్వత్ద  వృక్షం కనిపిస్తాయి .వెంకటేశ్వర స్వామి ఈ వృక్షం సాక్షిగా కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడని ప్రతీతి .ఈ పుష్కరిణిలోనే తేప్పతిరునాళ్ళు ,బ్రహ్మోత్సవం చివర జరిగే తీర్ధవారి కార్యక్రమ కైంకర్యాలు జరుగుతాయి



No comments:

Post a Comment