సార్ల పెట్టే

  మోకాలిమెట్టు ఫై భాగంలో పెట్టెల్లాంటివి కొన్ని కనిపిస్తాయి .సీతమ్మ శ్రీ రామచంద్రుల వారితో అడవులకు వెళ్ళే వేళ ఏడువరాల నగలను తనతో తీసుకెళ్లడానికి కైకేయి సమ్మతిన్చిందట ఈ పెట్టలు సారెగా ఇచ్చిన నగలు దాచిన పెట్టలు కావడం వల్ల ఇది సార్ల పెట్టె .ఈ పెట్టలు లాంటి కొండగుండు మీద భక్తాంజనేయ స్వామి శిల్పం ఉంది .చారలు చారలుగా పెట్టి ఆకారం లాంటి రాతి పలకలు ఒక చోట వుండడం వల్ల సార్ల పెట్టిగా వ్యవహరించబడిందని కొందరు బావిస్తారు .ఆలమేలు మంగమ్మ తిరుమల నుంచి వస్తుండగా వాన కోసం ఈ పెట్టె కింద భాగంలో నిలిచిందట .కానీ మరికొందరు మరో రకంగా చెబుతారు .

శ్రీవేంకటేశ్వరుడు ఆలమేలు మంగమ్మను పెండ్లాడినాడు ఆమేతో కొండకు బయలుదేరాడు .అప్పటికే స్వామికి ఇల్లాలు ఉంది .ఆ ఇల్లాలు ఏమంటుందో అనే భయం కుడా ఉంది .అయినా కదిలాడు .మంగమ్మ ఏడు వరాల నగలతో సారేలతో బయలుదేరింది .సరిగ్గా ఈ ప్రదేశానికి వచ్చే సరికి `అన్ని తెచ్చావా `అని స్వామి ప్రశ్నించాడు .తెచ్చానంది మంగమ్మ .మరి కరివేపాకు అని అడిగాడు .లేదని చెప్పిoది మంగమ్మ .తాను వెళ్ళి తెస్తానని వెనుకకు తిరిగిందట .తిరుచానూర్ లో `శిల `అయిoదట.ఆ సార్లే పెట్టలకు కాపలాగా `ఆంజనేయుడు `ఇప్పటికి దర్శనమిస్తున్నాడు .

   .

No comments:

Post a Comment