అలిపిరి

కాలినడకన తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి తోలిప్రవేశ మార్గo `అలిపిరి ` సోపాన మార్గoలో కనిపించే మొదటి ప్రదేశం ఇదే .కొందరు `ఆడిప్పడి `అంటారు .పడి అంటే మెట్టు .ఆడి అంటి అడుగున ఉన్న భాగం .తిరుమల కొండకు అడుగున ఉన్న భాగం .తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశం .

              కొందరు `అలిపిరి `ని ఆడిప్పళి అంటారు .`పుళి`అంటి చింత చెట్టు .అడుగు భాగన కనిపించే చింత చెట్టు ప్రదేశమని భావం .వైష్ణవ క్షేత్రాలలో `చింత చెట్టుకు `ప్రాధన్న్యమెక్కువ .నమ్మాఆళ్వారుకు చింత చెట్టు కిందనే జ్ఞానోదయం అయింది

    కొందరు `అలిపిరి` అంటి అల్ప శరీరం కలవాడని వివరణ ఇస్తారు .శ్రీవారు ఈ ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నారని భావన .అలిపిరిలోని దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహాలయం .ఈ ఆలయం ఫైకప్పు విడిపోవడంతో పాడయిపోయీoది .విగ్రహాలు శిధిలమయ్యాయి .చివరకు అదృశ్యమయ్యాయి .ఈ ఆలయంలోని `శిల్ప కళ `,చిత్ర `విన్యాసాలు చూడవచ్చు

  అన్నమయ్య కాలం నాటికీ ఈ ఆలయం ఉందేది .`ఆళిపురి సింగని`సేవించి అనే మాట దీనికి సాక్ష్యంప్రస్తుతం ఈ ప్రదేశం `లక్ష్మి నారాయణ `ఆలయంగా తిర్చబడింది .ఇక్కడ చూడదగిన `భోక్కసం `ఉంది .అలిపిరిలోనే `వృత్తాకారపు బండ `ఉంది .శిధిలాలయంలోని  బండ `రాగుల రాయిలా ఉంది .ఈ రెండు బండలు చూడవచ్చు

1 comment:

  1. News4andhra.com is a Telugu news portal and provides
    Telugu Movie News, Latest and Breaking News on Political News and Telugu Movie Reviews at one place

    ReplyDelete