పూలబావి

శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం ప్రసాదం పంపిణిచేసే మార్గం దాటి బయటకు వెళ్ళే మార్గంలో పూల బావి కనిపిస్తుంది. లడ్డు వడలు తయారు చేసే పడిప్పోటుకు దగ్గరలోని బావి పూల బావి. ఈ బావిని `రంగాదాసు` తవ్విoచాడు,ఆ నీటిని పూల చెట్లకు ఉపయోగించేవాడు. కానీ ప్రస్తుతం ఈ బావి సగం తెరచినట్ట్లుగా ఉంది

   కొండ మిద ఉన్న పూలన్నీ స్వామివారికే.కొండ మీద వ్యక్తులు పులు ముడువరాదని కట్టడికూడా. స్వామివారికి అర్పించిన పులను పారవేయక ఈ బావిలోనే వేయడం వల్ల దీనికి `పూల బావి ` అనే పేరు స్టిరపడింది

      యుద్దంలో తొండమాన్ ఓడిపోయాడట.దాక్కోవడానికి తగిన ప్రదేశం ఇదేనంటూ గర్బాలయం చేరాడు. అక్కడ స్వామి శ్రీదేవి భూదేవులతో ఉన్నారు. శ్రీదేవి తొండమాన్నుచూడగానే వృక్షస్తలంలో దాక్కుంది. భూదేవి బయటకు కదిలింది.బావిలో దూకిందట. రామానుజులు భూదేవి గౌరవం కోసం ఆ బావిలో స్వామి నిర్మాల్యం వేయాలని ఆదేశిoచారట

No comments:

Post a Comment