శ్రీవారు -బ్రహ్మోత్సవాలు

బ్రహ్మ` అంతటివాడు ముందు నిలబడి జరిపించే ఉత్సవం కనుక బ్రహ్మోత్సవం కనివిని ఎరుగని పద్దతిలో ఆత్యశ్చర్యకరంగా సర్వ జనసన్మోదకరంగా జరిగే ఉత్సవం కనుక బ్రహ్మోత్సవం

   శ్రీవారికి సౌరమానం ప్రకారం కన్య మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చాoద్రమాసం ప్రకారం భాద్రపద మాసంలో ,ఆశ్వయుజమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అధిక మాసం వచ్చినప్పుడు రెండు సార్లు ఉత్సవాలు జరుగుతాయి. రెండోవ ఉత్సవాన్ని `నవరాత్రి ఉత్స్తవలుగా చెప్పడం అలవాటు. మొదటి ఉత్సవానికి ధ్వజారోహణ,ద్వజావరోహణలు తప్పనిసరి. కానీ రెండోవ బ్రహ్మోత్సవంలో ఈ రెండు లేవు

 అంకురార్పణతో బ్రహ్మ్మోత్సవం ప్రారంబంఅయినట్లే.అయితే ధ్వజారోహణ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవ ప్రారంభంగా భక్తులు బావిస్తారు

   మొదటి రోజు సాయంకాలం అనంత,గరుడు, శ్రీవారి సేనాధిపతి విషవాక్సేనులవారు గ్రామోత్సవాలకు బయలుదేరి తిరువిదులలో ఊరేగే శ్రీవారి ఆలయంలో కల్యాణమండపంలోను యాగశాలలో అంకురారోపానికి అవసరమమైన ``మన్ను ` సంపాదించి ఆలయానికి చేరుకొంటారు

   శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవం యజ్ఞహోమాలతో ప్రారంభo అవుతుంది. ధ్వజారోహణ సమయంలో మలయప్పస్వామి ఉభయ నాంచారులతో తిరుమలరాయ మండపానికి వెంచేస్తారు

  గరుత్మంతుని రూపం చిత్రించిన నూతన కేతనాన్ని శ్రోతియులు వేదం పటిస్తుండగా,మంగళవాద్యాలు మ్రోగుతుండగా ,ఆలయ ధ్వజాస్తంభంఫై ఎగురవేస్తారు.దీనితో బ్రహ్మోత్సవం ప్రారంభం అయినట్లే

   ఉత్సవాలకు బ్రహ్మసారధ్యం సంకేతంగా ఎటువంటి ఉత్సవమూర్తులకు లేని ఖాళే బ్రహ్మారధాన్ని ప్రతి రోజు మలయప్పస్వామి వారి ఊరేగింపు ముందు నడిపిస్తారు. తాళ్ళపాక అన్నమయ్య తన కాలంనాటి బ్రహ్మొత్సవాలకి ఎన్నో సంకిర్తనల్లో వర్ణించాడు

                                                  పెద్ద శేషవాహనం

 బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు రాత్రి స్వామి ఉభయ నాంచారులతో ఊరేగే వాహనం పెద్ద శేష వాహనం

  స్వామి నిత్యసూరి వర్గంలో శేషుడొకడు.స్వామికి క్షీరసాగరంలో పరమపదంలో గృహంగా,శయన మందిరంగా,పడుకగా, అసనంగా,పాదుకలుగా,వస్త్రంగా, దిండుగా, గొడుగుగా-ఆయా అవసరాలకు తగినట్ట్ల్లు మారి కైoకర్యం చేసే మూర్తి .స్వార్ధం లేనే దాస కైoకర్యనికి `శేషుడు` ప్రతిక

                                                          చిన్న శేషవాహనం

 బ్రహ్మోత్సవాలలో రెండోవ రోజు ఉదయం మలయప్ప మాత్రం ఊరేగే వాహనం చిన్న శేషవాహనం.ఈ వాహనంలో ఐదు పడగల శేషుడు ముఖ్యుడు.శ్రీరంగనాధస్వామి ఉత్సవ విగ్రహం కొంతకాలం తిరుమలలో ఉండేదని ప్రసిద్ధి. ఈ స్వామి గౌరవసూచకంగా చిన్న శేష వాహనం ఆచరణలోనికి వచ్చిందని పెద్దలంటారు. అందువల్లనే మలయప్ప మాత్రం ఉరేగడం

                                                     హంస వాహనం

బ్రహ్మోత్సవంలో రెండోవ రోజు రాత్రి మలయప్ప ఊరేగే వాహనం హంస వాహనం

               వీణాపాణి, చదువులరాణి సరస సద్గుణ నికురంబగా ప్రశస్తి కేక్కిన శారదాంబకు ప్రతిరూపంగా కల్పించిన రూపమే ఈ హంస వాహనం.హంస పాలలోని నీళ్ళను వదిలి పాలను త్రాగే విధంగా భగవంతుడు పాపాలను క్షమించి వాత్సల్యంతో దగ్గరికి చేరదిస్తాడని చెప్పడం కోసం ఈ హంస వాహనం.పరమహసుడైనవాడు పరమాత్మా.అతడు హంస వాహనం ఫై అనుగ్రహించడం జ్ఞానమార్గానికి తగిన అవధారణను చేకూరుస్తుంది

                                                                

  సింహ వాహనం

  బ్రహ్మోత్సవం వేళా మూడవరోజు ఉదయం మలయప్ప, యోగనరసింహస్వామి రూపంలో ఊరేగే వాహనం సింహవాహనం

  వనరాజు,మృగరాజు సింహం  గాంభీర్యానికి దక్షతకు ప్రతిక సింహం

  దుష్ట శిక్షణలో భాగంగా దుర్మార్గుడైన హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీమహావిష్ణువు ధరించిన అవతారం నరసింహవాతరం.ఈ వ్రుతంతాన్ని భక్తులకు కనులకు కట్టినట్లు చూపించడాని కోసం సింహవాహన ఉత్సవం నిర్వహిస్తారు

  వజ్రకిరీటం,చెవులకు రవ్వలపోగు,శ్రీవత్సం,లక్ష్మి కౌస్తుభం- ఈనాటి అలంకరణలోని ప్రతేయ్కత

                                                         ముత్యపు పందిరి వాహనం

  బకాసురుని వధించిన బాలకృషుని అవతార రూపంలో ఈ వాహనం మీద మలయప్పస్వామి ఉభయ నాంచారులతో తిరువీధులలో సంచరిస్తారు. ఈ వాహన సేవను ముత్తు పందల్,ముత్యపు పందిరి అని అంటారు

   [ప్రజల నుండి వసూలు చేసిన [పన్నులు,సుంకాలు,ఇతర బహుమతుల్ని భద్రపరచిన ప్రభువు కరువు కాటకాల క్లిష్ట పరిస్టితుల్లో ప్రజలను ఆదుకుంటారని చెప్పడం ఈ వాహనం పరమార్దం

ముత్యపుపందిరిని ఆదిశేషుని వేయి పడగలకు ప్రతిక. శేషుని పడగల నీడలో స్వామి ముత్యాల పందిరిలో నిలిచినట్టు శుక మహర్షికి కనబడ్డాడు(పద్మ పురాణం)

                                                               కల్పవృక్ష వాహనం

బ్రహ్మోత్సవం వేళా నాలుగోరోజు ఉదయం మలయప్ప శ్రీదేవి భూదేవులతో ఊరేగే వాహనం కల్ప వృక్ష వాహనం ఇది  రాజమన్నార్ అవతారం

  కల్పవృక్షం,కామధేనువు,చింతామణి మొదలయినవి కోరిన కోరికలను ప్రసాదిస్తాయని నమ్మకం తనను శరణు జొచ్చిన భక్తుల కోరికలను స్వామి నెరవేరుస్తారని చెప్పడానికే కల్ప వృక్ష వాహనం ఫై స్వామిని ఊరేగిస్తారు  కల్ప వృక్షం సకల ఫలప్రదాయకం.అన్ని వృక్షములు ఆయా ఫలములనిస్తే కల్పవృక్షం. అన్ని వృక్షముల ఫలాలను కోరిన వెంటనే ఇవ్వగలదు.అటువంటిదానికి ప్రభువు శ్రీనివాసుడు అని అంతరాద్దం.

                                  

      సర్వభూపాల వాహనం

ఏడడుగుల ఎత్తు ,పూర్తీ బంగారు రేకులతో నిర్మించిన వాహనం `సర్వ భూపాల వాహనం` సమర భూపాలవాహన మన్న పేరు శాసనంలో కనబడుతుంది.దేవచోడవంశానికి చెందిన మట్టకుమార అనంతరాయలు ఇచ్చిన వాహనాలలో ఇది ఒకటి.శాలివాహన శకం 1550 లో (క్రి.శ 1628) అయన చేసిన ధర్మకార్యాలను గురించి వివరముల తెలిపే శాసనం పాదాల మండపంలో ఉన్నది. పేరులోనే సాదృశ్యoఉన్నదీ. ఇది గమనించదగ్గ అంశం. సర్వ భూపాల వేషధారిగా మలయప్పస్వామి నాల్గోవరోజు రాత్రి ఉభయ నాంచారులతో ఊరేగే వాహనం

                                              

      మోహిని అవతారం

  బ్రహ్మోత్సవాలలో ఐదోవ రోజు ఉదయం మలయప్పవారు `మోహిని` రూపంలో దంతాల పల్లకిలో తిరువిదులలో ఊరేగుతారు.తోడుగా శ్రీకృష్ణ స్వామి మరొక పల్లకి వాహనంలో కొంచెం వెనుక వస్తారు

   ఉత్సవమూర్తి మాములుగా నిలబడే బంగిమలో కాకుండా ఆసీనులై బంగిమలో కనపడడం విశేషం స్త్రీలు ధరించే అన్ని ఆభరణాలతో స్వామివారిని అలంకరించడం ఒక ప్రతేయ్కత.సాదారణంగా వరద భంగిమలో కనిపించే స్వామివారి కుడి హస్తం మోహిని అలంకరణలో అభయ హస్తముద్రతో ఉండడం ఒక ప్రతేయ్కత.స్వామివారికి పట్టు చీర,కిరీటం ఫైన రత్న ఖచితమయిన సూర్య చంద్ర సావేరి ,నాసికకు వజ్రఖచితమయిన ముక్కు పుడక,బులాకి,శంఖచక్రాల స్టానంలో రెండు వికసించిన స్వర్ణ కమలాలను అలంకరిస్తారు

            దేవతలు,రాక్షసులు క్షీరసాగరం మదించి అమృతం దక్కగా మాకు మాకని మధనపడేవేళా దుష్టుల్ని శిక్షించడానికి శిస్ట్టుల్ని రక్షించడానికి అతిలోక మోహన మయిన ఆడరూపం ధరించి సురులకు సుధా ప్రధానం చేసిన జగన్మోహన రూపమే మోహిని అవతారం

                                                   గరుడ వాహనం

బ్రహ్మోత్సవాలలో అయిదో రోజు రాత్రి మలయప్ప స్వాములవారు ఊరేగే వాహనం గరుడ వాహనం.

  మూలవిరాట్టుకున్న మకరకంఠీ,లక్ష్మిహారం మొదలైన వాటిని ఉత్సవమూర్తులకు అలంకరించడం ఈ వాహనం నాటి ప్రతేయ్కత.తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి అండాళ్ అలంకరించుకున్న పూలమాలను స్వామికి అర్పించడం మరో ప్రతేయ్కత. అలాగే కాలినడకన మదరాసు నుండి తేచ్చిన గోడుగుల్న్ని ఈ స్వామి గ్రహించడం,ఉరేగించడం, ఇంకొక ప్రతేయ్కత.అంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆనవాయితిగా పట్టు వస్త్రాలు పంపడం, స్వామివారు ధరించడం మరొక ప్రతేయ్కత

  కొత్త గొడుగుల నీడలో ,బంగారు గరుడునిఫై వెంచేసి వరదహస్తుడై స్వామి తిరువిదులలో ఉరేగడం రమణీయమయిన దృశ్యం,పదిరోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో ఇది పరాకాస్ట

            గరుత్మoతుడు నిత్యసూరి,స్వామికి దాసుడు,సఖుడు,వాహనం, పతాకచిహ్నం,గరుత్మoతునికి తెలియని స్వామి రహస్యాలు లేవు. గరుడని `పెరియతిరువడి` అనడం వైస్టవ సంప్రదాయం

  గరుడారూదుడైన ఈ స్వామిని అన్నమయ్య వర్ణించిన తిరు మనోహరం

                                                    హనుమద్వాహనం

 బ్రహ్మోత్సవాలలో ఆరవనాటి ఉదయం స్వామివారు ఊరేగే వాహనం హనుమద్వాహనం

త్రేతాయుగంనాటి రాముడే వేంకటేశ్వరుడని నిరూపించడం ఈ వాహనంలోని పరమార్దం.వైస్థవులు హనుమంతుని `సీరియత్తిరుమడి` అంటారు. గరుత్మంరుడు పెరియత్తిరువడి.

   బృత్యుల్ని కూడా మన్నించి వారికీ ఉపకారం చేయడం ప్రభువుల విధి. శ్రీరాముడే దేవుడని కొలిచిన భక్తుడు హనుమంతుడు.తన భక్తితత్పరతను చాటిన హనుమంతుడు ద్వార భక్తులు స్పూర్తి పొందడానికి వీలుగా హనుమంత వాహనంఫై స్వామి ఉరేగడం ప్రతేయ్కత. సాయంవేళా స్వర్ణరధసేవ జరగడం విశేషం

                                                     గజ వాహనం

 బ్రహ్మోత్సవాలలో ఆరోవరోజు రాత్రి మలయప్ప ఊరేగే వాహనం `గజ వాహనం`

 మొసలి వారికీ చిక్కిన ఏనుగును మహావిష్ణువు రక్షించడం `గజేంద్ర మోక్షం` అలగే శరణాగతులయిన వారిని తాను రక్షిస్తానని చెప్పడాని కోసం `గజ వాహనం`

 `నిషాదం బృంహతే గజః సాధకుడు సుషుమ్నా వాడి యందు లేచేటప్పుడు బుస్సుమనే ధ్వనితో లేస్తాడని యోగశాస్త్రం చెబుతుంది

`గజం` అహంకారానికి ప్రతిక. అహంకారాన్ని అణచిన మనిషి ఆరాధ్యడవుతాడు.అహంకారం భగవంతుని దగ్గర దాసోహమంటుంది

                                                  సూర్యప్రభ వాహనం

  బ్రహ్మోత్సవంలో ఏడోవ రోజు ఉదయం మలయప్ప ఊరేగే వాహనం సూర్య ప్రభ వాహనం

 సూర్యుడు కర్మసాక్షి.చరాచర ప్రపంచానికి వెలుగును ప్రసాదించే ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు.సూర్యమండలం మధ్యస్టుడని శంఖాచక్ర గదాయుదదారి అనే అర్ధంలో `సూర్య ప్రభ వాహనం జరుపుతారు

 సూర్యుని కుడా శాసించేవాడను నేనే. అనే అర్ధంలో `సూర్యప్రభ వాహన` ఆరూడుడై స్వామి ఊరేగుతారు

కపిలతిర్ధం వైపుగా కొందేక్కి వచ్చే దారి మార్గం `ఇడా` అనబడే సూర్యనాడి మార్గం. ఈ దారిలో వచ్చినవారు నన్ను దర్శించగలరనే అర్ధంలో ` సూర్యప్రభ వాహనం` జరుగుతుందని కొందరు యోగికార్ధం చెబుతారు.దక్షిణ దేశంలోని వైస్టవాలయాలలో ఎక్కడ లేనంతటి ఎత్తుయిన రమణీయమైన సూర్యప్రభ వాహనం మలయప్పకే ఉంది

                                                        చంద్ర ప్రభ వాహనం

 ఏడవరోజు రాత్రి `మలయప్ప` ఊరేగే వాహనం చంద్ర ప్రభ.చంద్రుడు ఓషధీశుడు.భగవంతుడు చంద్రుని రూపంలో ఓషధులను పోషిస్తున్నాడనే అర్ధంలో చంద్రప్రభ వాహనం.అంతేగాక చంద్రుని కూడా శాసించే మూర్తి తానేఅని చెప్పడం మరొక విశేషార్ధం

                                                                 రధోత్సవం


 బ్రహ్మోత్సవం ఎనిమిదవరోజు ప్రాతఃకాలం స్వామి రధంలో శ్రీభూసహితంగా ఊరేగుతారు. శరీరమే ఒక రధం. పంచేంద్రియాలే గుర్రాలు.మనసు వాటిని అదుపు చేసే పగ్గం.ఆత్మ రధచోదకుడు స్వామి అని శాస్త్రాలు చెబుతున్నాయి.ఇంద్రియాలను అదుపుచేసి నరతత్వం నుండి నారాయణతత్వం వైపు పయనించగలిగితే శరీర రధం భద్రంగా ఉంటుంది. ఈ భావాన్ని చాటి చెప్పడానికే రధంలో శ్రీవారిని తిరువిదులలో ఊరేగిస్తారు.`రధస్టం కేశవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అనే నమ్మకం ప్రకారం రధారూడుడైన స్వామిని దర్శించి భక్తి విశ్వాసాలతో రధం లాగుతూ గోవింద నామస్మరణం చేస్తూ భక్తులు ఆనందపరవశులు కావడం ఈనాటి విశేషం.

                                                                  స్వర్ణ రదోత్సవం

స్వర్ణరధం స్వామి వాహనాలలో చేరిన కొత్త వాహనం అని చెప్పాలి. కొయ్యతేరుకు బంగారు కవచం వేయడంతో తయారైనది. దీని అంచనా ఖర్చు రెండున్నర కోటి రూపాయలు. 780 కిలోగ్రాముల తామ్రపత్రాలఫై 28 కిలోగ్రాముల బంగారపు రేకుల తాపడం,రాసాయనిక క్రియతోఅతికించబడింది.రామ.కృష్ణ,ఆంజనేయ,గరుడ,వరహః,కచ్చప-మున్నగు ఉబ్బు చిత్రాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాలలో హనుమంత వాహనం తరువాత రధరంగడోలోత్సవం జరిగేటపుడు ఈ బంగారు రధం వాడుకలో వస్తుంది.మూడేళ్ళకోక మారు అధికమాసం వచ్చిన సంవత్సరంలోని రెండోవ బ్రహ్మోత్సవంలో కూడ బంగారు రధమే స్వామికి వాహనం అవుతుంది

                                                                

       ఆశ్వవాహనం

 బ్రహ్మోత్సవంలో ఎనిమిదవ రోజు రాత్రి స్వామి ఊరేగే వాహనం `ఆశ్వ వాహనం`

ఇంద్రియాలకు గుర్రలుగా చెప్పడం గుర్రాలను అదుపులోకి తెచ్చుకోవాలనడం అద్యాత్మికత విషయం. ఇంద్రియ శాసకున్ని నేనే అనే అర్ధంలో ఈ `వాహనం` అలాగే అదుపు అజ్ఞలేనే గుర్రాల లాంటి పావుల్ని జీవుల్ని అదుపులో పెట్టగాలనని నిరుపించాదనికే ఆశ్వవాహనం

   అన్ని దేశాలకు అన్ని లోకాలకు అధిపతిని నేనే అనే అర్ధంలో ` ఆశ్వ వాహనం``

                                                               


                                         చక్రస్నానం


బ్రహ్మోత్సవాల ముగింపు సందర్బ్బంగా తొమ్మిదోవ రోజు ఉదయం పల్లకి ఉత్సవం అనంతరం `చక్రస్నానం మహోత్సవం జరుగుతుంది

 శ్రీ వరాహస్వామి ఆలయ ప్రాంగణంలోనికి శ్రీదేవి భూదేవి సహిత శ్రీ మలయప్పస్వామిని శ్రీ సుదర్శన చక్రత్తాఆళ్వార్తో కుడా వెంచేపు చేయిoఛి పంచామృతస్నపన తిరుమంజనం చేస్తారు. తరువాత శ్రీ సుదర్శన చక్రత్తాఆళ్వార్ను శ్రీవారి పుష్కరిణిలో మూడు సార్లు ముంచి పవిత్ర స్నానం చేయిస్టారు.ఈ చక్రస్నాన సమయంలో వేదమంత్రోచరణ సాగుతుండగా భక్తులు  ముక్త కంఠoతో గోవింద నామచ్చరణ చేస్తూ పుష్కరిణిలో `మునకలు వేస్తారు. చక్రస్నానానికి ఆవబృధస్నానమని పేరు

  బ్రహ్మోత్సవం పూర్తిఅయినందుకు ఈ చక్రస్నానం గుర్తుకూడా.ఈ సందర్బ్బంలో భక్తులు స్నానం చేస్తే పాపవిముక్తి,శత్రుమర్దనం, వాక్ వృద్ధి, ధనధాన్యసంపత్తులు, విష మృత్యు నాశనం, రాజ్యపదవులు సిద్ధిస్తాయని పెద్దల నమ్మకం

                                                              తెప్పోత్సవం

తిరుమలలో శ్రీవారికి స్వామి పుష్కరిణిలోలో జరిపే మహోత్సవం తెప్పోత్సవం.ఈ ఉత్సవాలు ఫాల్గుణ శుద్ద ఏకాదశినాడు మొదలయి పూర్ణిమదాక సాగుతాయి.తమిళంలో దీనిని `తిరుప్పళ్ళ్ ఓడం తిరునాళ్`అని అంటారు

  మొదటిరోజు శ్రీరామచంద్రులు సీతాలక్ష్మణులతో సువర్ణ తిరుచ్చిలో వెంచేసి నాలుగు వీధుల ఊరేగుతారు.ఆ ఫై `తెప్పను` అధిరోహిస్తారు.మంగళవాద్యలతో వేదఘోషలతో మూడు మార్లు పుష్కరిణిలో ప్రదక్షిణం చేసి శ్రీవారి సన్నిధిని చేరుకొంటారు.

  రెండోవరోజు శ్రీశ్రీకృష్ణస్వామివారు రుక్హ్మినిఅమ్మవార్ల్లతో ఆ ప్రకారంగానే వెచ్చేసి మూడుమార్లు ప్రదక్షణం చేసి శ్రీవారి సన్నిధిను చేరుకొంటారు

మూడోవరోజు శ్రీ మలయప్పస్వామి శ్రీభూదేవులతో విచ్చేసి మూడు పర్యాయాలు,నాల్గోవరోజు 5 పర్యయాలు,ఐదోవరోజు 7 పర్యాయాలు ప్రదక్షణం చేస్తూ నయనానందకరంగా భక్తుల్ల్ని కటక్షిస్తారు.తరువాత శ్రీవారి సన్నిధిని చేరుకొంటారు

ఈ ఉత్సవం సాళువ నరసింహరాయల కాలం క్రి.శ 14 వ శతాబ్దం నుండి ఉంది.తాళ్ళపాక అన్నమయ్య సంకిర్తనలో `స్వామి పుష్కరణి`కి సంభందించిన ప్రస్తావన కుడా ఉంది

                                                         తన్నీర్ వళు ఉత్సవం


 తిరుమలలో ఉండి స్వామివారి కైoకర్యానికి నుడుము కట్టిన మొదటి వ్యక్తి తిరుమలనంభి.శ్రీవారి సేవ నిమిత్తం ` పాపవినాశన తిర్డ్డం` నుండి రోజు కడవేడు నీరు తెచ్చేవాడు.అతణ్ణి శ్రీవారు పరిక్షించదలచాడు. ఆటవికుని రూపంలో వచ్చాడు. దాహామని బ్రతిమాలాడు.నంభి నిరాకరించాడు. నంభి నడుస్తుండగా కుండకు రంద్రం చేసీ నీరంతా త్రాగేసాడు. తిరుమల చేరాక కుండలో నీరు లేకపోవడం గుర్తించి మరల నంభి పాపవినాశనం బయలుదేరాడు. వృద్దాప్యం కారణంగా దారిలో మూర్చ పోయాడు. స్వామి ప్రత్యక్షమై నంభి సేద తీర్చి రోజు నీటికోసం పాపవినాశనం వెళ్ళనవసరం లేదని దగ్గరలోనే మరొక పవిత్ర జలాశయంఉందని `ఆకాశ గంగను` చూపించి అంతర్ధానంమయ్యాడు. తిరుమలనంబికి ప్రత్యక్షమయిన ప్రదేశంలో స్వామి పాదాలు-ఒక మండపం, మండపం సమీపంలో ఈ కధను సూచించే శిలాశాసనాలున్నాయి.ఈ సంఘటనకు గుర్తుగా డిసెంబర్లో `తన్నీర్ వళు ఉత్సవం ` నిర్వహిస్తారు.కుంభాకానికి హారతులు ఇస్తారు

                                                            గంధవడి ఉత్సవం

ఈ ఉత్సవానికి ప్రణయకలహోత్సవం,సంధానసేవోత్సవం అనే పేర్లు ఉన్నాయి. వడిఅనే మాటకు పెనుగులాట అని అర్ధం.ఉన్న గంధము పోవడంవల్ల వడి లేని గంధం కలగడం వల్ల వడి అని రెండుర్ధాలు.ఈ ఉత్సవ ప్రసక్తి పురుషోత్తమ సంహితంలో కనిపిస్తుంది.

 బ్రహ్మోత్సవంలో పూర్ణాహుతి,గరుడపటం అవరోహణ జరిగాక స్వామివారు దోపుత్సవానికి వెళతారు అపుడు తిరుమంగై ఆళ్వార్ చరిత్రను హరికధగా చెబుతారు.ఆ తరువాత తిరువీధి ఉత్సవానికి స్వామి వెంచేస్తారు.ఆలయానికి వచ్చిన తరువాత హెచ్చరికలు అనే పేరుతో కవాట బంధనోత్సవం నిర్వహిస్తారు.దేవి గృహంలో ఉన్న స్వామివారు లోనికి రాకుండా ఉండే విధంగా కవాటాలు మూసినట్లు,స్వామి కవాటం తీయమని ప్రాద్దిoచే విధంగా లక్షినారాయణ సంవాదాత్మాకమయిన పాటలు పాడి ఈ ఉత్సవాన్ని అనుకరిస్తారు.ఆ తరువాత గంధవడి ఉత్సవం.మధ్యాహ్నం ఆరాధన ముగిశాక శ్రీ మలయప్ప స్వాములవారు తిరుచ్చిలో వెంచేసి మహాప్రదక్షణంగా సకల్ పరివారంతో  ఏకాంగి మఠo ముందుకు వెంచేస్తారు తరువాత ఉభయనాంచారులు మరొక తిరుచ్చిలో వెంచేసి ఆప్రదక్షనంగా శ్రీవారికి ఎదుట నిలుస్తారు

ఉభయనాంచారుల వద్ద నుండి స్వామి వారి వెనుకకు మూడు పూల చెండ్లు వేస్తారు. ఆ కారణంగా స్వామివారు వెనకడుగు వేసినట్లు కదులుతారు. ఆ సంధర్బ్బంలో నమ్మాళ్వారు తిరువయిమొళే మిన్నిడై మీదవారై పాశురాలను అనుసంధానం చేస్తారు.ఈ ప్రకారం మూడు పర్యాయాలు జరిగాక పురాణం పూర్తి అయ్యాక స్వామివారికీ ప్రదక్షనంగా ఉభయనాంచారులు ఏడమవైపు వెంచేస్తారు.ఆఫై శ్రీవారు శ్రీ భూదేవులు పూలమాలికలు మార్చుకొంటారు.ఆఫై శ్రీవారు తాయార్ర్లు కళ్యాణమండపానికి వెంచేస్తారు

  వేటకు వెళ్ళిన నారాయణుని వస్త్రాలు,వాడిన కన్నులు,శరీరం మీద గాయాలు చూచి లక్ష్మి నిందించడం,స్వామి తానేమి తప్పు చేయలేదని చెప్పడం. అవసరమయితే విషం త్రాగుతానని,అగ్నిలో దుకుతానని ప్రతిజ్ఞా చేస్తే నీవురాముడవు కాదు గదా అని నిందించడం.  పుత్రసమానుడయిన విషవ్వక్సేనుని చూచిఅయిన తప్పులు క్షమించమని కోరడం,అలనాటి సితావతారం స్మరించుకొని క్షమించమని కోరగా లక్ష్మి శాంతించడం ఇందులోని ప్రతేయ్కత

                                                                       రధసప్తమి

తిరుమలలో ప్రతి సంవత్సరం మాఘశుద్ద సప్తమి శుభదినంలో సాగే మహోత్సవం రధ సప్తమి ఉత్సవం ఇది ఇంచుమించు బ్రహ్మోత్సవం లాంటివే కన్నడిగులు రధసప్తమిని సంక్రాంతితో సమానంగా జరుపుకొంటారు

శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభ,గరుడ వాహనం,శేషవాహనం,హనుమద్వాహనం,కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనాలలో ఒకే రోజు ఉదయం నుండి సాయంకాలంలోగా ఉరేగడం ఈ ఉత్సవం ప్రతేయ్కత.మధ్యాహ్న వేళలో మాత్రం శ్రీ చక్రత్తాఆళ్వార్ శ్రీ వరాహస్వామి మండపానికి విచ్చేసి పంచామృతాభిషేకం స్వీకరించి స్వామి పుష్కరిణిలో అవగాహు చేస్తారు. రధ సప్తమి రోజు ఏడు వాహనాలలో ఉరేగడం బ్రహ్మోత్సవాలలో లాగే వాహనాల ప్రమేయం ఎక్కువ ఉండడంవల్ల రధసప్తమికి ఎంతో ప్రాముఖ్యముంది

 ఒకప్పుడు కొండమీద నాలుగు బ్రహ్మోత్సవాలు జరిగేవట.పురట్టసీవెల,రధసప్తమి,కార్తికమాసంలో కైశికీ ఏకాదశి,వైకుoఠ ఏకాదశి రోజులలో,కాని రధ సప్తమి రోజు మాత్రం వాహనాల ఊరేగింపు నేటికి ఉంది. పేరుకు రధసప్తమి అయినా ఈ రోజు రధం ఉండదు

                                                      పురిశైతోట ఉత్సవం

తిరుమలలోస్వామి పుష్ప కైoకర్యం కోసం చెరువును త్రవ్వింఛి తోట నిర్మించినవాడు అనంతాఆళ్వాన్,అనంతాఆళ్వాన్ తోటలోని పూలు అందంగా పూసేవట. శ్రీవారు పద్మావతితో రాకుమారుని వేషంలో పూల దొంగతనం చేసేవారట. వారం రోజులు కాచి ఆళ్వాన్ చివరకు శ్రీవారిని పట్టుకున్నాడు. శ్రీవారు తప్పించుకొన్నాడు. పద్మావతి దొరికిపోయింది. తన్ను వదిలి తన భర్తను పట్టుకొమ్మని ప్రాద్ధించింది.మరుసటి రోజు విషయం తెలిసి ఆళ్వాన్ ఆ తల్లిని పూలబుట్టను నెత్తిన పెట్టుకొని పోయి ఆలయంలో శ్రీవారికి అప్పగించి వచ్చాడు. ఈ సందర్బాన్ని పునస్కరించుకొని బ్రహ్మోత్సవం ఏర్పాటు జరిగిందని పెద్దలు చెబుతారు. పద్మావతి దేవి ఊరేగింపు `పెరటాసి మాసంలోనే జరిగిందట.ఈ గుర్తుగా ఉత్సవం కుడా జరుగుతుంది

ధ్వజ అవరోహణ జరిగిన మరుసటిరోజు `శ్రీవారి బాగ్ సవారీ ఉత్సవం` బాగ్ అంటే తోట. శ్రీవారు తోటకు వెళ్లాడమని అభిప్రాయం. మలయప్పస్వామి, శ్రీభూదేవులతో తిరుచ్చి అధిరోహించి వాహన మండపానికి వెంచేస్తారు. అక్కడ ఆస్థానం జరుగుతుంది. తదనంతరం ఆప్రదక్షనంగా తిరువిధి ఉత్సవంతో పురశైవారి తోటలోని మండపానికి వెంచేస్తారు. అక్కడ ఆస్థానం జరుగుతుంది. ఆ తరువాత శేషించిన వీధి ఉత్సవంతో శ్రీవారు సన్నీధానానికి చేరుకొంటారు. దినినే విడయాట్రుదినం అని కుడా పిలవడమయిoది. బ్రహ్మోత్సవాలకు వచ్చిన దేవతలకు వీడ్కోలు చెప్పే దినం అన్నమాట

No comments:

Post a comment