ఆళ్వార్ ట్యాంక్-చరిత్ర-తిరుమల నంభి




                  ఆళ్వార్ ట్యాంక్-చరిత్ర

భగవద్రామానుజాచారుయ్యులు పంపగా వచ్చిన అనంతాఆళ్వాన్` పుష్పకైoకేర్యం` నిమిత్తం మంచి నీటి కోసం `ఆళ్వాన్ చెరువు` త్రవ్వడం మొదలు పెట్టాడు. `గర్బవతి` అయిన భార్య సహాయం చేస్తూ ఉంది. స్వామి బాలకుని రూపంలో వచ్చి సహాయం చేస్తానన్నాడు.అనంతాఆళ్వాన్ సమ్మతించలేదు.పని చురుకుగా సాగుతుంటే`అనంతాఆళ్వాన్కు అనుమానం వచ్చి వెనుకగా తిరిగి చూసాడు. భాలకుడు సహాయం చెస్తుండడం తెలియవచ్చింది.రాయితో కొట్టాడు. భాలకుని గడ్డం పగిలింది. పని పూర్తీఅయ్యాక `అనంతాఆళ్వాన్` గుడిలోకి వెళ్లి చుస్తే స్వామి గడ్డం నుంచి రక్తం కారడం కనిపిస్తుంది.ఆళ్వాన్కు అంతా అర్ధం అయిoది.శ్రీవారి గడ్డానికి రసకర్పూరం అంటించి ` రక్త స్రావాన్ని ఆపాడు. ఎంతో నోచ్చుకొన్నాడు. అప్పటి నుండి శ్రీవారి గడ్డానికి కర్పూరం చుక్కపెట్టడం ఆచారం అయింది. ఆళ్వాన్ త్రవ్విన చెరువు కావడం వల్ల ఆళ్వార్ ట్యాంక్ అయిoది

                         తిరుమల నంభి

శ్రీమద్రామానుజులు మేనమామ తిరుమలనంభి.తిరుమలలోని నివసించిన మొదటి పౌరుడు.శ్రీవారి సేవయే పరమర్ద్ధంగా భావించిన భాగవతుడు.ఆకాశగంగా నుండి ఉదకం తెచ్చి శ్రీవారికి అభషేకం చేసే సంప్రదాయాన్ని ప్రారంబించినవారు తిరుమలనంభి.శ్రీవారి ఆలయం దక్షిణమాడ విధులలో తిరుమల నంభి గుడి ఉంది. ఉత్సవ సమయాలలో స్వామివారి రధం తిరుమల నంభి తిరుమాళేగై దగ్గర ఆగుతుంది.

No comments:

Post a Comment