ఆకాశ రాజు కుల దేవత-నారాయణవనం ఆవనాక్షమ్మ


వేదాలను పరిరక్షించి వెలసిన తల్లి... ఆకాశ రాజు కుల దైవం... పద్మావతి దేవి నిత్యం కొలచిన దేవి.. ఆమ్నాయాక్షి.. శ్రీనివాసుడు, పద్మావతిలకు వివాహం నిశ్చయం అయ్యాక కల్యాణానికి ముందు ఈ అమ్మనే దర్శించుకున్నారట.చిత్తూర్ జిల్లా నారాయణవనం గ్రామానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం మరెన్నో విశేషాలకు అలవాలం

ఆమ్నాo అంటే వేదమని,అక్షి అంటే కన్నులు అని అర్ధం. వేదాలను కన్నులుగా ఉన్న అమ్మవారు కాబట్టి.ఆ తల్లికి ఆమ్నయాక్షి అనే పేరు వచ్చింది. ఆ పేరే కాల క్రమంలో ఆవనాక్షమ్మగా మారింది. ఆ అమ్మ ఆలయం చిత్తూర్ జిల్లా నారాయణ వానం గ్రామానికి కిలోమీటరు దూరంలో అరుణానది సమీపంలో ఉంది.

 అమ్మవారి ఆవిర్భావం వెనుక ఓ పురాణ కధ ఉంది. పూర్వం సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వేదాలు తస్కరించాడట..అప్పుడు పార్వతి దేవి అతణ్ణి సంహరించి వాటిని బ్రహ్మకు అప్పగించి నారాయణవనంలో ఆమ్నాయక్షిగా వేలిసిందట.అప్పట్లో అమ్మ విగ్రహం చాలా చిన్నగా ఉండేదట.తరువాత కాలంలో అగస్త్య మహర్షి ఆకాశరాజు.. ఆ చిన్న విగ్రహం వెనుకనే అవే పోలికలు ఉండేలా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టించారు.సోమకున్ని సంహరించిన ఈ అమ్మ కాళికామాతను పోలి ఉంటుంది.

                        ఆకాశరాజు కుల దేవత-ఆవనాక్షమ్మ

లక్ష్మిదేవి ఆవతారంగా చెప్పే పద్మావతి దేవి తండ్రి ఆకాశరాజు.. వాళ్ళ కుల దేవతే ఆవనాక్షమ్మ.అప్పట్లో ఆకాశరాజు కోట ముందు భాగంలో ఆలయం ఉన్నట్లు చరిత్ర చెప్పుతుంది.ఆకాశరాజు ఎక్కడికైనా వెళ్ళేముందు తప్పకుండా అమ్మవారిని దర్సిన్చుకోనేవాడట.ఆయనకు చాలాకాలం వరకు పిల్లలు పుట్టలేదు.సంతానం కోసం అమ్మవారికి ఎన్నో పూజలు చేసేవాడట.ఫలితంగా పద్మావతి దేవి జన్మించిందని పురాణాలూ చెబుతున్నాయి.పద్మావతి దేవి తండ్రితో సహా రోజు ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు చేసేదట. నారాయనవనంలోని ఉద్యానవనంలో ఓ రోజు శ్రీనివాసుడిని చూసి మోహించింది పద్మావతి దేవి.ఆ శ్రీనివాసుడిని తనకు భర్తను చేయమని ఆవనాక్షమ్మను కోరుకొందట. శ్రీనివాసుడు,పద్మావతిలకు పెళ్లి నిశ్చయంఅయ్యాక.. ఇద్దరును ఇక్కడికి వచ్చి అమ్మవారి అశ్విర్వాదం తీసుకొన్నారు. పద్మావతి ఈ ఆలయంలోగౌరీ వ్రతం చేసిందట.పరిణయం తరువాత వాళ్ళిద్దరూ తిరుమలకు వెళ్ళుత్తు అమ్మవారిని అమ్మవారిని దర్శించుకున్నట్లు" పద్మావతి పరిణయం` పుస్త్తకంలో ఉంది.


 ఆవనాక్షమ్మ ఆలయ సమీపంలోనే అగస్తేశ్వరలయం ఉంది. దీన్ని అగస్త్య మహర్షి ప్రతిష్టించారట.ఆలయాన్ని ఆకాశరాజు అభివృద్ధి చేశాడు.ఈ గుడిలోని అమ్మవారిని మరకత వల్లి అంటారు. సాధారణంగా శివాలయంలో ముందు శివలింగం దానికి ఎడమవైపు అమ్మవారు ఉంటారు.కానీ ఆలయంలో మొదట అమ్మవారి విగ్రహం ఉంది. ఆ తరువాత స్వామి విగ్రహం ఉండటం విశేషం.పద్మావతి దేవికి ఒకానొక సమయంలో జబ్బు చేసిందట.అప్పుడు అగస్త్య మహర్షి సూచన మేరకు ఆమె ఇక్కడ రుద్రాభిషేకం చేయిoచగా వ్యాధి నయమైనట్లు " వెంకటచల మహత్యంలో " ఉన్నదీ.


   జాతర

ఈ ఆలయానికి మంగళ,శుక్ర,ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యాలో వాస్తుoటారు.ఈ అమ్మవారికి పూజలు చేస్తే వివాహం కానివారికి వివాహం అవుతుందని .పిల్లలు లేని వారికీ పిల్లలు పుడతారని.భక్తుల నమ్మకం
అమ్మవారికి ఏటా ౧౮ రోజులపాటు జాతర జరుగుతుంది. ఇది ఆగష్టు 22-26 తేదీల మధ్యలో ప్రారంభమై సెప్టెంబర్ 11,12 తేదిల్లో ముగుస్తుంది.ఏటా అక్టోబర్లో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పుడు ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు మొదలవతాయి.

   ఈ ఆలయానికి దాదాపు మూడు వేల సంవత్స్తరాల చరిత్ర ఉంది.మొదట ఆకాశరాజు,తరువాత కార్వేటి వంశస్తులు,ఆ తరువాత తిరుత్తణి రాజులు.దీని అభివృద్దికి కృషిచేశారు.1967 లో ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్తానం పరిధిలోకి వచ్చింది.అప్పటి నుంచి పూజాద్రవ్యాలు వసతులు అన్ని వారె సమకూరుస్తున్నారు.ఆలయానికి వచ్చే భక్తుల కోసం రాష్ట్ర పర్యటక శాఖ అనేక వసతులు సమకూర్చింది. భక్తులు, పొంగళ్ళు పెట్టుకొనేందుకు వీలుగా షెడ్డు, ఇతర సౌకర్యాలు భాగంగా మరుగు దొడ్డ్లు నిర్మించారు.

   ఆవనాక్షమ్మ ఆలయంలో ఎన్నో విగ్రహాలు దర్సనమిస్తాయి.గర్భగుడిలో అమ్మవారి చిన్న విగ్రహంతో పాటు పెద్ద విగ్రహం, శాoకరి దేవి విగ్రహం,వేప చెట్టు కింద గణపతి విగ్రహం,ఆలయం వెనుక నాగాలమ్మ విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలో ముందు భాగంలో రెండు పెద్ద రాతి స్తంభాలు ఉన్నాయి. వీటి మధ్యలో భారీ ఘంట ఉండేదట.అమ్మవారికి పూజలు నిర్వహించే సమయంలో దీన్ని మ్రోగిస్తే చుట్టూ ప్రక్కల గ్రామాలూ, పొలాల్లో ఉన్నవారు అవనాక్షమ్మను ప్రాద్దిoచేవారని చెబుతారు.

ఆలయం-ఇలా చేరుకోవచ్చు

ఆవనాక్షమ్మ ఆలయం తిరుపతికి 40 కిలోమిటర్లు దూరంలో ఉంది.తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే బస్సు ఎక్కి నారాయణవనంలో దిగాలి. అక్కడి నుంచి కిలో మీటరు దూరం ఉంటుంది.షేర్ ఆటోలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.రైళ్ళలో వచ్చేవారు తిరుపతి,పుత్తూరు(5 కి.మీ దూరం నుంచి రావచ్చు.





ఏడు కొండలు

    తిరుమలకు కాలిబాటన నడిచివెళ్ళే భక్తులు ఏడుకొండలవాడా ! వెంకటరమణా !గోవిందా !గోవిందా ! అని ఎలుగెత్తి కీర్తించడం అందరికి తేలిసిందే.అయితే ఈ ప్రసిద్ది ఎప్పటినుండి వచ్చిందో కచ్చితంగా తేలియదు .ఏడుకొండలలో ఒక్కో కొండకు ఒక్కో నామం ఉంది .ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర కూడను వుంది

    ఇందులో మొదటిది శ్రీశైలం .ఇది ఇంచుమించు తమిళంలోని `తిరుమలై `అనే మాటకు సరిపోయ్ పదభందం .`తిరు `మంగళవాచకం .మలై అంటే కొండ .శ్రీదేవి నివసిస్తుండడం వల్ల ,భక్తులకు శ్రీప్రదం కావడం వల్ల శ్రీశైలమనే పేరు వచ్చింది

  రెండవది శేషశైలం .శ్రీమహావిష్ణువు ఆదేశం ప్రకారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వతరూపాన్ని ధరించడం చేత  `శేషశైలం `శ్రీమహావిష్ణువు వాయువుకు శేషునికి పందెం పెట్టగా ,శేషుడు వెంకటాద్రిని ఆవరించగా ,వాయువు మహావేగంతో వీచగా ,శేషుడు సువర్ణముఖరీతీరం  దాకా కదిలిపోగా ,స్వామి ఆజ్ఞతో వేంకటాద్రి విముక్తం కావడంతో ,శేషుడు తపం అవరించడం వల్ల `శేషపర్వత`ఖ్యాతి వచ్చింది .

                     మూడవది గరుడాచలం .శ్వేతవరాహ కల్పంలో వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మoతుడు శ్రీ వైకుoటము నుండి ఈ పర్వతం తీసుకురావడం వల్ల గరుడాచలం .

  నాల్గోవధి వేంకటాద్రి . `వేo `కారానికి అమృతమని అర్ధం .కటం అంటే ఐశ్వర్ర్యం.ఆశ్రితులకు అమృతాన్ని ,ఐశ్వర్ర్యంన్ని ప్రసాదించే కొండ అని అభిప్రాయం .లోకంలోని పాపాలకు `వేo`అని వ్యవహారం .ఆ పాపాలను ధహించగాలది కావడం వల్ల వెంకటశైలం .

   ఐదవది  నారాయణాద్రి .సాక్షాత్ శ్రీ మన్నానారాయణుడే వాసం చేయడం వల్ల నారాయణాద్రి నారాయణుడనే విప్రుని ప్రాద్దన మన్నిoఛి శ్రీనివాసుడు వాసం చేయడం నారాయణాద్రి

  ఆరవధి వృషభాద్రి .వృషభుడనే రాక్షసుడు తపస్సు చేయాగా ,తన పేరుతో పర్వతం పిలువబడాలని కోరగా శ్రీనివాసుడు  అనుగ్రహించడం వల్ల వృషబాద్రి

  ఇక చివరది వృషాద్రి.వృష శబ్దానికి ధర్మమని అర్ధం .తన అభివృద్ధికోసం .ఈ కొండ మీద ధర్మదేవత తపస్సు చేయడం వల్ల వ్రషాద్రి

    ఒక్కక యుగంలో ఈ కొండలన్నిటికీ ఒక్కక పేరు ప్రసిద్దంగా వుండేది .వరాహపురాణం ప్రకారం కృత యుగంలో అంజనాద్రి ,త్రేతా యుగంలో నారయణగిరి ,ద్వాపరయుగంలో సింహశైలం ,కలియుగంలో వెంకటాచలం ,బవిషోత్తర పురాణం ప్రకారం కృతయుగంలో వృషాద్రి ,త్రేతాయుగంలో అంజనాచలం ,ద్వాపరయుగంలో శేషశైలం ,కలియుగంలో వెంకటచలం అని పేర్లు .

          ఇవే కాక చింతామణి,జ్ఞానద్రి ,తిర్దాద్రి ,పుష్కరాద్రి ,ఆనందాద్రి ,నీలాద్రి ,నరసింహాద్రి ,వరహాద్రి ,వైకుంటద్రి ,శ్రీ పర్వతమనే పేర్లు ఉన్నాయి .తమిళ సాహిత్యంలో `తిరువేoగడం `అనే మాటకు ప్రాచుర్యం అర్ధం .వేంగి +కడం -వేంగి రాజ్యానికి చివరున్న ప్రదేశం కావడంవల్ల వేంగడం .

   ఏడుకొండల మీద వేంకటేశ్వరుడున్నాడు .ఇందులో మరొక అధ్యాత్మికత రహస్యం ఉంది .శరీరంలో ఏడు చక్రలున్నాయి .మూలధారం ,స్వాధిష్టనం,మణిపూరకం ,అనాహతం ,విశుద్దం ,ఆజ్ఞ ,సహాస్రారం -అని ,అధోముఖమయిన కుండలిని శక్తిని యోగాబ్యాసంతో సహస్రారానికి పయనిoపజేయడం పరమాత్మ  సాక్షాత్కరానికి మార్గమని అంటారు  http://tirumaladarshini.blogspot.in

పాదాల మండపం



                      కాలి నడక మార్గంలో వెళ్ళేవారికీ అలిపిరి ప్రదేశంలో కనిపిచే మండపం ,పడాల మండపం .దీనినే పాదాల మండపం అని కూడా అంటారు .క్రీ.శ .1628 కాలం నాటిది ఈ పాదాల మండపం .ఈ మండపంలో  `పాదరక్షలు `లెక్కలేనన్ని ఉన్నాయి .`మాధవదాసు `అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక లేక ఇక్కడే శిలగా మరిపోయాడట .తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యo .ఆ రోజు ఉపవాసం చేయడం ,పిండితాళిగలు వేయడం సంప్రదాయం .ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలోని హరిజనులు ఇంటిలో ,కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి .ఆ పాద ముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు .శ్రీకాళహస్తి నుండి ఒకరు ,కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులున్ని నెత్తి పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాద రక్షలను ఆ పూజ మందిరంలో పెడతారు .

             ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయి .స్వామివారు కొండ దిగి వచ్చి పాదరక్షలు వేసుకొని అలమేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి మరల కొండ ఎక్కే వేళా పాదరక్షలను స్వామి వారు ఇక్కడ వదిలి వెళ్ళతరాని పురాణ ఇతిహాసం

    పాదాల మండపం తరువాత ముందుగా సోపాన మార్గంలో కనిపించే ప్రధమ గోపురాన్ని `మొండి గోపురం`అని అంటారు .ఇది విజయనగర రాజుల కాలం నాటిది .పిడుగు పడి శిధిలమైనది .తి.తి.దే వారు 1982 సo,,లో పుననిర్మానం చేశారు .దిన్ని సాళువ నరసింహరాయలు కట్టించాడు .ఇది పాదాల మండపం దాటగానే ఉండే గోపురం

మొదట్లో స్వామి వారికీ సాగిలబడి మొక్కుతున్నట్లు ఉన్న శిల్పలు ఉన్నాయి .వీటిలో పెద్దది కొండయ్య కుమారుడు

లకుమయ్యది




అలిపిరి

కాలినడకన తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి తోలిప్రవేశ మార్గo `అలిపిరి ` సోపాన మార్గoలో కనిపించే మొదటి ప్రదేశం ఇదే .కొందరు `ఆడిప్పడి `అంటారు .పడి అంటే మెట్టు .ఆడి అంటి అడుగున ఉన్న భాగం .తిరుమల కొండకు అడుగున ఉన్న భాగం .తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశం .

              కొందరు `అలిపిరి `ని ఆడిప్పళి అంటారు .`పుళి`అంటి చింత చెట్టు .అడుగు భాగన కనిపించే చింత చెట్టు ప్రదేశమని భావం .వైష్ణవ క్షేత్రాలలో `చింత చెట్టుకు `ప్రాధన్న్యమెక్కువ .నమ్మాఆళ్వారుకు చింత చెట్టు కిందనే జ్ఞానోదయం అయింది

    కొందరు `అలిపిరి` అంటి అల్ప శరీరం కలవాడని వివరణ ఇస్తారు .శ్రీవారు ఈ ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నారని భావన .అలిపిరిలోని దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహాలయం .ఈ ఆలయం ఫైకప్పు విడిపోవడంతో పాడయిపోయీoది .విగ్రహాలు శిధిలమయ్యాయి .చివరకు అదృశ్యమయ్యాయి .ఈ ఆలయంలోని `శిల్ప కళ `,చిత్ర `విన్యాసాలు చూడవచ్చు

  అన్నమయ్య కాలం నాటికీ ఈ ఆలయం ఉందేది .`ఆళిపురి సింగని`సేవించి అనే మాట దీనికి సాక్ష్యం



ప్రస్తుతం ఈ ప్రదేశం `లక్ష్మి నారాయణ `ఆలయంగా తిర్చబడింది .ఇక్కడ చూడదగిన `భోక్కసం `ఉంది .అలిపిరిలోనే `వృత్తాకారపు బండ `ఉంది .శిధిలాలయంలోని  బండ `రాగుల రాయిలా ఉంది .ఈ రెండు బండలు చూడవచ్చు

సోపాన మార్గం




                                                          కాలినడకన తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి తోలిప్రవేశ మార్గం `అలిపిరి`మార్గం .అలిపిరి నుండి సోపాన మార్గం మొదలవుతుంది .ఈ సోపాన మార్గాన్ని పునరుద్దించిన వ్యక్తి మట్టకుమార అనంతరాజు .

 ఒక్కప్పుడు కపిల తీర్ధం నుండి కొండదారి మీదుగా తిరుమలకు వెళ్ళేవారట .కాని `అలిపిరి `నుండి వెళ్ళడానికి `అనంతరాజు `సోపాన మార్గం  కట్టించాడు ఈయనే సోపానమార్గంలో రెండు గోపురాలను కట్టించాడు .వీటిలో మొదటి గోపురంలో శ్రీనివాసునితో ఉండే తిరువెంగళనాధుడు (మాట్ల కుమారుని తండ్రి ).చెన్నమ్మ (మాట్ల కుమారుని తల్లి )ఉన్నారు .తెలుగు గ్రంధలిపులలో ఈ పెర్ర్లు చెక్కబడ్డాయి .రెండోవ గోపురం గాలిగోపురం అనే పేరుతో ఉన్న అగ్ర గోపురం .దీనికి సంభందించిన శాసనం పాదాల మండపంలో తెలుగు లిపిలో ఉన్నది

    `గాలి గోపురం `అనే పేరు చిత్రమైనది .గాలి బాగా విచడం వల్ల దానికి తగిన విధంగా గోపుర నిర్మనం ఉండడం వల్ల గాలి గోపురం .కొందరు `కాళి గోపురం `అని అంటారు .`ఖాళీ `అంటే ఏమి లేదు .గొపురానికి తగ్గట్టు దగ్గరలో `గుడి `ఉండాలి .కాని ఇక్కడ గోపురంవుంది .గుడి లేదు .ఆ దృష్టితో `గుడిలేని `ప్రాంతంలో కట్టిన   గోపురం కావడం వల్ల గాలి (ఖాళీ)గోపురం అని కొందరు వివరిస్తారు



     ఈ గోపురానికి విద్యుత్ దీపాలంకరణతో `తిరునామం `తీర్చారు 2001 వ సంవస్త్తరంలోదీని మరమత్తులు  చేయడం జరిగింది.శంఖు చక్రాలను అమర్చడం జరిగింది

తలయేరుగుండు





                                             గుండ్రని ఆకారం గల రాయిగుండు .పెద్ద తల ఆకారంలో కనిపించే గుండులలో మొదటిది కావడం వల్ల తలయేరు గుండు అని అంటారు .తమిళంలో `తలప్పు `తలై దీపావళి `వంటి మాటలలో తలై అంటే మొదటిది .ముఖ్యమైనది అని అర్ధాలు .సోపాన మార్గంలో మొదట కనిపించే పెద్ద గుండు తలయేరు గుండు.ఈ గుండు మీద ఆంజనేయ స్వామి అంజలిముద్రతో కనడతాడు .కొండ ఎక్కేవారు ,దిగెవారు  తలనొప్పి ,కాళ్ళ నొప్పులు లేకుండా ఉండడానికోసం అలిపిరి దగ్గరలోని గుండును తలతోను ,మోకాళ్లతోను తాకుతారు .భక్తులు ఈవిధంగా తాకగా తాకగా బాగా అరిగినట్లు గుండుఫై  `పల్లం `గుర్తులు కనిపిస్తాయి

శ్రీ పాదములు


                                      `అలిపిరి `ప్రదేశంలో తలయేరు గుండు దగ్గరే కనిపించే పాదాలు శ్రీపాదములు .శ్రీవారంటే శ్రీనివాసుడాని అభిప్రాయం .స్వామి వారి పాదలే శ్రీపాదములు

    కొండ మీద స్వామివారి  కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంభి .అతదు భగవద్రామనుజులకు రామాయణ రహస్యాలను ఇక్కడే (అలిపిరి ప్రదేశంలో )చెప్పేవారట .కొండ నుండి నంబి ,గోవిందరాజ పట్టణం నుండి శ్రీమద్రామానుజులు  ఈ ప్రదేశం చేరుకొని భగవారాధన చేసేవారు .పాట ప్రవచనం కారణంగా తిరుమలనంబికి శ్రీవారి మధ్యాహ పూజ సేవా భాగ్యం దక్కలేదనే కొరత ఉండేది .స్వామి తిరుమలనంబి విచారాన్ని గుర్తించి `శ్రీ పాదములు `గా స్వామి ఇక్కడ అవతరించాడు .తిరుమల నంబి కోరిక కూడా తీరింది .ఈ పాదాలనే అన్నమయ్య

               బ్రహ్మకడిగిన పాదము

              బ్రహ్మము దానే నీ పాదము

అని స్తుతిoచాడు

కుమ్మర మండపం



                           తలయేరు గుండు దాటాక కనిపించే మండపం కుమ్మర మండపం .ఈ మండపంలో `కురువనంభి `అనే కుమ్మరి ఉండేవాడు .అతనికి `కురుకనంబి `అని కూడా పేరు .ఇతడు `తొండమాన్ `కాలం నాటివాడు .శ్రీవారి నైవేద్దయ్యనికి అవసరమయిన కుండలను సమకుర్చేవాడు .పని పాటుల  వల్ల స్వామివారిని సేవించలేకపోయవాడు ..చివరకు కొయ్యతో శ్రీనివాసమూర్తిని చేసుకొని కుండలు చేశాక మిగిలిన మట్టితో పూలుగా చేసి అర్పించేవాడు .

    ఆ మట్టి పూలు శ్రీవారి ఆలయంలో స్వామి పాదాల దగ్గర కనిపించేవి .తొండమాన్ ఆశ్చర్ర్య పడ్డాడు .చివరకు `కురువనంభి `కధ తెలిసింది .తనకూ ఆ యోగ్గ్యతను ప్రసాదించమని కోరాడు .అప్పుడు స్వామి `అహంకారం `వదిలి పెట్టమని `తొండమాన్ `ను ఆదెశించాడు .ఇద్దరికి సాయుజ్జం ప్రసాదించాడు .తిరుమలకు వెళ్ళే దారిలో `కురువనంభి `ఒక గోపురం కట్టించాడట .కాని ప్రస్తుతం ఆ గోపురం ఏదో తేలియదు .కురువనంభి కుటుంబీకుల బొమ్మలు ,అతని కుమ్మరిసారే వగైరాలున్న శిలాఫలకాలు ఇప్పటికి కనిపిస్తాయి .

    తాళ్ళపాక అన్నమయ్యః  `కురువనంభి `కధను తన సంకీర్తనల్లో చాల చక్కగా పొందుపరచాడు

    కుమ్మరదాసుడైన కురువరతినంభి

    యిమ్మన్న వరము లెల్ల నిచ్చినవాడు

ప్రసన్నాoజనేయుడు


                                         కొండకు నడచి వెళ్ళే మార్గంలో మధ్య భాగంగా ఎంచబడిన ఏడవమైలు స్టలం .ఇక్కడ ప్రసన్నాoజనేయ స్వామి విగ్రహాన్ని 23-8-1980లో ఆవిష్కరించారు .పది అడుగుల పీటంఫై నిలిచినా ముప్పై అడుగుల ఎత్తైన భద్ర విగ్రహం దురాన్నించి ఆహ్వానిస్తుంది

            కొండకు వెళ్ళే మోటారు వాహన మార్గం ఇక్కడ కాలినడక మార్గాన్ని తాకుతుంది .ఇక్కడ విశ్రాంతికి తగ్గ ఉద్ద్యానవనం ఉంది.ఒక జింకల పార్కు ఉంది.ఇక్కడ యాత్రికులు సేడతిర్చుకొని ముందుకు గాని నడిచి వెళ్ళితే త్రోవ నరసింహస్వామి గుడి కనిపిస్తుంది .

   ఈ ప్రదేశానికి మామండూరు మిట్ట అని కూడా పేరు

ముగ్గు బావి


  ముగ్గు రాళ్ళూ ఎక్కువగా ఉండడం వల్ల ముగ్గు భావి .ఈ బావి గట్టున శ్రీ భక్తాంజనేయస్వామి  వారి గుడి దగ్గర బైరాగి సాధువుల తపోవనం ఉండేది .ఈ భావి నిండితే ఆ బావి నీరు భీమతీర్ధంలో ధారగా దూకుతుంది .దూకిన నీరు అంతర్వాహినిగా ప్రవహించి తిరుపతి నరసింహతీర్ధంలో బహిర్గతమవుతుందని స్తానికులు చెబుతారు
          

  `ముగ్గు బావికే మొగ్గ బావి అని కూడా పేరు .బహుశా మొక్కు బావి కావచ్చు.శ్వేత చక్రవర్తి కుమారుడుయిన శంఖుడు ఈ బావి దగ్గర భగవత్సాక్షాత్క్కరం కోసం తపస్సు చేయగా ,వేటకు వెళ్ళిన శ్రీనివాసుడు ఆ భక్తునికి రాజ వేషంలో అనుగ్రహించాడని కధ

త్రోవ నరసింహుడు


                     తిరుపతి తిరుమల కాలి నడక మార్గంలో ఏడవ మైలు విశ్రాంతి స్తలంలో 1980 లో నిర్మించబడిన ప్రసన్న ఆంజనేయ విగ్రహం తరువాత త్రోవ నరసింహ ఆలయం ఉంది .ఈ ఆలయం దాటక కొంతదూరం నడిస్తే కాలి బాట ,బస్సుబాట రెండు కలసిపోతాయి

                   అగస్తూని ప్రియ విద్యార్ది సుధ .అతడొకసారి మార్కేండేయ మహామునితో కలిసీ తిరుమలకు వెళ్ళుతున్నాడు .దారిలో మార్కేoడేయనుకి `నరసింహుడు `ప్రతక్షమయ్యాడు .ఈ స్టలన్నీ గుర్తించి అక్కడొక నరసింహస్వామిని ప్రతిస్టించాడు

                సాళువ నరసింహరాయులు .ఈ ఆలయాన్ని క్రీ.శ .1485 లో బాగు చేశాడు

అవ్వచరి కోన


                                           మోకాళ్ళ ముడుపుకు ముందున్న లోయ అవ్వచరి లోయ .చాల లోతాయిన లోయ .పచ్చని చెట్లతో దట్టంగా కనిపించే రమణీయ ప్రదేశం .ఇక్కడున్న కోన అవ్వచరి కోన అని అంటరు

   `అవ్వసరి `అవ్వచరి అయిoదని కొందరు కాలి నడక మార్గంలో బాగా అలిసిపోయి ఈ లోయలో దిగలేక ఎక్కలేక నా పని సరి అనడం వాల్ల ఈ పేరు వచ్చిందని కొందరు ,`అవ్వ చలి కోన `తిరుమల మీద చలి ఎక్కువ .ఆ చలి ఇక్కడ నుండే మొదలవుతుంది .చల్లదనం కలిగించే కోన లేదా చలి పుట్టించే కోన అనే అర్ధంలో ఈ పేరు వచ్చిందని కొందరు   `అవ్వలి చరియ కోన`అవ్వాచరికోన అని కొందరు .రెండు కొండల మధ్య పెద్ద లోయ ఉంది .ఆవలివైపు కనిపించే కొండ చరియ .ఆ వైపున కోన అని ప్రతేయ్క్ఖంగా నిర్దేశించిన పద్దతిలో ఈ పేరు ఏర్పడి ఉండవచ్చు .అవ్వ చరియ కనుమ `అవ్వాచరికోన `అని కొందరు .ప్రకృతి రామణియకమయిన చరియను ,కనుమను ,కొనను దర్శించి ఆశ్చర్య్యం తో చెప్పగా వాడుకలో ఏర్పడిన రూపం `అవ్వాచరి`కోన అని కొందరు .అవ్వచారి అనే వైస్టవ భక్తుణ్ణి ప్రేరణగా ఈ పేరు వచ్చిందని కొందరు అంటారు 

ఘంటా మండపం


               తిరుమల కొండ మీద `అవ్వచరి ` కొనకు దక్షిణం వైపున కొండ చిట్టచివర కనిపించే మండపం ఘంటా మండపం .ఇక్కడే తంతి తపాలా వారి పెద్ద లోహపు రేకు ఉంది.తిరుపతి రుయా హాస్పిటల్ రోడ్డలోల నిలబడితే ఈ రేకు బాగా కనిపిస్తుంది .కాలి నడక మార్గంలో నరసింహాలయం దాటాక ,మెట్టు దిగితే కాలినడక బస్సు మార్గంలో కలిసిపోతుంది .కుడివైపున ఉన్న అడవి మార్గం ఈ మండపానికి దారి తిస్తుంది .ఈ ప్రదేశంలో నాలుగు కాళ్ళ మండపం ఉంది .ఇక్కడ ఒక ఘంట ఉండేది .దీనిని వెంకటగిరి రాజా రఘునాధ యాదవనాయకులూ ,చంద్రగిరి రాజయిన రామదేవ రాయలకు క్రి.శ 1630 లో బహుకరించారు .తిరుమలలో శ్రీవారికి నైవేద్దయ్యం జరిగేవేళా మోగే శద్దం తరంగాలుగా మరి ఈ మండపంలోని ఘంటలను  తాకేవని ;అప్పుడు ఈ ఘంటలు మ్రోగేవని ;చంద్రగిరిలోని రాజా వారు స్వామివారికి వైవేద్దయ్యమయిoదని తెలిసి అఫై భోజనం చేసేవారని ప్రతీతి .ప్రస్తుతం ఈ మండపంలో ఘంట లేదు 

మోకాళ్ళ ముడుపు


 
                                కాలినడక మార్గంలో యాత్రికులకు శ్రమ సాధ్యమయన సోపానమార్గం మోకాళ్ళ ముడుపు .ఇక్కడ మెట్లు నిటారుగా ఉంటాయి .ఒక మెట్టుకు ఇంకొక మెట్టుకు మోకాలంత దూరం ఉండడమే ,మోకాలంత ఎత్తున మరో మెట్టు ఉండడమో ఇక్కడ చూడవచ్చు .కొండ ఎక్కేవాళ్ళు మోకాళ్ళు పట్టుకొని ఎక్కడం వల్ల మోకాలి మెట్టు ,మోకాలి నెట్టు అనే పెర్ర్లు వచ్చాయి .ఒకప్పుడు `అక్కమ్మ `ఆలయాల నుండి కింద లోయలో దిగి ఆఫై మెట్లు ఎక్కే మార్గం చేరుకోనేవారు .అందువల్ల నిజంగానే ఆ సోపనమార్గ్గం మోకాలి మెట్టుగా ఉండేది .సోపానమార్గంలో కొన్ని మార్పులు చేయడం వల్ల ప్రస్తుతం అంత శ్రమ లేదు .ఇక్కడి కొండకు చుక్కల పర్వతమని పేరు

    తిరుమల సాలగ్రామమయమని ప్రతీతి .అందువల్ల పాదాలు మోపడానికి ఇష్టపడని వారు మోకాళ్లను ముడిచి ఎక్కేవారట .ఈ విధంగా కొండ ఎక్కిన వారు శ్రీమద్రామనుజులుఅని ,కన్నడ హరిదాసులయిన  వ్యాసరాయలని ,మహంతు హత్తిరామ్ బావాజి అని పెద్దలు చేబుతారు .ఈ ప్రదేశంలోనే తాళ్ళపాక అన్నమయ్యకు అలివేలు మంగమ్మ సాక్షాత్కరించిందని ,అన్నమయ్య ఆశువుగా  శ్రీ వెంకటేశ్వర శతకం చెప్పాడని అంటారు .(ఇక్కడ తిరుపతిలోని కొత్తూరు శిధిల ఆలయగోపురాన్ని 1998 లో పునఃస్తాపించడం జరిగింది

త్రోవ భాష్యకారులు


                   కాలినడకన కొండకు వెళ్ళే దారిలో మోకాళ్ళ పర్వతం త్రోవలో భాష్యకారుల సన్నిధి ఉంది .భాష్యకారులు అని అంటే శ్రీమద్రామనుజులే .కాలినడక  త్రోవలో ఉండడం వల్ల త్రోవ భాష్యకారులు .ఇక్కడ ఒక చిన్న మండపం ,ఒక దేవాలయం కూడా కనిపిస్తాయి .ఈ ఆలయాన్ని ఇటివల 2002 లో పునరుద్దించారు .

   శ్రీమద్రామనుజులు  తిరుమల వెళుతుండగా తిరుమలనంబి ఈ ప్రదేశంలోనే ఆలయ మర్యాదలతో స్వాగతం చెప్పారని పెద్దలంటారు .

   తాళ్ళపాక అన్నమయ్య త్రోవ భాస్యకారులను

       ఈతడే రామానుజులు యిహపరదైవము

       నయమై శ్రీ వేంకటేశు నగమెక్కివాకిటను

 అని కీర్తించారు

సార్ల పెట్టే

  మోకాలిమెట్టు ఫై భాగంలో పెట్టెల్లాంటివి కొన్ని కనిపిస్తాయి .సీతమ్మ శ్రీ రామచంద్రుల వారితో అడవులకు వెళ్ళే వేళ ఏడువరాల నగలను తనతో తీసుకెళ్లడానికి కైకేయి సమ్మతిన్చిందట ఈ పెట్టలు సారెగా ఇచ్చిన నగలు దాచిన పెట్టలు కావడం వల్ల ఇది సార్ల పెట్టె .ఈ పెట్టలు లాంటి కొండగుండు మీద భక్తాంజనేయ స్వామి శిల్పం ఉంది .చారలు చారలుగా పెట్టి ఆకారం లాంటి రాతి పలకలు ఒక చోట వుండడం వల్ల సార్ల పెట్టిగా వ్యవహరించబడిందని కొందరు బావిస్తారు .ఆలమేలు మంగమ్మ తిరుమల నుంచి వస్తుండగా వాన కోసం ఈ పెట్టె కింద భాగంలో నిలిచిందట .కానీ మరికొందరు మరో రకంగా చెబుతారు .

శ్రీవేంకటేశ్వరుడు ఆలమేలు మంగమ్మను పెండ్లాడినాడు ఆమేతో కొండకు బయలుదేరాడు .అప్పటికే స్వామికి ఇల్లాలు ఉంది .ఆ ఇల్లాలు ఏమంటుందో అనే భయం కుడా ఉంది .అయినా కదిలాడు .మంగమ్మ ఏడు వరాల నగలతో సారేలతో బయలుదేరింది .సరిగ్గా ఈ ప్రదేశానికి వచ్చే సరికి `అన్ని తెచ్చావా `అని స్వామి ప్రశ్నించాడు .తెచ్చానంది మంగమ్మ .మరి కరివేపాకు అని అడిగాడు .లేదని చెప్పిoది మంగమ్మ .తాను వెళ్ళి తెస్తానని వెనుకకు తిరిగిందట .తిరుచానూర్ లో `శిల `అయిoదట.ఆ సార్లే పెట్టలకు కాపలాగా `ఆంజనేయుడు `ఇప్పటికి దర్శనమిస్తున్నాడు .

   .

ఆళ్వారుల మూర్తులు


                     కొండకు నడచి వెళ్ళే మార్గంలో ముందుకు సోపాన పంక్తులను ఎక్కుతూ వస్తే ఆళ్వారుల విగ్రహాలు కనిపిస్తాయి .ఆళ్వారులు పన్నిద్దరు .తమిళంలో నాలుగు వేల పశురాలను (పాటలను )పాడినవారు .మొదట్లో ముగ్గురు-పోయగై ,పూదత్త ,పేయాల్వారులు ,తరువాత తిరుమళిశై .కులశేకర ,తిరుప్పాణ ,తిరుమoగై ,పెరియాళ్వార్ ,గోదాదేవి ,నమ్మాళ్వార్ (వీరందరు స్వామిని గురించి పాడారు .ముందుకు వెళ్ళితే తిరుమల గిరి -గరుడాద్రి నగరం

స్వామి పుష్కరిణి


                                      మహాదేవుడుంటే శివుడు.స్వామి అంటే కుమార స్వామి అని రూడి .అందువల్ల .స్వామి పుష్కరిణి అంటే కుమారస్వామి పుష్కరిణి అని కొందరు చెబుతారు .తిరుమలలోని దేవుడు సుబ్రమణ్యస్వామి అని వాదించే వారు తామ వాదానికి బలంగా `స్వామి పుష్కరిణి`ని ఉదాహరిస్తారు అయితే సుబ్రమణ్య స్వామికి సంబందించిన కోనేటిని ఎక్కడ కూడా పుష్కరిణిగా వ్యవహరించడం లేదు .అందువల్ల కుమారస్వామి శ్రీనివాసుని అనుగ్రహం కోసం ఇక్కడ తపస్సు చేశాడని చెప్పడం ఉత్తమం

      ఈ పుష్కరిణి ప్రస్తావన వరాహ,పద్మ,మార్కండేయ ,వామన ,స్కంద ,బ్రహ్మ ,భవిషోత్తర పురాణాలలో విస్తారంగా వర్ణితం .వెంకటాచలంలోని ముడుకోట్ల తీర్ధాలకు ఈ పుష్కరిణి అవతార స్టానంగా పేర్క్కోనబడింది .ప్రపoచంలోని తిర్ధాలన్నిటికి `స్వామి కావడం వల్ల స్వామి పుష్కరిణి .తనలో స్నానo చేసిన వాళ్ళకు `రాజ్యాధికారాన్ని `ప్రదానం చేయగలిగిన  శక్తీ కలది కావడం వల్ల స్వామి పుష్కరిణి ,మార్గశిర శుద్ద ద్వాదశినాడు అరుణోదయ వేళలో మూడున్నర కోటి తీర్ధాలు స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని,ఆనాటి స్నానం పవిత్రమని వరాహ వామన పురాణాలూ చెబుతున్నాయి

   కార్తికేయుడు తారక వధానంతరం ఈ స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు .సామంతులు రాజ్య్యం అపహరిస్తే శంఖణుడునే రాజు ఆశరిరవాణి ఆజ్ఞ ప్రకారం స్వామి పుష్కరణిలో మూడు వేళల స్నానం ఆరు మాసాలు చేసి ,స్వామి అనుగ్రహం పొంది మరల మహారాజ పదవిని అలంకరించాడు .సంతాన రహితుడుయిన దశరధుడు   స్వామి పుష్కరిణిలో మునిగి శ్రీనివాసుని ఆష్టక్షరి మంత్రాన్ని జపించి స్వామి అనుగ్రహం పొంది సంతానవంతుడు అయ్యాడు .లెక్కలేనన్ని పాపాలు చేసి లేమితో క్రుంగి కృశించిపోతూ భాదపడుతున్న ఆత్మారాముడు వెంకటాచలం  చేరి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఐశ్వర్యవంతుడుఅయ్యాడు .కృతజ్ఞుడుయిన ధర్మగుప్త్తునికి పిచ్చిపట్టగా  జైమిని మహర్షి సలహామేరకు నందుడు కుమారుడుయిన ధర్మగుప్తుని స్వామి పుష్కరిణిలో స్నానంచేయిoచాడట.ధర్మగుప్తునికి `పిచ్చి `తగ్గి యధాస్టితి కలిగింది .అలాగే `సుమతి `అనే రాజు ఈ పుష్క్కరిణిలో స్నానం చేసి బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకున్నాడు

       స్వామి పుష్క్కరిణి 1.5 ఎకరాల విస్తేర్న్నం కలిగిన  కోనేరు .పుష్కరిణి మధ్య 1532 లో తాళ్లపాక పెదతిరుమలాచార్యుడు ఈ మండపాన్ని భాగు చేయిoచాడు .స్వామి పుష్కరిణి తీరంలో వరాహస్వామి ఆలయం ఒక  ఆశ్వత్ద  వృక్షం కనిపిస్తాయి .వెంకటేశ్వర స్వామి ఈ వృక్షం సాక్షిగా కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడని ప్రతీతి .ఈ పుష్కరిణిలోనే తేప్పతిరునాళ్ళు ,బ్రహ్మోత్సవం చివర జరిగే తీర్ధవారి కార్యక్రమ కైంకర్యాలు జరుగుతాయి



వరాహస్వామి ఆలయం



                         స్వామి పుష్కరిణి వాయువ్యoలో వరాహస్వామి ఆలయం ఉంది .తిరుమల అంతా ఒకప్పుడు సముద్రమట ,భూకంపం వల్ల అది పర్వత ప్రదేశమయిoది .వరాహవతారంలో విష్ణువు భూమిని ఫైకేత్తడని పురాణాలు చెబుతాయి .ఇంచుమించు ఈ అర్ధంలోనే భూవరాహస్వామి ఆలయం తిరుమలలో ఏర్పడింది .ఆoచేత తిరుమల కొండలో ఆధివసిoచిన ప్రధాన దైవం వరాహస్వామి  కావడంలో వింత లేదు .భూవరాహస్వామి అనుమతితోనే శ్రీనివాసుడు తిరుమలలో నిలిచాడని ప్రతీతి .తన్ను సేవించడానికి  వచ్చే వారందరు `భూవరహుని` సేవించాలని శ్రీనివాసుడు కట్టడి చేశాడు .వరాహస్వామి నివేదనoతరం శ్రీనివాసునికి ప్రసాదాల నివేదన చేయడం సంప్రదాయంగా నిలిచి ఉంది .

           ఈ ఆలయంలోని ఒక స్తంభాన్ని `వల్లబ స్తంభం `అని అంటారు .ఉత్తరప్రదేశ్ లోని శుద్ద ద్వైతాన్ని ప్రభోదించిన వల్లభాచార్య్యులు తిరుమలకు విచ్చేసి ఈ ఆలయం దర్శించి ఈ మండపంలో స్తంభం దగ్గర సేదదీరాడట .అందువల్లనే మన పూర్వీకులు ఈ నాటికీ ఈ ప్రదేశాన్ని పవిత్రంగా బావిస్తారు

    ఆళ్వారులు ఎవ్వరు ఈ వరాహ స్వామిని కిర్తించలేదు .ఈ ఆలయ ప్రశంస క్రి.శ. 1379 లో మొదటి సారిగా కనిపిస్తుంది .శ్రీనివాసుని బ్రహ్మోత్సవ సందర్భంలో శ్రీనివాసుడు వరాహస్వామి ఆలయానికి వెంచేపు  చేసేవేళ తిరుమoగై ఆళ్వారు `తిరుమొళి `పాడడం మాత్రం సంప్రదాయంగా ఉంది .లబ్యమాయిన తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలలో వరాహస్వామి కృతులు లేవు .కాని అన్నమయ్య ఈ స్వామిని దర్శించినట్లు చిన్నన్న అన్నమయ్య  చరిత్రలో పేర్కొన్నారు

  ప్రసన్న వెంకటదాసులు స్వామిని  `వరాహ వెంకటనాయకా `అని సంభోదించారు .తిరుమలకు `వరాహ క్షేత్రమని `మరో పేరు

బేడి ఆంజనేయ స్వామి


                                         శ్రీవారి ఆలయం సన్నిధి విధిలో ఎత్తుయిన  ప్రదేశంలో కనిపించే స్వామి ఆంజనేయుడు .ముకుళిత హస్తాలతో కనిపిస్తాడు .కొందరు బేడీలు తగిలించడం వల్ల బేడి అంజనేయులు అని అంటారు .అల్లరిగా తిరుగుతుంటే తల్లి అంజనాదేవి కుమారునికి బెడిలు తగిలించి స్వామి ఎదుట నిలబెట్టిందని కధ .తన వాహనమయిన ఒంటెకోసం  చిటికి మాటికి హనుమంతుడు వెళ్ళుతుంటే తల్లి బేడీలు తగిలించిందని కొందరు చేబుతారు .అయితే వీటికి ఆధారాలు లేవు .కన్నడంలో `బేడు `అంటే వేడుకొను అని అర్ధం .ఒక గుంపును ఆదేశించే వ్యక్తి  `బేడి బేడి `అంటే వేడుకోండి ,ప్రాద్ధించండి .స్వామి దర్శనం సులువుగా సాగడానికోసం అంజనేయుణ్ణి వేడుకోండి .అని సూచిoచే అర్ధంలో `బేడి అంజనేయులు `అనే మాట ప్రసిద్ధి కేక్కింది .ఇప్పటికి కన్నడిగులు స్వామి దర్శనం సులభంగా సాగాలని ఈ స్వామిని వేడుకొంటారు .

   భగవంతుని కంటే భక్తుడు మిన్న .అoచేతనే మిట్ట మీద భక్తుడు ,కింద భాగంలో భగవంతుడు .ఈ రహస్యం స్పష్టం చేయడానికోసమే బేడి ఆంజనేయులు ఎత్తైన ప్రదేశంలో కనిపిస్తాడు

  శ్రీవారి విమానంలో   సింహాలు ఉన్నట్లే బేడి ఆంజనేయులు విమానంఫై కూడా సింహాలు ఉన్నాయి

ఘంటా మండపం



                                   శ్రీవారి ఆలయంలో సన్నిధి వీధిలో ఎత్తైన ప్రదేశంలో నాలుగు కాళ్ళ మండపం ఉంది .దీనికి ఘంటా మండపం అని పేరు .శ్రీవారి అర్చకులు ఉదయం సాయంత్రం ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చి ఆలయం తలుపులు తెరిచే వేళా వారి రాకను స్పష్టం చేసే విధంగా `ఘంటలు `మ్రోగించేవారట .కాని ఈ సంప్రదాయం ప్రస్తుతం లేదు .ఇక్కడ H.M.T  గడియారం ఉండేది .ప్రస్తుతం `ధర్మోరక్షతి రక్షతః  అనే  కరేoటు కాంతి వలయం ఉంది .ఘంటా మండపానికి గొల్ల మండపం అని కుడా పేరు .ఆ గొల్ల పేరు తెలియదు కానీ తిరుమల మీద పాలు ,పెరుగు ,నేయి అమ్మి ఆ రాబడితో ఈ మండపాన్ని కట్టించిoదట ఇలాంటి మండపాలు రామేశ్వరం ,మధుర ,శ్రీరంగంలో కుడా కనిపిస్తాయి ఇప్పుడు ఇక్కడ రక్షకదళం గస్తీ ఉన్నది

గరుడకంబం


                                            శ్రీవారి ఆలయానికి ఎదురుగా మెట్ల మీద ఘాoటా మండపం ముoగిట్లో కనిపించే ఎత్తైన దీపస్తంబం గరుడకంబం . తమిళంలో స్తంబాన్ని `కంబం`అంటారు .ఒకప్పుడు ఈ  స్తంబం గుడి లోపల గరుడాళ్వారు వెనుక భాగంలో ఉండేది .అందువల్ల `గరుడ స్తంబమని `అని పేరు.ఇక్కడ భక్తాదులు సంఖ్యా పెరగడం వల్ల ,దర్శనంలో ఆలస్యం తగ్గించడాని కోసం ఈ గరుడ కంబాన్ని  ధ్వజ స్తంబం దగ్గరకు మార్చారు .ఆ ఫై ఆలయం వెలుపల ప్రసాదాలు అమ్మేచోట నిలబెట్టారు .మరల ఈ గరుడకంబాన్ని సన్నిది విధిలో చేర్చారు .ఇప్పుడు ఆంజనేయస్వామి గుడి సమీపాన ఉన్నది

   ఒకప్పుడు స్తంబాలు రెండే .ఒకటి శిఖరం లేనిదీ .రెండొవది  శిఖరం కలది .గరుడకంబం దేవాలయం లోపల ఉన్న రోజుల్లో భక్తాదులు దీపాలు వెలిగించి ఆ ఫై పొర్లు దండాలు పెట్టేవారు .గర్భగుడి చుట్టూ ప్రదక్షణం చేసి గరుడకంబం దగ్గర పూర్తి చేసేవారు .ఈ పొర్లు దండాల విధానాన్ని కన్నడిగులు `ప్రాణాచార `మని ఇప్పటికి వ్యవహారిస్తారు .కోరికలు నెరవేరినందుకు ప్రాణాలను భిగబట్టి చేసే పొర్లు దండం కావడం వల్ల `ప్రాణాచార `దేనినే అంగప్రదక్షణ అని అంటారు

       సన్నిధి వీధిలో ప్రస్తుతం 4 దీపస్తంబాలు ఉన్నాయి మొదటి దానిఫై చక్రం,రెండోవ దానిఫై గరుడాఆళ్వార్ ,మూడవ దానిఫై హనుమంతుడు ,నాల్గవ దానిఫై గరుడాఆళ్వార్ చిత్రితమయిన 2కోప్పరలున్నాయి .ఉషోదయ కాలంలో ముపై మూడు కోట్ల దేవతలు స్వామిని సేవించి వెళ్ళిన కొన్ని నిమిషాలలోనే `అంగప్రధక్షనానికి `అవకాశం కల్పిస్తున్నారు .దేవతల సంచారంతో తేజోమయమయిన ప్రాకారంలో ప్రదక్షణం చేయడంవల్ల శరీరంలోని  72000 సుక్ష్మనాడులలోని `అడ్డు తొలగిపోతుంది .ఫైగా మానసిక వికాసం కలుగుతుంది .ఇదే అంగ ప్రధక్షనలోని అంతరాద్ధం

      

శంఖనిధి ,పద్మనిధి


                                 ఆలయానికి రక్షకదేవతలు శంఖనిధి ,పద్మనిధి ,కుబేరుని నవనిధులే ,శంఖనిధి ,పద్మనిధి ,శ్రీవారి ఆలయంలో మహాద్వారం ప్రవేసించే వేళా దక్షిణం వైపు శంఖనిధి ,ఉత్తరంవైపు పద్మనిధి స్పష్టంగా కనిపిస్తాయి

           అయితే శ్రీవారి ఆలయానికి ఏడు ఆవరణలున్నట్లు  కొందరు బావించారు .మొదటిది శ్రీవారి చుట్టూ వున్నా ఆవరణం ,రెండవది పల్లవరాజులు కట్టిన ప్రదక్షణం ,మూడోవాది రాజరాజు కట్టిన ప్రదక్షణం ,నాల్గోవధి యాదవరాయులు కట్టిన ప్రదక్షణ ఆవరణ ,మొదటి మూడింటికి మధ్య కొంత ప్రదేశం ఎడం ఉండడం గమనించవచ్చు .ఐదొవది విమాన ప్రదక్షణం ,ఆరోవది సంపంగి ప్రదక్షణం ,ఏడవది మాడవిధుల ప్రదక్షణ `ఆవరణ `

మహా ద్వార గోపురం


                                శ్రీవారి ఆలయంలో ప్రవేశించడానికి ముందు కనులకు విందుగా కనపించే గోపురం మహాద్వార గోపురం దీనికే ముఖ ద్వారం ,పెరియ తిరువాసల్ ,పడికావలి గోపురం అని పేర్లు

ఆలయంలోని మొదటి వాకిలి ద్వారం కావడం ముఖద్వారం ,పెద్ద ద్వారమున్న వాకిలి కావడం వల్ల `పెరియ తిరువాసల్ `స్వామి సందర్సన కోసం భక్తులు వేచి ఉండే గోపురం కావడం వల్ల పడి కావలి గోపురం .ఈ గోపురం క్రి.శ 13 వ శతబ్బo  నాటిది .అయినా దేనిని క్రి.శ 19 వ శతబ్బంలో మహంతు ధర్మదాసుగారు కట్టిoచారనే శాసనం ఇక్కడనే ఉంది

రంగనాయకుల మండపం



            శ్రీవారి ఆలయం బయట ప్రాకారం అనుకోని ఆగ్నెయదిశలో  ఉన్న మండపం రంగ మండపం .యాదవ ప్రభువయిన శ్రీ రంగనాధ యాదవరాయులు .(క్రీ.శ 1320 -క్రీ.శ .1360) ఈ మండపాన్ని కట్టించినట్లు చెబుతారు .కానీ నిర్మాణం బట్టి ఈ మండపం క్రి.శ 15 లేదా 16 వ శతబ్బం  కాలం నాటిది కావచ్చు

  ఈ మండపం చాల పెద్దది తూర్పు పడమరల కొలత  50 అడుగులు కాగా ఉత్తర దక్షిణ  వైపు కొలత 108 అడుగులు .దక్షిణంవైపు ఓకే చిన్న మందిరం ఉంది .ఈ మందిరంలో శ్రీరంగంలోని రంగానాధస్వామి ఉత్సవ విగ్రహం భద్రపరిచారని  క్రీ.శ  1371 ప్రాంతంలో  గోపన్న మంత్రి మరల ఆ విగ్రహాన్ని శ్రీ రంగం చేర్చాడాని సంప్రదాయం ,చరిత్ర రెండు చెబుతున్నాయి

  ప్రసిద్దులు ,ప్రముఖలు వచ్చిన వేళా ఈ మండపంలో ప్రసాదాలు అందుకొంటారు .ఈ మండపంలోని మనోహర శిల్పాలు ,దండచారి అయిన వామనుడు -దానం చేస్తున్న మహాబలి, విల్లుపట్టకుండా అంజలిభద్డులై కనిపించే  రామలక్ష్మనులు ,పద్మాకారం కలిగిన చెక్కడం ఉన్నాయి అన్నమయ్య కాలంనాటికీ తిరుమల మీద రంగనాధుడు ఉన్నట్లు చెప్పవచ్చు  

ప్రతిమా మండపం


ముఖద్వారం దాటి లోపలికి ప్రవేశించగానే రెండువైపుల కొన్నిప్రతిమలు ఉన్న మండపంకనిపిస్తుంది .కుడివైపున ఉన్నప్రతిమలు-తిరుమల దేవి, శ్రీకృష్ణదేవరాయలు,చిన్నాదేవి.సువిశాలమయిన విజయయనగర సామ్రాజ్యది నేత అయిన  రాయలు సామాన్ననిలా అంజలి ఘటించి స్వామికేదురగా నిలబడం అతనిభక్తికి నిదర్సనం. రాయలు ఏదుసార్ర్లు తిరుమలనుదర్శించి విలువయిన కానుకలు ఇచ్చి,ఎన్నో సేవా కైoకర్య్యలు చేసిన మహావ్యక్తి.అలాగే దేవేరులు కూడా.ముఖద్వారం దాటాక ఎడమవైపు కనిపించి ప్రతిమలు అచుతరాయలు, వరదాజి అమ్మ.ఈ ప్రతిమల మీద పేర్లు లేని కారణంగా చాలకాలం తిరుమలరాయులగా చరిత్రుకులు బ్రమించారు.కానీ తిరుమల తిరుపతి దేవస్థానంవారు శాసనాలను సేకరించి ప్రకటించిన శ్రీసాధు సుబ్రమణ్యశాస్త్రి గారు ఈ విగ్రహాలు `వరదాజి అచ్యుత రాయలుగా` గుర్తించారు. విజయనగర పాలకుడుయినా అచ్యుతరాయలు, శ్రీ కృష్ణ దేవరాయులు లాగే ఎన్నో సేవా కైoకర్యాలు నిర్వహించిన ప్రభువు. తిరుమల కొండ మీద స్వామిసన్నిధిలో అచ్యుతరాయలు,పట్టాభిషేకం చేసుకోన్నాడని ప్రచారంలో ఉంది. ఇక్కడ ఇంకొక ప్రతిమ వెంకటిగా అనబడే వెంకటపతి రాయలది

         తిరుమల రాయల మండపం చివరలో కనిపించే ప్రతిమలు రాజా తోడరమల్ అను భిరుదు పొందిన లాలాఖేమరామ్. (ఖేమ రాముడు ఆర్కటు నవాబుల ప్రధాని) ఖేమరాముడు తల్లి మాత మోహనాది,భార్య పితబిబి. స్వామి శ్రీనివాసుని సేవించిన మహా భక్తులు

                                                                                                     

తిరుమలరాయ మండపం



రంగమండపానికి దగ్గరలోని పశ్చిమoలో మరో మండపం తిరుమలరాయ మండపం .దేనికే `అన్ణా ఉంజల్ మండపం` అని మరో పేరు. ఈ మండపాన్ని సాళువ నరసింహ రాయలు కట్టిన,విస్తరింప చేసిన చక్రవర్తి అరవిటి వంశస్తుడుయిన తిరుమల రాయాలె

  సాళువ నరసింహ రాయులు ఇక్కడే హంసాకరమయిన ఉయ్యాల ఉత్సవం జరిపెవాడట. తమిళంలో అన్ణాo అంటే హంస

తిరుమలరాయని కాలంలో ఇక్కడ వసoతోత్సవాలు జరిగేవి.బ్రహ్మోత్సవ కాలంలో ఇక్కడ ఉత్సవ మూర్తులకు చేసి అరగింపుకు ` తిరుమలరాయన్ పొంగల్` అని నేటికి వ్యవహారం

 ఈ మండపంలో దర్శించదగ్గ చెక్కడాలు-భూవరాహమూర్తి,త్రిబoగ బంగిమలోని కోదండ రాముడు  అష్టభుజ వేణుగోపలుడు, పెద్దవనమాల,పెద్ద కిరీటం కలిగిన శ్రీనివాసుడు, ఊర్ధ్వపుండ్రచారి అయిన హనమంతుడు,గానగోపాలుడు మొదలైన శిల్పాలు

సంపంగి ప్రదక్షణం


ధ్వజస్తంబం కేంద్రంగా సాగే ప్రదక్షణం సంపంగి ప్రదక్షణం. తెలుగులోని `సంపంగి`కి సమానమయిన తమిళపదం చంపగం.బహుశా ఈ ప్రదక్షిణ ఆవరణలో సంపంగి వృక్షాలు వుండి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం లేవు. లక్ష్మిదేవికి `ఆస్టానం` చంపక వృక్షమని ప్రతీతి

   సంపంగి ప్రదక్షణం నాలుగు మూలల నాలుగు మండపాలు ఉన్నాయి. సాళువ నరసింహరాయలు క్రి.శ.1470 లో ఈ మండపాలను కట్టించాడు.  భక్తులకు ఈ సంపంగి ప్రదక్షణకు అవకాశం లేదు.

సంపంగి ప్రదక్షణలో కుడివైపు వ్యాసరాయలు తప్పస్సు చేసిన ప్రదేశంగా `ఒక గుర్తు` చాలకాలంగా ఉండేది.కన్నడ హరిదాసులలో వ్యాసరాయలు ఒకరు.విజయనగర ప్రభువులయిన కృష్ణదేవరయలకు వచ్చినా `కుహూ యోగాన్ని`నివారించినాడు. తిరుమలలో ఆలయవ్యవస్థ కుంటిపడినప్పుడు ౧౨ ఏళ్ళు అక్కడ వుండి చక్కదిద్దినారు

                    ఈ ప్రదక్షనలోనే ఎన్నో అరలున్నయి.ఉత్తర దిశలోని యామునైతురైలో పులామాలలు కడతారు. తెప్పోత్సవానికి సంబందించిన వస్తువులను ఒక అరలో భద్రపరుస్తారు.`పడిప్పోటు`లో ప్రసాదాల తయారీ జరుగుతుంది.ప్రస్తుతం ఈ పరిసరాల్లోనే భక్తులు ప్రసాదాల వినియోగం

  వానలు పడే రోజ్జుల్లో ఆలయంబయట ఉరేగించడానికి వీలులేనే రోజుల్లో స్వామి సంపంగి ప్రదక్షనలోనే తెరిగేవారట


ధ్వజస్తంబ మండపం



తమిళంలో ధ్వజస్తంబాన్ని `కొడిక్కoబం` అని అంటారు. `కొడి`అంటే జెండా.జెండా ఎగురవేసే స్తంబమనిబావం. బ్రహ్మత్సవ ప్రారంభ సూచకంగా గరుడ ధ్వజపటాన్ని పూజించి ఆ పటాన్ని ధ్వజస్తంబం మీదకు ఎత్తించడం సంప్రదాయం.అలాగే బ్రహ్మత్సవ ముగింపు సందర్భంగా`ధ్వజారోహణ`జరుపుతారు

   నడిమి పడికావలికి చేరువలో ధ్వజస్తంబ మండపం ఉంది. ఎతైయిన బలిపీటం.దానికి చేరువలో స్తంబం రెండు ఉన్నాయి.వీటికి పూర్తిగా బంగారు రేకుల తాపడం ఉంది. ఇక్కడ రెండు వరసలలో ఉన్న ఐదైదు రాతి స్తంబాలున్నాయి. ఈ స్తంబమండపం ముందు దశావతార చిత్రాలున్నాయి.ఇక్కడున్న స్తంబాల మిద యోగ నరసింహ,మత్స్య,హనుమ,బకాసుర సంహారం,శ్రీనివాస కళ్యాణ చిత్రాలున్నాయి.ధ్వజస్తంబం మీద గరుడాఆళ్వార్,కాళీయమర్ధనాది చిత్రాలు కనిపిస్తాయి

  కొండ మీదున్న స్తంబం చందన దారు స్తంబం .ఈ స్తంబం పడయిపోగా శ్రీ పీ.వి.ఆర్.కె.ప్రసాద్ గారు కార్యనిర్వహణదికారిగా ఉన్నపుడు 1980 లో పునద్దరించారు. దీనికోసం  కర్ణాటక రాష్ట్రం నుండి తగిన స్తంబం తెప్పించారు

వెండి వాకిలి

శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంబం దాటాక లోపలికి ప్రవేసించేవేళా కనిపించే వాకిలి వెండివాకిలి .ద్వారాలకు తలుపులకు వెండిరేకుల తాపడం ఇక్కడి ప్రతేయ్క్కత.ఈ వాకిలి తలుపుల మీద రమణీయ దృశ్యాలెన్నో కనిపిస్తాయి. శ్రీరామచంద్రుల ఆస్తానం, హతిరంజీ స్వామివారితో పాచికలు ఆడుతున్న దృశ్యాం తలుపులఫై కనిపిస్తాయి

రంగనాధస్వామి- గోవిందరాజస్వామి

తిరుమామణి మండపం ముందు భాగంలో అంటే గరుడాఆళ్వార్ కు వెనుకవైపు దర్సనమిస్తారు.కానీ కొందరు ఈ స్వామిని రంగనాధునిగా బావిస్తారు


                    అన్నను దర్శించి తమ్ముణ్ణి చూడడం మన సంప్రదాయం.అoచేత ఇక్కడ `గోవిందరాజు ఉన్నాడని కొందరు చెబుతారు

వరదరాజస్వామి సన్నిధి


 వెండివాకిలి నుంచి లోపలికి అడుగిడితే, శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి దాటాక ఎడమవైపు కనిపించే చిన్న ఆలయం వరదరాజస్వామి ఆలయం

  వైస్టేవానికి కంచి, శ్రీరంగం ప్రధాన కేంద్రాలు, అందువల్ల వైష్టవులుయిన యాదవ ప్రబువులు ఈ ఆలయాన్ని కట్టించారు. స్వామి `సమ బంగిమలో దర్సనమిస్తాడు.

        శ్రీనివాసుని దర్చించే భక్తులు ఈ ఆలయ ప్రదక్షణం చేసి ఆఫై `తిరుమామణి మండప` మార్గంలో లోపలికి ప్రవేశిస్తారు

తిరుమామణి మండపం

తమిళంలో `మణి అంటే గంట.మామణి అంటే పెద్ద గంట.`తిరుమంగళవాచకం.పవిత్రమయిన గంటలని అభిప్రాయం.స్వామికి నివేదన సాగేవేళా వాయిoచే గంటలున్న మండపం తిరుమామణి మండపం

       సాదారణంగా దేవాలయంలో ఒకే గంట ఉంటుంది.కానీ శ్రీవారి ఆలయంలో రెండు గంటలున్నాయి.ఒకప్పుడు ఈ గంటలు చెరోవైపు ఉండేవని ప్రతీతి. మొదటి గంట పేరు నారయణ గంట. రెండోవ గంట పేరు గోవింద గంట . కాని ప్రస్తుతం ఈ గంటలు ఒకే చోట ఉన్నాయి


   తిరుమామణి మండపాన్ని క్రి.శ 1417 లో మాధవదాసు నిర్మించాడు. ఈ మండపంలో స్వామికి ఎదురుగా గరుడుడు వుంటే ,జయ విజయ విగ్రహాలు (చండ ప్రచండ).బంగారు వాకిలికి ఇరువైపులలోనూ, కుడివైపు శ్రీవారి హుండీలు కనిపిస్తాయి. ఈ మండపం 43x40 అడుగుల విస్తిర్ణం కలది.16 స్తంబలున్నాయి. వీటిఫై రమణీయమయిన శిల్పాలున్నాయి, చతుర్బుజుడుయిన మహా విష్ణువు గజారూడుడై కనిపించే శిల్పం అరుదైయిన దృశ్యం

బంగారు వాకిలి

తిరుమామణి మండపం దాటాక కనిపించే సుందర ద్వారం బంగారు వాకిలి.ఈ వాకిలికి బంగారు రేకుల తాపడం ఉంది. ఇరువైపుల జయవిజుయుల( చండ ప్రచండ) పంచలోహ ప్రతిమలు ఉన్నాయి.ఇవి చాల అందంగా ఉన్నాయి

  ఈ ప్రతిమలకు చతుర్భుజాలున్నాయి.ఫై చేతులలో చక్ర శంఖాలు కనిపిస్తాయి.క్రింది చేతిలో `గద` కనిపిస్తుంది. మరొక హస్తం `శుచి` బంగిమలో భక్తులు శుచిగా ఉండాలని నిర్దేశిస్తుంది

                                                  బంగారు వాకిలి దగ్గర శ్రీవారికీ `సుప్రబాతసేవ` మొదలవ్తుంది

రామర్ మేడై


స్వర్ణద్వారం దాటాక భక్తులు చేరుకొనే ప్రదేశం రామర్ మేడై.ఒకప్పుడు ఇక్కడ`అవరణ`ఉండేదని ఆఫై మూసివేశారని అంటారు.దీనికి ఇరువైపుల రెండు అరుగులున్నాయి. దక్షిణంవైపు అరుగు మిద అంగద,హనుమదాదుల చిత్రాలున్నాయి.ఉత్తరంవైపు ఆరుగు మీద అనంత, గరుడ,విశ్వక్క్శేనులు కనిపిస్తారు.ఇక్కడే సీతారామలక్ష్మణ విగ్రహాలు ఉండేవని భద్రతా దృష్ట్యా లోపలికి చేర్చారని అంటారు.మరికొందరు ఇక్కడ`భూ గృహం` ఉందని అoచేతనే ఆరుగు మీద విగ్రహాలని అంటారు. ఈ విగ్రహాలు ప్రస్తుతం మడప్పళేపాత కళ్యాణమండపం మధ్యలో ఉన్నాయి

శయన మండపం


రామార్ మేడై దాటాక భక్తులు శయన మండపంలో ప్రవేశిస్తారు స్వామివారికి ఈ మండపంలోనే `ఏకాంత సేవ` జరుగుతుంది

స్నపన మండపం

స్నపన మంటే స్నానం.మునక అని అర్ధాలు. బంగారు వాకిలి దాటాక కొంచెం చీకటిగా మసక మసకగా  కనిపించే మండపం స్నపన మండపం.దీనినే తమిళంలో `తిరువిలన్ కొయిల్` అంటారు. ఇందులో నాలుగు స్తంబాలుఉన్నాయి.స్తంబాలతో చేరినట్టు చెరోవైపు గదులున్నాయి.

          క్రి.శ 966 లో సామవై అనే పల్లవ రాణి ఇక్కడ బోగశ్రినివాసమూర్తిని ప్రతిష్టించినట్లు ప్రతీతి. అయితే ఇక్కడిస్తంబాలు విజయనగర ఆలయ నిర్మాణ రూపంలో కనిపిస్తాయి. మహావిష్ణువు ఆసీన బంగిమలో కనిపించే శిల్పం.ఈ మండపంలోనే ఉంది.ఇది చాల అరుదయిన దృశ్యం

కుల శేఖరప్పడి



సయనమండపానికి గర్బగుడికి మధ్యగల శిలసోపానం కులశేఖరప్పడి సామాన్య భక్తులు  ఈ పడి దాటి గర్బ గుడి ప్రవేశించడానికి వీలులేదు

   ఆళ్వారులు 12 మంది వారిలో కులసేఖరాఆళ్వార్  చేరదేశాధిపతి.క్షత్రియుడు .శ్రీరాములవారిలాగే పునర్వసు నక్షత్రజాతకుడు.రామాయణ శ్రావణనురక్తి. వైస్టేవులఫై బరోసా.వెంకటేశ్వరస్వామిఫై భక్తి కలవాడు`దాస్యభక్తికి` విలువ ఇచ్చిన ఆళ్వార్ `పడియాయ్ కిడoదు ఉన్ పవళ్డవాయ్ కాణబ్బ్నే` అన్నాడు( గడపగా ఉండి స్వామిని చూడాలనే ఆకంక్షా) ఆoచేతనే స్వామి ఆలయంలో `సోపానంగా` నిలిచిపోవాలని ఆకాంక్షీoచాడు.స్వామిఫై 10 పాశురాలు పాడాడు

స్వామి గర్భగుడి


శ్రీవారి ఆలయంలో ధ్రువబేరం,కౌతుకబేరం,స్నపనబేరం,బలిబేరం, ఉత్సవబెరమనే మూర్తులుఉన్నాయి. శిలారూపంలో కనిపించే మూర్తి ధ్రువబేరం, బోగ శ్రీనివాసుడు కౌతుకబేరం,ఉగ్రశ్రీనివాసుడు స్నపనబేరం,కొలువు శ్రీనివాసుడు బలిబేరం,మలయప్పస్వామి ఉత్సవబేరం

   ధ్రువబేరం మనవ నిర్మితం కాదు.స్వయంవ్యక్త్ మూర్తి.ఈ స్వామిని  తనివితీర దర్శించి  తరించాడు అన్నమయ్య

మూలవర్లు


                                           ఈ మూర్తికి సంబందించిన రకరకలయిన అభిప్రాయాలూన్నాయి

జైన మూర్తి   జనసంచారానికి దూరంగా కొండ లోయలో ప్రశాంత వాతావరణంలో స్వామి , కుడివ్రక్షస్తలం ఫై `శ్రీవత్సo ఉండడం ,స్వామికి ఆదిములుడనే పేరుండడం వల్ల స్వామి `జినుడు` అని కొందరు

శివుడు   స్వామివారి ఆలయంలో రోజు అష్టాక్షరి మంత్రపటనం సాగడం,నాగాబరణుడై స్వామి కనపడడం, ధనుర్ర్మాసంలో బిల్వార్చన చేయడం, స్వామికి జటాజుటం ఉండడం, తలనిలాలు సమర్పించే ఆచారం ఉండడం, గర్బాలయంలో గోడను అంటినట్లు కాకుండా విగ్రహం ఆలయ మధ్యభాగంలో ఉండడం,మంగళవారం స్మార్ద శైవులు స్వామికిపొంగలి నైవేద్య్యం అర్పించడం, వినాయకచవితి రోజు `కుడుముల నైవేద్య్యం , శివరాత్రి రోజు స్వామికి అభిషేకం, ఆలయప్రాంగణంలో `నంది` మరి శైవమత శిల్పాలు కనబడం, స్వామికి విరూపాక్షుడనే పేరుఉండడం వల్ల స్వ్వామిని శివునిగా బావించేవారు కొందరు

ఆది శక్తి  పరందాముని వక్షస్తలం కొంచెం ఉబ్బెత్తుగా స్త్రీల వ్రక్షస్తలంగా కనిపించడం. జుట్టు ఎత్తుగా పొడవుగా కనిపించడం,గర్బాలయం ఫైన నాలుగు వైపులా దేవివాహనమయినా సింహ ప్రతిమలుoడడం,స్వామి బ్రహ్మోత్సవాలు కన్య మాసంలో నవరాత్రులలో జరగడం, స్వామివారికీ ప్రతి శుక్రవారం పసుపు, పచ్చ కర్పూరం,పునుగు,జవ్వాది, కుంకుమ,పాలు కలిపిన నీటితో అభిషేకం జరగడం, స్వామికి ఆటవికులు`ఉప్పాసులు` సమర్పించడం,బ్రహ్మోత్సవాలు ముగిశాక శాంతికోసం ఎర్రటి అన్నాన్ని వేపాకు పళ్ళెంలో పెట్టి సమర్పించే ఆచారం ఉండడం,ఔత్తరాహులు `బాలాజీ` అని పిలవడం ,స్వామి వ్రక్షస్తలం అనుకోని పొడుగాటి కత్తి ఉండడం , చీరకట్టి పూలతో గురువారం పూజ చేయడం వల్ల `ఆదిశక్తి అని కొందరు

కుమారస్వామి  కొండలమీద నిలిచే దేవుడు కావడం,స్వామిపుష్కరణి అనడంలో,స్వామి అంటే `కుమారస్వామి ` అనే రూడి ఉండడం ,దగ్గరలో `కుమారధార` ఉండడం, దక్షిణదేశంలో కుమారస్వామి ఆలయాలు దండిగా ఉండడం వల్ల కుమారస్వామి అని కొందరు

విష్ణువు   శ్రీవారికీ నాలుగు భుజాలున్నాయి ప్రలంబ సూత్రం, కటి సూత్రం ఉంది. మొదటిది యజ్ఞోపవితo,రెండొవది మ్రోలతాడు. ఈ రెండు లక్షణాలు పురుష విగ్రహలకే.దక్షిణ వ్రక్ష స్తలం ఫై`లక్ష్మి అమ్మవారి ఆకృతి ఉంది. బగవద్రామానుజులు ఈ విగ్రహం `విష్ణువు అని నిర్ణయిoచారు

  తిరుమల ఆలయం చాల ప్రాచినమైనది.ఆ కారణం వల్ల ఈ ఆలయంలో ఈ స్వామి ఆరాధనలో చాల ప్రతేక్కతలు కనిపిస్తాయి. కేవలం వైష్ణువాలయాలలో నేడు కనిపించే పద్దతులను బిన్నమయిన పద్దతులు శ్రీవారి ఆలయంలో కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం పాలకుల దృష్టి భక్తుల ఆరాధనలోని వైఛిత్రి హేతువులు,అలంకరణలు ఎక్కువ కావడం,వారంలో ఒకే రోజు మాత్రం అభిషేకం కావడం, అభిషేక దర్సనం, అందరికి వీలుపడకపోవడం వల్ల ఇప్పటికి స్వామి ఆకారం గురించి తరచు బిన్నాభిప్రాయలు వినిపిస్తాయి.కాని నిస్సంకోచంగా స్వామి విష్ణువే      

భోగ శ్రీనివాసమూర్తి


వైస్టవాలయాలలోని కౌతుకబేరం వెండిదిగా ఉంటుంది.అలాగే శ్రీవారి ఆలయంలో కూడా ఈ మూర్తిని పల్లవరాణి సామవై (క్రి.శ.966) సమర్పించిన రూడిగా తెలుస్తూ ఉంది. ఈ మూర్తికే `మణవాళ పెరుమళ్` అని పెరు

  షటచ్చక్రoఫై ఈ మూర్తి నిలబడిఉన్నాడు.శoఖచక్రాలు విగ్రహంతో కలిసి ఉన్నాయి.మూల విరాట్టు ఛాయలు ఈ మూర్తిలో కనిపిస్తాయి.నిత్యాభిషేకలు, రాత్రివేళా ఏకాంతసేవ ఈ భోగ శ్రినివసముర్తికే, ధనుర్ర్మాసంలో మాత్రం ఈ స్వామికి ఏకాంతసేవలో ప్రాదాన్న్యం లేదు


   భోగ శ్రీనివాసమూర్తికి జరిగే `తిరుమంజన` కార్యక్రమాన్ని తాళ్ళపాక కవులు వర్ణించారు

కొలువు శ్రీనివాసమూర్తి

వైస్టవాలయాలలో నైవేద్య్యం తరువాత `బలిబేర` ప్రదక్షణం ఉంటుంది. ఈ మూర్తి ద్వారా ఇతర చిన్న మూర్తులకు నైవేద్య్యం సమర్పిస్తారు. కాని శ్రీవారి ఆలయంలో ఈ విధానం లేదు.ఈ మూర్తి ప్రదక్షణం లేకనే చిన్నమూర్తులకు నైవేద్య్యం సమర్పణ సాగుతుంది
  తోమాలసేవానంతరం తిరుమామణి మండపానికి ఈ మూర్తిని వెంచెపు చేయిస్తారు.రజత సింహాసనంలో బంగారు గొడుగు కింద స్వామి అసినులుఅవుతారు.మైసూరు మహారాజా వారు ఈ గొడుగు సమర్పించారట.అర్చకుడు మహారాజ మర్యాదలు చేయగా స్వామి అర్చకుని దక్షిణతాoభూలాదులతో సతక్కరిస్తారు. ఆఫై స్వామికి `పంచాంగం`- తిధి,వార, నక్షత్ర,యోగ,కరణాలు, గ్రహసంచార విశేషగతులు.ఉత్సవాది విశేషలను వినిపిస్తారు. ముందు రోజు భక్తులు సమర్పించిన కానుకలను విశదంగా వినిపిస్తారు.అఫై శ్రీవారికి `గుడమిశ్రిత తిలచూర్ణం( బెల్లంతో కూడిన నువ్వు పిండి) నివేదిస్తారు.ఆఫై హారతి కార్యక్రమం సాగుతుంది.కొలువు చాలింఛి మహారాజ మర్యాదలతో శ్రీవారు స్వస్టానం చేరుకొంటారు

    శాసనాలలో ఎక్కడా కొలువు శ్రీనివాసమూర్తి ప్రశంస లేదు.ఈ పంచాంగ శ్రవణం, కానుకల పట్టి సమర్పణ లాంటివి ఎపుడు ప్రారంభమయాయో తేలియదు




ఉగ్ర శ్రీనివాసమూర్తి-


శ్రీవారి ఆలయంలోని స్నపనమూర్తి ఉగ్ర శ్రీనివాసుడు ఈ స్వామిని `వెంకటత్తురైవర్ అంటారు.శ్రీదేవి భూదేవిలతో స్వామి కనిపిస్తారు. ఈ మూర్తి చేతిలో చక్రం ప్రయోగ బంగిమలో కనిపిస్తుంది

  భోగ శ్రీనివాసమూర్తి లేని కాలంలో ఈ స్వామికి ప్రాదాన్యముoడేది. అంతే కాకుండా తిరువిదులలో ఈ స్వామి ఉరేగేవాడట .ఒక బ్రహ్మత్సవకాలంలో స్వామి ఊరేగే వేళా మంటలు లేవడం, ఇళ్ళు కాలిపోవడం లాంటివి జరుగగా ప్రజల ప్రాద్దనతో గర్బ గుడిలోనే నిలిచిపోయారు. మహాసంప్రోక్షణం, గ్రహణకాలంలో ఈ స్వామికి తిరుమంజనం జరుగుతుంది ద్వాదశారాధాన ఉత్థాన ఏకాదశి ముక్కోటి ద్వాదశి పర్వదినాలలో ఉగ్రశ్రీనివాసమూర్తికి  పూజలు జరుగుతాయి,కైశికీ ద్వాదశి రోజు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఉబయనాంచారులతో బంగారు తిరుచ్చిలో వెoచేసీ ఆనందనిలయం విమాన ప్రదక్షణం చేసి నాలుగు వీధులలో ఊరేగే సూర్యోదయాతూప్పార్యం జరుగుతుంది కైశికభక్త చరిత్ర కాలక్షేపం జరుగుతుంది. ప్రసాద వినియోగానంతరం శ్రీవారు సన్నిదానం చేరుకొంటారు.

   సూర్యుని కిరణాలూ ఈ స్వామిని తాకరాదని,ఒక వేళా అలా జరిగితే అనర్దమని పెద్దల నమ్మకం


మలయప్పస్వామి-ఉత్సవమూర్తి-


 శ్రీవారి గర్బలయంలోని ఉత్సవమూర్తికే  మలయప్పన్ అని పెరు .మూలబేరానికి ఈ మూర్తికి నిర్మాణంలో తేడా లేదు. కాకపోతే ఈ మూర్తి పంచలోహమూర్తి.3 అడుగుల ఎతున్న మూర్తి. శ్రీదేవి భూదేవులతో ప్రకాశించే రమణియమూర్తి .క్రి.శ.1339 శాసనంలో ఈ మూర్తి ప్రశంస కనిపిస్తుoది

             తిరువిధులలో జరిగే అన్ని ఉత్సవాలు, కల్యాణ్ఉత్సవ వగైరాలన్నీ ఈ ఉత్సవమూర్తికే ప్రతేయ్య్క సమయంలో ఉత్సవమూర్తికి  వజ్రాంగి ముత్యాల అoగి అలంకరణ చేస్తారు