వరాహస్వామి ఆలయం



                         స్వామి పుష్కరిణి వాయువ్యoలో వరాహస్వామి ఆలయం ఉంది .తిరుమల అంతా ఒకప్పుడు సముద్రమట ,భూకంపం వల్ల అది పర్వత ప్రదేశమయిoది .వరాహవతారంలో విష్ణువు భూమిని ఫైకేత్తడని పురాణాలు చెబుతాయి .ఇంచుమించు ఈ అర్ధంలోనే భూవరాహస్వామి ఆలయం తిరుమలలో ఏర్పడింది .ఆoచేత తిరుమల కొండలో ఆధివసిoచిన ప్రధాన దైవం వరాహస్వామి  కావడంలో వింత లేదు .భూవరాహస్వామి అనుమతితోనే శ్రీనివాసుడు తిరుమలలో నిలిచాడని ప్రతీతి .తన్ను సేవించడానికి  వచ్చే వారందరు `భూవరహుని` సేవించాలని శ్రీనివాసుడు కట్టడి చేశాడు .వరాహస్వామి నివేదనoతరం శ్రీనివాసునికి ప్రసాదాల నివేదన చేయడం సంప్రదాయంగా నిలిచి ఉంది .

           ఈ ఆలయంలోని ఒక స్తంభాన్ని `వల్లబ స్తంభం `అని అంటారు .ఉత్తరప్రదేశ్ లోని శుద్ద ద్వైతాన్ని ప్రభోదించిన వల్లభాచార్య్యులు తిరుమలకు విచ్చేసి ఈ ఆలయం దర్శించి ఈ మండపంలో స్తంభం దగ్గర సేదదీరాడట .అందువల్లనే మన పూర్వీకులు ఈ నాటికీ ఈ ప్రదేశాన్ని పవిత్రంగా బావిస్తారు

    ఆళ్వారులు ఎవ్వరు ఈ వరాహ స్వామిని కిర్తించలేదు .ఈ ఆలయ ప్రశంస క్రి.శ. 1379 లో మొదటి సారిగా కనిపిస్తుంది .శ్రీనివాసుని బ్రహ్మోత్సవ సందర్భంలో శ్రీనివాసుడు వరాహస్వామి ఆలయానికి వెంచేపు  చేసేవేళ తిరుమoగై ఆళ్వారు `తిరుమొళి `పాడడం మాత్రం సంప్రదాయంగా ఉంది .లబ్యమాయిన తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలలో వరాహస్వామి కృతులు లేవు .కాని అన్నమయ్య ఈ స్వామిని దర్శించినట్లు చిన్నన్న అన్నమయ్య  చరిత్రలో పేర్కొన్నారు

  ప్రసన్న వెంకటదాసులు స్వామిని  `వరాహ వెంకటనాయకా `అని సంభోదించారు .తిరుమలకు `వరాహ క్షేత్రమని `మరో పేరు

No comments:

Post a Comment