ఆనందనిలయ విమానంమానం అంటే కొలత.కొలవడానికి వేల్లెనిది విమానం `` గర్బాలయంఫై ఉన్న వర్తులాకారoగల ఊర్ధ్వాచ్చాదన తలం `` విమానం అని నిఘంటువు.దేవాలయాన్ని విమానంగా కూడా చెప్పడం ఆలయ పరిబాష

   శ్రీరంగంలోని గోపురం ప్రాణవాకార విమానం, కంచి వరదరాజస్వామి దేవాలయంలోని గోపురం `పుణ్యకోటి విమానం` అలాగే తిరుమలేశుని గర్బాలయంఫై గల గోపురం ఆనందనిలయ  విమానం.ఈ విమానంలో 60 మూర్తులు కనిపిస్తాయి

  శ్రీవారి ఆలయంలోనే రమణీయమయిన గోపురం ఆనందనిలయ గోపురం.బంగారు రేకులతో ధగద్దగాయ మానంగా కనులకు విందుగా పారవశ్యజనకంగా కనిపించే గోపురం. మహావిష్టువు పడక అదిశేషుడు.నారాయణునికి సన్నిహితుడు వాయుదేవుడు.వేరిద్దరులో అసూయాబావం కలిగింది. ఎవరేక్కువో తెల్చుకోవలనుకొన్నారు.ఆ వివాదానికి హరి నిర్ణేత.మేరు పర్వతం కొడుకు ఆనందుడు.ఆదిశేషుడు ఆనందుని చుట్టుకోగా వాయువుతో బల పరీక్షా మొదలెట్టాడు.ఆనందునితో సహా ఇక్కడ వచ్చి పడ్డాడు.ఆదిశేషుని పడగ మీద ఆనంద పర్వతముంది. ఆనందపర్వత కారణంగా `ఆనందనిలయం` అనే పేరు వచ్చింది

         ఈ ఆనందనిలయ విమానం పూతపని గతంలో 7 సార్లు జరిగాయి.చివరగా  27-8-1958 లో జరిగింది. ఆనందనిలయం ముడేoచల గోపురం కలది.ఇందులో దశావతార చిత్రాలు, నాలుగు మూలల నాలుగు సింహాలు,రామాయణ భాగవతలలోని సన్నివేశలు కనిపిస్తాయి

  విమాన వెంకటేశ్వరులు విమాన ఉత్తరం వైపున్నభాగంలో కనిపించే మూర్తి.లోపల స్వామి దర్సనం కాకపోతే విమాన వేంకటేశ్వరులను దర్శించి యాత్రికులు వెళ్ళేవారని ప్రతీతి. విమాన భాగంలో కనిపించే వెంకటేశ్వరులు కనుక `విమాన వెంకటేశ్వరులు` అయ్యారుNo comments:

Post a comment