మోకాళ్ళ ముడుపుకు ముందున్న లోయ అవ్వచరి లోయ .చాల లోతాయిన లోయ .పచ్చని చెట్లతో దట్టంగా కనిపించే రమణీయ ప్రదేశం .ఇక్కడున్న కోన అవ్వచరి కోన అని అంటరు
`అవ్వసరి `అవ్వచరి అయిoదని కొందరు కాలి నడక మార్గంలో బాగా అలిసిపోయి ఈ లోయలో దిగలేక ఎక్కలేక నా పని సరి అనడం వాల్ల ఈ పేరు వచ్చిందని కొందరు ,`అవ్వ చలి కోన `తిరుమల మీద చలి ఎక్కువ .ఆ చలి ఇక్కడ నుండే మొదలవుతుంది .చల్లదనం కలిగించే కోన లేదా చలి పుట్టించే కోన అనే అర్ధంలో ఈ పేరు వచ్చిందని కొందరు `అవ్వలి చరియ కోన`అవ్వాచరికోన అని కొందరు .రెండు కొండల మధ్య పెద్ద లోయ ఉంది .ఆవలివైపు కనిపించే కొండ చరియ .ఆ వైపున కోన అని ప్రతేయ్క్ఖంగా నిర్దేశించిన పద్దతిలో ఈ పేరు ఏర్పడి ఉండవచ్చు .అవ్వ చరియ కనుమ `అవ్వాచరికోన `అని కొందరు .ప్రకృతి రామణియకమయిన చరియను ,కనుమను ,కొనను దర్శించి ఆశ్చర్య్యం తో చెప్పగా వాడుకలో ఏర్పడిన రూపం `అవ్వాచరి`కోన అని కొందరు .అవ్వచారి అనే వైస్టవ భక్తుణ్ణి ప్రేరణగా ఈ పేరు వచ్చిందని కొందరు అంటారు
No comments:
Post a Comment