తిరుమామణి మండపం

తమిళంలో `మణి అంటే గంట.మామణి అంటే పెద్ద గంట.`తిరుమంగళవాచకం.పవిత్రమయిన గంటలని అభిప్రాయం.స్వామికి నివేదన సాగేవేళా వాయిoచే గంటలున్న మండపం తిరుమామణి మండపం

       సాదారణంగా దేవాలయంలో ఒకే గంట ఉంటుంది.కానీ శ్రీవారి ఆలయంలో రెండు గంటలున్నాయి.ఒకప్పుడు ఈ గంటలు చెరోవైపు ఉండేవని ప్రతీతి. మొదటి గంట పేరు నారయణ గంట. రెండోవ గంట పేరు గోవింద గంట . కాని ప్రస్తుతం ఈ గంటలు ఒకే చోట ఉన్నాయి


   తిరుమామణి మండపాన్ని క్రి.శ 1417 లో మాధవదాసు నిర్మించాడు. ఈ మండపంలో స్వామికి ఎదురుగా గరుడుడు వుంటే ,జయ విజయ విగ్రహాలు (చండ ప్రచండ).బంగారు వాకిలికి ఇరువైపులలోనూ, కుడివైపు శ్రీవారి హుండీలు కనిపిస్తాయి. ఈ మండపం 43x40 అడుగుల విస్తిర్ణం కలది.16 స్తంబలున్నాయి. వీటిఫై రమణీయమయిన శిల్పాలున్నాయి, చతుర్బుజుడుయిన మహా విష్ణువు గజారూడుడై కనిపించే శిల్పం అరుదైయిన దృశ్యం

No comments:

Post a Comment