కుమ్మర మండపం



                           తలయేరు గుండు దాటాక కనిపించే మండపం కుమ్మర మండపం .ఈ మండపంలో `కురువనంభి `అనే కుమ్మరి ఉండేవాడు .అతనికి `కురుకనంబి `అని కూడా పేరు .ఇతడు `తొండమాన్ `కాలం నాటివాడు .శ్రీవారి నైవేద్దయ్యనికి అవసరమయిన కుండలను సమకుర్చేవాడు .పని పాటుల  వల్ల స్వామివారిని సేవించలేకపోయవాడు ..చివరకు కొయ్యతో శ్రీనివాసమూర్తిని చేసుకొని కుండలు చేశాక మిగిలిన మట్టితో పూలుగా చేసి అర్పించేవాడు .

    ఆ మట్టి పూలు శ్రీవారి ఆలయంలో స్వామి పాదాల దగ్గర కనిపించేవి .తొండమాన్ ఆశ్చర్ర్య పడ్డాడు .చివరకు `కురువనంభి `కధ తెలిసింది .తనకూ ఆ యోగ్గ్యతను ప్రసాదించమని కోరాడు .అప్పుడు స్వామి `అహంకారం `వదిలి పెట్టమని `తొండమాన్ `ను ఆదెశించాడు .ఇద్దరికి సాయుజ్జం ప్రసాదించాడు .తిరుమలకు వెళ్ళే దారిలో `కురువనంభి `ఒక గోపురం కట్టించాడట .కాని ప్రస్తుతం ఆ గోపురం ఏదో తేలియదు .కురువనంభి కుటుంబీకుల బొమ్మలు ,అతని కుమ్మరిసారే వగైరాలున్న శిలాఫలకాలు ఇప్పటికి కనిపిస్తాయి .

    తాళ్ళపాక అన్నమయ్యః  `కురువనంభి `కధను తన సంకీర్తనల్లో చాల చక్కగా పొందుపరచాడు

    కుమ్మరదాసుడైన కురువరతినంభి

    యిమ్మన్న వరము లెల్ల నిచ్చినవాడు

No comments:

Post a Comment