శ్రీవారికి నిత్యం జరిగే సేవలు-విశేషాలు

                                              సుప్రబాత సేవ

శ్రీవారి ఆలయంలో జరిగే మొదటి సేవా కైoకర్యం సుప్రబాత సేవా. శయన మండపంలోని భోగా శ్రీనివాసమూర్తికి మేలుకొలుపులు చెప్పడం ఈ కైoకర్య పరమార్డ్డం.


  సుప్రబాతాన్ని తెలుగులో మేలుకొలుపులు అంటారు. తమిళంలో `తిరుప్పల్లి ఎళుచ్చి` సంస్కుతంలో సుప్రబాతస్తవంన్ని `ప్రాభాతికస్తవం అని కూడా అంటారు

క్రి.శ 15 వ శతాబ్దందాకా ఈ కార్యక్రమం మంత్రస్తోత్రరహితంగా ఉండేదట.ఆ ఫై వేద పఠనానికి తదనంతరం ప్రస్తుతం సాగుతున్న సుప్రభాతస్తవానికి  ప్రాధాన్యం పెరిగిందని అంటారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో గానం చేసే సుప్రబాతం ప్రతివాది భయంకర అన్నన్ రచితం. అయితే వాదిభీకర మహా గురువు. ఈ సుప్రబాతం వ్రాశారని స్తానికులు చెబుతుంటారు.బంగారు వాకిలి దగ్గర ఈ సుప్రబాత పఠనం మొదలవుతుంది.ఇందులో సుప్రబాతం,స్త్రోత్రం,ప్రవత్తి,మంగళశాసనం అనే నాలుగు బాగాలున్నాయి

 కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాహ్నికమ్                     

  అని మొదలయి..................................

 సర్వైశ్చపుర్వైహ్ అచారైయ్య్
సత్క్రుతాయాస్తూ మంగళమ్

 అని పూర్తి అవుతుంది

  ఈ సుప్రభాతగానం చేయడానికి సుమారు 20  నిముషాలు పడుతుంది

 ధనుర్మాసంలో మాత్రం `సుప్రబాత గానం లేదు. ఆళ్వారులలో ఒకరయిన అండాళ్ తిరుప్పావై పాశురాన్ని గానం చేస్తారు.ఇతర మాసాలలో భోగశ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా ధనుర్మాసంలో శ్రీకృష్ణస్వామి ఏకాంత సేవలో ప్రాధాన్యయం సంతరించుకొంటారు

  సుప్రబాత సమయంలో అన్నమయ్య సంకీర్తనలు పాడడం సంప్రదాయం.మచ్చుకు

               వారధిశయన వో వటపత్ర పరియoక
             గారవాన మేలుకొని కన్నులు తెరవవె


                                      విశ్వరూప దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రబాత సేవానంతరం మూల విరాట్టును సేవించడానికి విలయిన దర్శనం విశ్వరూప దర్శనం

ఏకాంత సేవా సమయంలో ఆర్చకస్వాములు గర్గ్బగుడిలో ఐదు బంగారు పాత్రలలో నిరు నింపుతారు. పూజకువసరమయిన వస్తువులను సమకూరుస్తారు.బ్రహ్మది దేవతలు వచ్చి రాత్రివేళా స్వామివారిని అర్చిస్తారని నమ్మకం. ఈ దర్శనం వేళా అనుగ్రహించే శ్రీవారి తిర్దాన్ని `బ్రహ్మతిర్ద్దంగా` భక్తులకు వినియోగం చేస్తారు.అంతే కాకుండా స్వామి పాదాల చెంత ఉంచిన `ఫలాన్ని`-చందన భాగాన్ని భక్తులకు వినియోగిస్తారు


                        తోమాల సేవ

తమిళంలో `తోడుత్తమాలై` తెలుగులో `తోమాల`గా మారిందని కొందరు చెబుతారు.తోడుత్త అంటే కుర్చిన లేదా అలంకరించిన అని అర్ధం. మాలై అంటే మాలలు అని అభిప్రాయం.ఇచ్చట మాల అన్నది పూలమాలలను స్పష్టం చేస్తుంది. ఈ తోమాల సేవ సమయంలో భోగ శ్రీనివాస మూర్తికి మంత్రాసనం,స్నానాసనం,పుష్పన్యాసం, అలంకారసనం-మొదలయినవి జరుగుతాయి.జియ్యంగార్,ఆచార్య పురుషులు ,అధ్యాపకులు శ్రీ వైస్టవ స్వాములు శ్రీఅండాళ్ పాడిన `తిరుప్పావై దివ్య ప్రభంధంలోని 28 పాశురాలను గానం చేస్తుండగా శ్రీ జియ్యంగార్ అందించిన పుష్పామాలలను అర్చకులు భోగశ్రీనివాసమూర్తికి,శ్రీభూదేవులకు శ్రీవారికి అలంకరిస్తారు

   కొందరు `తోళ్ మాలై అని కూడా `తోమాల సమాసాన్ని విడదిస్తారు.తమిళంలో `తోళ్ `అంటే భుజం.భుజాల మీదుగా వేలాడుతున్నట్లు అలంకరించే పూలమాల అని అభిప్రాయం

  పువ్వుల్ని `మాలగా కట్టడం.ఆ మాలలను చిన్న చిన్నవిగా వేరు చేయడం, వాటిని తగిన విధంగా అలంకరించడం `తోమాల సేవలోనీ` ప్రతేయ్క్కత.కొందరు ఈ తోమాల సేవను `భార్గవి ఆరాధనగా బావిస్తారు.కానీ ఇది `భగవద్ ఆరాధన మాత్రమే

  `తోమాల సేవానంతరం మంత్రపుష్పం,నక్షత్ర హారతి,కర్పూర హారతి కైoకర్యాలు జరుగుతాయి                              సహస్రనామార్చన


తిరుమల శ్రీవారి ఆలయంలో తోమాల సేవానంతరం సాగే కైoకర్యo`సహస్రనామార్చన`.1008 పేర్లతో శ్రీవారిని అర్చించడం ఇందులోనే విశేషం

 వైష్ణవ ఆలయాలలో `విష్ణుసహస్రనామ` అర్చన తప్పక ఉంటుంది. అయితే శ్రీవారి ఆలయంలో ` వెంకటేశ్వర సహస్రనామర్చనకే కే ప్రాధాన్న్యం.శ్రీవారికీ ఈ అర్చన పూర్తి కాగానే శ్రీభూదేవుల చరణారవిందములకు `ఓమ్ శ్రీం శ్రియై నమః` తో అర్చన మొదలవుతుంది.శ్రీవారికి తయార్ర్లకు పూజనం పూర్తి కాగా నక్షత్రహారతి.కర్పూరహారతిని నిర్వహిస్తారు

క్రి.శ 1518 వ సంవత్సర నాటి శాసనంలో ఈ అర్చన ప్రస్తావన కనిపిస్తుంది

శ్రీ వెంకటేశ్వరస్వామి సహస్రనామావళిలో శ్రీమన్నానారాయణుని ` సకల వైభావాలూ వర్ణితం.స్వామి `శ్రీ గాయత్రీకి కూడా అధినేత అనడానికి గుర్తుగా `సవితృ వరేణ్యయ భర్గవె నమః ` అలాగే ఆశేష భక్త దుఖా ప్రణాశాయ నమః అనే నామావళులు ఉన్నాయి. `ఆశేషం అంటే విముక్తమయినవి.తీర్చడానికి వీలులేనివి అయిన దుఖాలను పోగొట్టేవాడని అర్ధం. ఈ లాంటి విశేషర్ద్దలు ఇతర సహస్రనామవళు లలో కనిపించవు                                                                 ఏకాంతసేవ


ఏకాంత సేవకే `పవళేoపు` సేవ అని పేరు. శ్రీవారి ఆరాధనలో ఇదే చివరి సేవ.ఇది శ్రీవారి గర్బాలయానికి ముందు భాగంలో జరుగుతుంది. వెండి గొలుసులుఉన్న బంగారు మంచం,అందులో పట్టు పరుపులు,పట్టుదిండ్లు మొదలయిన శయన పరికరాలను సిద్దం చేస్తారు. భోగ శ్రినివసముర్తిని శయనాసనంలో `వెంచెపు` చేయిస్తారు

  తాళ్ళపాక అన్నమయ్య సంకిర్తనలను ,తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి నిర్వహిస్తారు.భక్తులకు తీర్ధప్రసాదాలను పంచి పెడతారు.బ్రహ్మదేవుడు రాత్రివేళ శ్రీవారి అర్చించడానికి వీలుగా జలపాత్రను,పూజా సామగ్రిని సిద్దం చేస్తారు.

ధనుర్మాసంలో మాత్రం భోగశ్రీనివాసులకు ఏకాంత సేవలేదు. అప్పుడు శ్రీకృష్ణ స్వామికి ఏకాంతః సేవ ఉంటుంది. ఈ కైoకర్య్యo క్రి.శ.1513 నాటి శాసనంలో ప్రస్తావితం

 ఏకాంతసేవలో `తాళ్ళపాక అన్నమయ్య సంకిర్తనలు `పాడడం నేటికి నియమంగా ఉంది. అన్నమయ్య జోల పాటలలో రంగనాధ,బాలకృష్ణ,శ్రీవెంకటేశ్వర ముద్రలున్నవి చాల కనిపిస్తాయి.స్వామి వారిని నిదురపుచ్చడం` ఈ పవళింపు సేవలో ముఖ్యం. అందువల్ల తాళ్ళపాక కవులు స్వామిని `శిశువు`గా సంబావించి చాల కీర్తనలు వ్రాశారు. కొన్ని చోట్ల శృంగారప్రియునిగా సంభావించి సంకిర్తనలు వ్రాశారు. స్వామిని సేవించిన మరో భక్తురాలు తరిగొండ వెంగమాంబ.ఈమే యోగిని,కవయిత్రి.రాత్రివేళ తలుపులు మూసి ఉన్నా వెంగామాంబ స్వామిని సేవించడం చూచి,భగవదాదేశంతో మహంతు శ్రీ సేవదాస్ వెంగమాంబకు `పవళింపు సేవ` భాద్యత ఇచ్చాడని ఐతిహ్యo.ఈమె వంశీకుల హారతి `ముత్యాల హారతి`.

                                   ఆర్జిత బ్రహ్మోత్సవం

 శ్రీవారి బ్రహ్మోత్సవo సంవత్సరానికి ఒక్కసారే. కానీ అధికమాసం వచ్చినప్పుడు అంటే మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రం రెండు బ్రహ్మోత్సవాలు కూడా ఉన్నాయి

  ఒకేరోజు బ్రహ్మోత్సవం అంటే ఉభయనాంచారులతో కూడిన మలయప్ప స్వామి బంగారు శేషవాహనం, వెండి గరుడవాహనం,వెండి హనుమద్వాహనాలఫై సాక్షాత్కరించడం. ఈ ఉత్సవాలు ఇపుడు వైభవోత్సవ మండపంలో జరుగుతాయి


                                                     శ్రీవారి-కల్యాణోత్సవం

 `నిత్య కళ్యాణం పచ్చ తోరణం ` అనే మాట తిరుమలకే చెల్లుతుంది.సంవత్సరంలో ఏవో కొన్నిరోజులలో తప్ప ప్రతి రోజు తిరుమల ఆలయంలో `కల్యాణోత్సవాలు` జరుగుతాయి

   క్రి.శ 15న శతాబ్దం నాటికీ కల్యాణోత్సవం బ్రహ్మోత్సవంలో భాగంగా ఉండేది. అయితే క్రి.శ 1546 లో ఇదొక ఉత్సవంగా మారింది. తాళ్ళపాక వారె ఈ ఉత్సవానికి ప్రారంబకులని సంకిర్తనలు,ఆ కాలం నాటి శాసనాలు సాక్ష్యమిస్తునాయి

   తిరుమల ఆలయంలో కళ్యాణోత్సవాలు మొదట కళ్యాణమండపంలో జరిగేవి.శ్రీవారిని సేవించాక తిరుమామణి మండపం దాటాక ప్రదక్షణం చేసేవేళా ఎడమవైపు కనిపించే మండపమే కల్యనమందపం.కాని క్రమంగా ఇది రంగా నాయకుల మండపానికి ,తదనంతరం మరో చోటకి (సంపంగి ప్రదక్షనలోకి)మారింది.

  మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవులను వివాహమాడడం కల్యాణోత్సవం.సామాన్య వ్యక్తులకు జరిగే వివాహ పద్దతిలోనే ప్రవరలు,కంకణధారణ, మంగళాస్టకాలు,బాసికాలు మొదలయిన తంతు  జరగడం ఒక ప్రతేయ్కత

   శుభాన్ని కోరేవారు, శుభం సిద్దించాక కృతజ్ఞత చూపించువారు జరేపీ ఉత్సవం కల్యాణోత్సవం.

  తాళ్ళపాక కవులు ఈ ఉత్సవాన్ని సహజ సుందరంగా వర్ణించారు                                  డోలోత్సవం/ఉంజల్ సేవ

  తిరుమల శ్రీవారి ఆలయంలో దర్పణ బావనంలో(అద్దాల మహల్) జరిగే డోలోత్సవం ఉంజల్ సేవ
   మధ్యాహ్నం వేళా కళ్యాణోత్సవాలు, వాహన సేవలు పూర్తి అయ్యాక తిరుచ్చిలో మలయప్ప స్వాములు ఉబయ దేవేరులతో అద్దాల మహల్ చేరుకొంటారు.ఆ మహాలోని నాలుగు స్తంబాల డోలా మండపంలో బంగారు డోలలో విశ్రమిస్తారు. వేదనాదాలు, సామ గానం, దివ్య ప్రభంద గానం సాగుతూవుంటే శ్రీస్వామివారు `పట్టమహిషులతో` డోలా విహారం చేస్తారు.ఆఫై ` లక్ష్మి వినోదం జరుగుతుంది.తదనంతరం ఇతర పూజా పద్దతులు నిర్వహిస్తారు.

  త్రేతా యుగంలో శ్రీరాముల వారు సీతాకళ్యాణ సందర్బ్బంలో కళ్యాణమండపంలో ప్రతిభాసించినట్లుగా మలయప్పస్వాములవారు ఉభయ దేవేరులతో ప్రకాశిస్తూ లెక్కలేనన్ని ప్రతిబింబాలతో దర్శనమివ్వడం ఇక్కడి ప్రేతేయ్కత

  ఇది కుడా ఆర్జిత సేవ ఏ రోజుయినా భక్తులు ఈ సేవను జరుపుకోవచ్చు


                  విశేష పూజ

 ప్రతి సోమవారం రెండోవ గంట తరువాత చతుర్దశ కలశ వేశేషపూజ జరుగుతుంది.పాలు,పెరుగు, నెయ్యి, అక్షత,దర్బ, పంచగవ్యం,శుద్దోదకం మొదలైన వాటితో ఉత్సవమూర్తికి చేయు పూజ ఇది.గృహస్తులు ఆర్జిత సేవగా జరుపుకోవచ్చు


                       
             అష్టదళపద పద్మారాధన

   తిరుమలో శ్రీవారికీ ప్రతి మంగళవారం జరిగే ఆరాధన` అష్టదళపద పద్మారాధన` ఇది రెండోవ అర్చన. 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడం ఈ సేవలోని విశేషం.భక్తులు దేనిని  ఆర్జిత సేవగా జరుపుకోవచ్చు

 సహస్రనామార్చనలో 1008 నామాలకు ప్రాదాన్యం.అష్టోత్తరంలో 108 నామాలకు ప్రాదాన్యం
                     సహస్రకలశాభిషేకం

తిరుమామణి మండపంలో `ధాన్యం` మీద 1008 కలశాలను అమరుస్తారు,భోగశ్రినివాసాలు బంగారువాకిలి ముందు వెంచేస్తారు. భోగశ్రీనివాసునికి మూలవిరాట్టుతో సూత్రబంధం కల్పిస్తారు. శ్రీదేవి భూదేవులతో మలయప్పస్వామి,సేనాధిపతులు వెంచేస్తారు

 సహస్రకలశాలను ప్రతేయ్కించిన నవకలశాలను సంస్కరిస్తారు.హోమకార్యం పూర్తి అయ్యాక వేద ఘోషలతో అభిషేకం మొదలవ్తుంది.

   అఫై వవకలశతిర్ద్ధంతో సహస్ర ధారాభిషేకం సాగిస్తారు.శ్రీవారిని వస్త్రభరణాలతో అలంకరిస్తారు. వివేదన తరువాత అక్షతారోపణం జరుగుతుంది

 భక్తులకి ఈ సహస్రకలశాభీశేకంను ప్రతి  బుధవారం ఆర్జిత సేవగా జరుపుకోవచ్చు. 1008 కలశాలయినప్పటికీని వాడుకలో `సహస్రకలశాభిషేకం `అనే రూడి                                      తిరుప్పావడ
 తమిళంలో `తిరు` అనేమాటకు మంగళం అనే అర్ధం.పావడ అంటే వండిన ధాన్యరాశిని అర్పించడం

  బంగారు వాకిలికి ఎదురుగా సుమారు ఆరు మూటలు- 450 కిలోల బియాన్ని పులిహోరలాగా వండి శ్రీనివాసునికి వివేదిస్తారు.శ్రీవారి దృష్టి ప్రసారం కలేగేటట్లు అన్నరాశిని కొన్ని భాగాలుగా చేస్తారు. ఫై భాగంలో పెద్ద అన్నకుటాన్ని ఎనిమిది దిక్కులలో ఎనిమిది శిఖరాలను తలపించే విధంగా చేస్తారు. శ్రీవారి సన్నిధిలో ప్రసిద్దమయిన లడ్డు ప్రసాదాలు,వడ ప్రసాదాలు ,అప్పం, దోస, జిలేబి, పాయసం ప్రసాదాలను శ్రీవారికి కనిపించేలాగున సమికరిస్తారు.ఆ తరువాత మహాఘంటల నుండి ప్రణవనాదం సమర్పణ చేస్తారు.శ్రీ భాష్యకారుల వారికీకూడా నివేదన జరుగుతుంది

  ఇది ఒక శక్తి ఆరాధనలాంటిదే.కష్టాలు తీరిన భక్తులు చేయిoచే ఆర్జిత ఉత్సవం. ఈ సేవ గురవారం జరుగుతుంది
                                                       పూలంగి సేవ

 తమిళంలోని `పూఆoడై` అనడానికి సరియయిన తెలుగు పదం పూలాంగి.గురువారం సాయంత్రం వేళా శ్రీవారికి జరిగే ప్రతేయ్కమయిన సేవ `పూలంగి సేవ`

 గురువారం ప్రాతఃకాల ఆరాధన పూర్తికాగానే అర్చకులు శ్రీవారి ఆభరణాలు,పితాoబరాలను తీసి భద్రపరుస్త్రారు.శ్రీవారి పచ్చకర్పూరపు ఊర్ధ్వపుందరాన్ని సగానికి తగ్గిస్తారు. దినివల్ల స్వామి నయనారవిందాన్ని భక్తులు చూడడానికి విలుఅవుతుంది.24 మూరల సరిగపట్టంచు ధోవతిని, 12 మూరల ఉత్తరీయాన్ని సమకూరుస్తారు.శ్రిపాదములు,శ్రీహస్తములు,శoఖ చక్రములు,కర్ణ భూషణములు,సువర్ణ సాలగ్రామహారం సమర్పిస్తారు.

  స్వామివారికి వేటగౌను తొడగడం,పుష్పాలంకరణ చేయడం, కత్తిఅయన ముందుంచడం మొదలయినవి ఈ సేవలోని ప్రతేయ్కoశాలు.ఈ సందర్బ్బంలో అర్పించే కత్తి సూర్యకఠారి

                                     
          శుక్రవారాభిషేకం

 తిరుమలలోని మూలవిరాట్టుకు నిత్యభిషేకం లేదు. నిత్యాభిషేకం `భోగశ్రీనివాసమూర్తికి` కే  మూలవిరాట్టు` శుక్రవారం` మాత్రం అభిషేకం

   ప్రాతఃకాల ఆరాధన పూర్తికాగానే అభిషేకం సంకల్పం జరుగుతుంది. అస్తోత్తర శతానామఅర్చన జరుగుతుంది. ఆఫై ఊర్ధ్వపుండ్రంలోని అరభాగం కుడా తగ్గించి సుక్ష్మంగా ఊర్ధ్వ పుండ్రాన్ని మాత్రం దర్సనియమాత్రంగా ఉంచుతారు. వస్త్రాన్ని,ఉత్తరేయాన్ని తొలగించి స్నానకౌపీనం` కడతారు. ఈ సమయంలో శ్రీవారి సన్నిధానంలో రెండు వెండి గంగాళలలో గోక్షిరాన్ని,రెండు వెండి గంగాళాలలో బంగారుబావి శుద్దోదకాన్ని సిద్దపరుస్తారు. ఆ తరువాత జియ్యంగార్ర్లు,అధికార్లు,ఏకాంగులు,పరిచారకులు, ఆచార్య పురుషులు వైస్తవస్వాములు, `పరిమళం`అరకు వెళ్ళతారు.జియ్యంగార్లు పచ్చ కర్పూరం,కస్తూరి ఉన్న రజతపాత్రను అధికారులు కుంకుమపువ్వుతో తయారు చేసిన నలుగు బిళ్ళలు,చందన బిళ్ళలు,పసుపు కలిపి ఉన్న రజత పాత్రలను, పరిచారకులు `పరిమళం` ఉన్న రజత పాత్రలను స్వీకరిస్తారు.ఈ సేవకు డబ్బు కట్టినవారు,ఈ సేవకు అనుగుణంగా గంబురా(పచ్చకర్పూరం) పాత్రలను, జాఫ్ర(కుంకుమ) పాత్రలను,కొందరు పునుగు పాత్రలను , కొందరు కస్తూరి పాత్రలను తీసుకొనే మర్యాదపురస్సరంగా విమాన ప్రదక్షణం చేసి బంగారు వాకిలి చేరుకొంటారు. అభిషేక ద్రవ్యాలను శ్రీవారికి సమర్పిస్తారు. ఆఫై అభిషేకం మొదలవ్తుంది. అర్చకుడు అభిషేకానికి అనువుయిన పిఠo మీద నిలబడి జియ్యంగార్ అందించిన ఆకాశగంగా జలంతో నిండిన సువర్ణ శoఖo తీసుకోని పురుష సుక్తంతో అభిషేకం కొనసాగిస్తాడు. అభిషేకనంతరం వరకు పంచ సుక్తాల పంచోపనిషత్తుల పఠనం కొనసాగుతుంటుంది. సువర్ణ శoఖాభిషేకం పూర్తి అయ్యాక క్షీరాభిషేకం మొదలవ్తుంది.శ్రీవారి వైకుంఠహస్త్తం నుండి జాలువారే క్షిరాన్ని సంగ్రహిస్తారు
.ఆఫై `శుద్దోదకాభిషేకం` సాగుతుంది. కేసరి బిళ్ళలు.చందన బిళ్ళలను శ్రీవారి శ్రీహస్తానికి సమర్పిస్తారు. ఆ తరువాత కార్యక్రమం`ఉద్వఅర్తనం`పరిమళ పాత్రలలోని పరిమళాన్ని ఆపాద కిరీటం ` పూసి నలగిడి శుద్దోదకాభిషేకం ప్రారంబిస్తారు. వైకుంఠహస్తం నుండి జాలువారే అభిషేకోదకాన్ని సంగ్రహించి భక్తులకు వినియోగిస్తారు. తదనంతరం` శ్రీలక్ష్మిహరిద్రాభిషేకం` శ్రీవారి వ్రక్షఃస్టలంలోని అమ్మవారికి ఈ అభిషేకం జరుగుతుంది.తదనంతరం శుద్దోదకాభిషేకం.108 కలశాల జలంతో అభిషేకం పూర్తిచేస్తారు.అప్పుడు తెరలో మూల విరాట్టు శరీరంఫై తడి లేకుండా తుడిచి,శ్రీవారికిరీటానికి పొడి వస్త్రం చుట్టి 24 మూరల పొడవుగల సరిగ పట్టంచు దోవతిని,12 మూరల ఉత్తరియాన్ని అందంగా తొడగి ఆఫై ఉర్ద్వ పుండ్రాన్ని తీరుస్తారు. పచ్చకర్పూర హారతి జరుగుతుండగా తెరను తీస్తారు

  స్వామివారికి శుక్రవారం అభిషేకం జరగడానికి కొన్ని కారణాలు-మొదటిది క్రి.శ.966 వ సంవత్సరం భోగశ్రీనివాసమూర్తికి అభిషేకం శుక్రవారం జరగడం.
రెండవాది బృగువు వాసాదికారంలో`శుక్రవారాభిషేకం` ఉండడం.మూడవది గురువారం పూలంగి సేవ కోసం ఆభరణలను తొలగించడం వల్ల మరుసటి రోజు అభిషేకానికి సన్నద్ధం చేసే సూచనలు కనిపించడం.

 క్రి.శ 1534 శాసనంలో ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం ప్రస్తావన ఉంది. తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలలో అభిషేక వర్ణనలున్న కిర్తనలెన్నో కనిపిస్తాయి

 బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహాణకు ముందు వచ్చే శుక్రవారం,ఉత్సవాల మధ్య వచ్చే శుక్రవారం,ఉత్సవాలు అయ్యాక వచ్చే మొదటి శుక్రవారం-ఈ మూడు రోజులలోను తిరుమణి ద్రవ్యాలను రెట్టింపు చేస్తారు. రెట్టింపు ఉన్న ప్రమాణాలలో ద్రవ్యాల వినియోగం జరుగుతుంది. కనుక ఈ మూడు శుక్రవారాలను `రెట్ట వారాలని` అంటారు.స్వామివారికి నిర్వహించే అభిషేకోత్సవాన్ని అన్నమయ్య చాల సంకీర్తనలలో వర్ణించాడు.

 ఈ సందర్బ్బంలో వేదాంతదేశికుల `కయ్యర్చక్ర ` శ్లోకాలను కూడా గానం చేసేవారట

                       
                     సహస్రదీపాలంకరణ సేవ

సహస్రమంటే వేయి.వేయి దీపాలు వేలుగుతుండగా మలయప్ప ఉభయ నాంచారులతో ఉయ్యాలలో ఉగే సేవ సహస్రదీపాలంకరణ సేవ.ఈ సేవ ఆలయం వెలుపల సాయం సమయంలో కొలువు మండపంలో జరుగుతుంది

  వేదపండితులు వేదం చదువుతుoడగా వాగ్గేయకారులు అన్నమయ్య సంకిర్తనలు మధురంగా గానం చేస్తుండగా ఈ దీపాలంకరణ సేవ సాగుతుంది.ఇది ఆర్జిత సేవ కూడాను


                            కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం

 ఆలయ పరిసరాన్ని,ప్రతేయ్కించి గర్బాలయాన్ని పవిత్రంగా ఉంచడాని కోసం జరిపే సేవ `కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం సంవత్సరంలో ఈ ఉత్సవం నాలుగు సార్లు జరుగుతుంది.ఉగాది,ఆణివార ఆస్టానం,వార్షిక బ్రహ్మోత్సవం,వైకుంట ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారాలలో ఈ సేవ జరుగుతుంది.సుగందద్రవ్యదులతో కలిపిన నీటితో గర్బాలయాన్ని శుద్ది చేయడం ఈ ఉత్సవం ప్రేతేయ్కత. స్వామి సాక్షాత్కారించిన ఆలయం లోపలి గోడల మీద చిత్రాలుండేవని,తిరుమంజనం కారణంగా ప్రస్తుతం కనబడం లేదని పెద్దలు చెబుతారు

  అల్వారాలంటే చప్పన 12గురు ఆళ్వారుల పేర్లు గుర్తుకు వస్తాయి. ఆ 12 గురిలో కొయిల్ ఆళ్వార్ లేడు.దేవాలయాన్నే ఆళ్వార్గా చెప్పడం వైస్టవ పరిబాష.అంచేత కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ప్రధాన దేవత ఉన్న ప్రదేశాన్ని అభిషేకించిడమని విశిష్టర్ధం                                                         వసంతోత్సవం

 తిరుమలలోని శ్రీవారికి వసంతఋతువులో చైత్రమాస శుద్ధత్రయోదశి పూర్ణిమా తిధులలో జరిగే ఉత్సవం వసంతోత్సవం

  మొదటి రోజు ప్రాతఃకాల మధ్యాహిన్న్క ఆరాధన ముగిశాక ఉభయ దేవేరులతో మలయప్పస్వామి బంగారు తిరుచ్చిలో ఊరేగింపుగా బయలుదేరి శ్రీవారి ఆలయానికి పడమటనున్న వసంత మండపానికి వెంచేస్తారు. శ్రీవారికి అభిషేకం,అలంకారం,ఆరాధనం నిర్వహిస్తారు.సాయంకాలం ఆస్టానాoతరం తిరిగి గర్బాలయం చేరుకొంటారు. రెండోవ రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీభూదేవులతో సహా ఆరాధనం పూర్తికాగానే `బంగారు రధం అధిరోహిస్తారు.రదోత్సవం పూర్తి అయ్యాక వసంత మండపానికి వెంచేస్తారు. అక్కడ శ్రీవారికి దేవేరులకు అభిషేకం అలంకరణ జరుగుతాయి. సాయంకాలం సన్నిధి చేరుకొంటారు. మూడోవ రోజు ఆరాధనం పూర్తి అయ్యాక శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవులతో ఒక తిరుచ్చిలోను,శ్రీ సీతారామ లక్ష్మణులు మరొక తిరుచ్చిలోను,శ్రీకృష్ణస్వామి రుక్మిణిగారలు మరొక తిరుచ్చిలోను వెంచేసి తిరువీధుల ఊరేగింపుతో వసంత మండపానికి వెంచేస్తారు.అక్కడ అభిషేకం ,అలంకారం,ఆస్తానం జరుగుతాయి

                ఈ వసంతోత్సవం క్రి.శ.1360 లో ప్రారంభమైనది. తిరుమల మీద జరిగే వసంతోత్సవాలు మూడు మొదటిది బ్రహ్మోత్సవ సమయంలో జరిగే కార్యక్రమం,రెండొవది వసంతఋతువులో జరిగే ఉత్సవం, మూడవది భాక్తదులు ` ఆర్జిత సేవగా జరిపించే ఉత్సవం


                                                పవిత్రోత్సవం


 సంవత్సరానికి ఒక్క సారి ఆలయ పవిత్ర వాతారణం పునఃస్టాపితం కావడానికి జరిపే ఉత్సవం పవిత్రోత్సవం. ఇది `సంప్రోక్షణాది` తతంగం కంటే బిన్నమైనది.ఆలయ విర్వహణలో,పూజాదూలలో తెలిసో తెలియకో జరిగిన పొరపాటు వల్ల అనర్ధం జరగకుండా ఉండడానికి జరిపే ఉత్సవం .ఈ ఉత్సవం క్రి.శ 1464 నుండి 1562 వరకు జరుగుతుండేవి. మరల దేవస్తానం వారు ఈ ఉత్సవాన్ని 1982 న  తిరిగి పునరుద్దరించారు.

                 ఈ మూడు రోజులలో స్వామి ,దేవేరులతో కూడిన ఉత్సవ విగ్రహాలు ఆలయ కల్యనమందపంలోని యాగశాలలో ఉంచుతారు. మొదటి రోజు పట్టు పోగులతో తులసి పూసలు లేదా తామర తుళ్లు సరంలాగా కనిపించే `పవిత్రాలు యాగశాలలో ఉంచుతారు. రెండోవ రోజు శాస్త్రోక్త్మర్యాదలతో ఈ పవిత్రాలను శ్రీవారి ఆలయానికి బేడి ఆంజనేయస్వామి ఆలయానికి నుడుమ ఉన్న ప్రధాన ఇతర దేవతలకు సమర్పిస్తారు.మూడోవ రోజు పవిత్ర విసర్జనం,పూర్ణాహుతి జరిపి ఉత్సవ పరిసమాప్తి చేస్తారు

   ఈ ఉత్సవం ఆగష్టు లో జరుగుతుంది


                         పుష్ప యాగం


 తిరుమల శ్రీవారి ఆలయంలో 1980 నుండి పునః ప్రవేశ పెట్టిన మహోత్సవం `పుష్పయాగం` విగ్రహప్రతిష్ట చేసిన తరువాతగాని ,ఉత్సవాల ముగింపులోగాని,మేష తుల సంక్రమణ వేళ్ళలోగాని,కటకమకర సంక్రమణ సమయంలోగాని,యుగాంతంలో గాని,సంక్రాంతిలోగాని ,శ్రావణ నక్షత్రంలో,రాజు,గ్రామం,యజమానుల జన్మ నక్షత్రసమయంలో,దుర్ఫిక్ష,అనావృస్టి,దుస్వప్నం,రాష్ట్ర విబ్రమ,పరచక్రభయ,మహావ్యాధి పీడన ఉపధ్రువ సమయాలలోగాని శ్రీవారికి అభిషేక పుర్వంగా పుష్ప యాగం చేయవచ్చని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి

                          నిత్యారాధన అనంతరం శ్రీ మలయప్పస్వామివారు దేవేరులతో`బంగారు తిరుచ్చిలో రాజ మర్యాదులతో యాగశాలకు వెంచేస్తారు. అక్కడ స్వామివారికీ `అభిషేకం మొదలవ్తుంది. స్వామిని తులసి మాలాలంక్రుతుని చేసి సహస్రధారాభిషేకంతో అభిషేకం కొనసాగిస్తారు. వైష్ణవస్వాములు ద్రావిడ వేదంలోని నీరాట్టుం గాధలను శ్రావ్యంగా వినిపిస్తారు. అభిషేకం పూర్తికాగా నూతన వస్త్రదారులై స్వామివారు `ద్యానపిఠo అలంకరిస్తారు. అర్చకులు పుష్పదిపతికి ఆవాహనం చేస్తారు. ఆచార్యుడు మంత్రసంస్కారంతో పువ్వులను యగార్హం చేస్తాడు.శ్రీవారికి దక్షిణభాగంలో `అగ్ని ప్రతిష్ట జరుగుతుంది. అక్కడ `హోత్రం` మొదలవ్తుంది.విష్ణు గాయత్రీ మహామంత్రంతో 108 సార్లు బిల్వపత్ర హొమం జరుగుతుంది. మూర్తి హోమంతో 12 సార్లు పుష్పాదిపతికి సంబందించిన హొమం కుడా జరుపుతారు


                     
                         తిరువీధుల ఉత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉభయ నాంచారులతో కూడిన మలయప్ప,రుక్హ్మినిసమేతుడైన శ్రీకృషుడు,సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తి విగ్రహాలున్నాయి. అందువల్ల శ్రావణ నక్షత్రం రోజు మలయప్ప స్వామికి రోహిణి నక్షత్రం రోజు  శ్రీకృష్ణుడుకి పునర్వాసు రోజు, శ్రిరమచంద్రముర్తులకు తిరువిదులలో ఆయా దేవతల దేవేరులతో ఊరేగింపు ఉంటుంది. ఈలాగే వసంతోత్సవాలు,తెప్పోత్సవాలు మలయప్పకు,కృష్ణ స్వామికి, శ్రీరామచంద్రులవారికీ జరుగుతాయి.                              ఉట్ల ఉత్సవం

 తిరుమలలో ప్రతి సంవత్సరం శ్రావణ బహుళాస్టమి ఆస్తానానికి మరుదిపం `ఉట్ల ఉత్సవం జరుగుతుంది. సంస్కృతంలో దేనినే`శిక్యోత్సవం అంటారు. తమిళంలో `ఊరి ఆడి ` అంటారు

   ప్రాతఃకాల మధ్యాహ్న ఆరాధనలు ముగిశాక ఉత్సవ మూర్తులయిన మలయప్ప స్వామి వారు ఒక తిరుచ్చి మిద కృష్ణ స్వామివారు మరో తిరుచ్చి మిద బయలుదేరుతారు. యమునోత్తరంలో మలయప్ప స్వామి, పడిపోటు దగ్గరున్న చతఃస్తంబ మండపంలో కృష్ణస్వామి చేరుకొంటారు. ఆఫై గోష్టి జరుగుతుంది. 16 స్తలాల్లో స్వామివారికి స్వాగతం ఆరగింపు సేవలు జరుగుతాయి. మద్యమద్య ఉన్న `ఉట్లు` కొట్టడం ఇందులోని ప్రతేయ్కత

 

No comments:

Post a comment