బేడి ఆంజనేయ స్వామి


                                         శ్రీవారి ఆలయం సన్నిధి విధిలో ఎత్తుయిన  ప్రదేశంలో కనిపించే స్వామి ఆంజనేయుడు .ముకుళిత హస్తాలతో కనిపిస్తాడు .కొందరు బేడీలు తగిలించడం వల్ల బేడి అంజనేయులు అని అంటారు .అల్లరిగా తిరుగుతుంటే తల్లి అంజనాదేవి కుమారునికి బెడిలు తగిలించి స్వామి ఎదుట నిలబెట్టిందని కధ .తన వాహనమయిన ఒంటెకోసం  చిటికి మాటికి హనుమంతుడు వెళ్ళుతుంటే తల్లి బేడీలు తగిలించిందని కొందరు చేబుతారు .అయితే వీటికి ఆధారాలు లేవు .కన్నడంలో `బేడు `అంటే వేడుకొను అని అర్ధం .ఒక గుంపును ఆదేశించే వ్యక్తి  `బేడి బేడి `అంటే వేడుకోండి ,ప్రాద్ధించండి .స్వామి దర్శనం సులువుగా సాగడానికోసం అంజనేయుణ్ణి వేడుకోండి .అని సూచిoచే అర్ధంలో `బేడి అంజనేయులు `అనే మాట ప్రసిద్ధి కేక్కింది .ఇప్పటికి కన్నడిగులు స్వామి దర్శనం సులభంగా సాగాలని ఈ స్వామిని వేడుకొంటారు .

   భగవంతుని కంటే భక్తుడు మిన్న .అoచేతనే మిట్ట మీద భక్తుడు ,కింద భాగంలో భగవంతుడు .ఈ రహస్యం స్పష్టం చేయడానికోసమే బేడి ఆంజనేయులు ఎత్తైన ప్రదేశంలో కనిపిస్తాడు

  శ్రీవారి విమానంలో   సింహాలు ఉన్నట్లే బేడి ఆంజనేయులు విమానంఫై కూడా సింహాలు ఉన్నాయి

No comments:

Post a Comment