సోపాన మార్గం
                                                          కాలినడకన తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి తోలిప్రవేశ మార్గం `అలిపిరి`మార్గం .అలిపిరి నుండి సోపాన మార్గం మొదలవుతుంది .ఈ సోపాన మార్గాన్ని పునరుద్దించిన వ్యక్తి మట్టకుమార అనంతరాజు .

 ఒక్కప్పుడు కపిల తీర్ధం నుండి కొండదారి మీదుగా తిరుమలకు వెళ్ళేవారట .కాని `అలిపిరి `నుండి వెళ్ళడానికి `అనంతరాజు `సోపాన మార్గం  కట్టించాడు ఈయనే సోపానమార్గంలో రెండు గోపురాలను కట్టించాడు .వీటిలో మొదటి గోపురంలో శ్రీనివాసునితో ఉండే తిరువెంగళనాధుడు (మాట్ల కుమారుని తండ్రి ).చెన్నమ్మ (మాట్ల కుమారుని తల్లి )ఉన్నారు .తెలుగు గ్రంధలిపులలో ఈ పెర్ర్లు చెక్కబడ్డాయి .రెండోవ గోపురం గాలిగోపురం అనే పేరుతో ఉన్న అగ్ర గోపురం .దీనికి సంభందించిన శాసనం పాదాల మండపంలో తెలుగు లిపిలో ఉన్నది

    `గాలి గోపురం `అనే పేరు చిత్రమైనది .గాలి బాగా విచడం వల్ల దానికి తగిన విధంగా గోపుర నిర్మనం ఉండడం వల్ల గాలి గోపురం .కొందరు `కాళి గోపురం `అని అంటారు .`ఖాళీ `అంటే ఏమి లేదు .గొపురానికి తగ్గట్టు దగ్గరలో `గుడి `ఉండాలి .కాని ఇక్కడ గోపురంవుంది .గుడి లేదు .ఆ దృష్టితో `గుడిలేని `ప్రాంతంలో కట్టిన   గోపురం కావడం వల్ల గాలి (ఖాళీ)గోపురం అని కొందరు వివరిస్తారు     ఈ గోపురానికి విద్యుత్ దీపాలంకరణతో `తిరునామం `తీర్చారు 2001 వ సంవస్త్తరంలోదీని మరమత్తులు  చేయడం జరిగింది.శంఖు చక్రాలను అమర్చడం జరిగింది

No comments:

Post a comment