యోగ నరసింహ స్వామిశ్రీనివాసుని ఆలయ ప్రాంగణంలో ఈశాన్య దిశలో విమానప్రదక్షణ మార్గంలో లోపలివైపు నృసింహమందిరం ఉంది. తమిళంలో ఈ స్వామిని  అళగియసింగర్ అని వ్యవహరించడం పరిపాటి

 ఈ నరసింహుడు స్వామి పుష్కరణి తీరంలో ఉన్నట్లు, శంకరుడు పూజించినట్లు వామన వరాహ పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మనియుక్తుడు కావడం వల్ల ఉగ్రరూపి. యధావిధిగా ఆరాధన చేయకుంటే నగరానికి అరిష్టమని రామానుజులు ప్రస్తుతమున్న ప్రదేశంలో ప్రతిష్ట చేసినట్లు పురాణగాధ

  ఈ స్వామి యోగ ముద్రలో కనిపిస్తాడు. పెద్దనామం కనిపిస్తుంది. స్వామి చతుర్బుజుడు .ఫైభాగాన ఉన్న చేతులలో చక్ర శంఖాలు కనిపిస్తాయి.కింద్ర చేతులు ద్యాననిష్టను సూచించే బంగిమలో ఉన్నాయి

 ఈ స్వామికి అన్ని రకాల అభిషేకాదుల్ని,నివేదనల్ని కట్టడి చేసినవారు కందాడై రామానుజయ్య్oగార్ తాళ్ళపాక అన్నమయ్య  ఘోరవిదారణ నారసింహ నీ వీ రూపముతో నెట్లుoడితివో అని కీర్తించాడు

No comments:

Post a comment