శ్రీవారి హుండీ


                   ఆది శంకరరాచార్యులు తిరుమలలో శ్రీవారి పాదపీఠo దగ్గర ధనాకర్షణ యంత్రం ప్రతిష్ట చేశాడని, ఆ కారణం వల్లనే తిరుమలేశునికి రాబడి పెరుగుతూ ఉందని కొందరి నమ్మకం,. అయితే దీనికి ఆధారాలు లేవు

   శమంతకమణి బంగారాన్ని ప్రసాదించేదని ప్రతీతి. ఈ మణిని కృషుడు అపహరించాడనే నింద కూడా వచ్చింది. నిజానిజాలు బయట పడ్డాక జాంబవంతుడు మణితో కన్యకామణిని కూడా ప్రసాదించాడని,వ్యక్తుల భద్రతకు ముప్పు కలిగించే మణిని శ్రీకృషుడు బాణంతో ఎగురగొట్టడాని, ఆ మణి ప్రస్తుతం శ్రీవారి హుండీ ప్రదేశంలో పడిందని ఆ కారణం వల్లనే అనూహ్యమైన రీతిలో సువర్నకర్షణ, ధనకర్షణ ఏర్పడిందని కొందరు చెబుతారు

  హుండిలో ఒకప్పుడు వెండి, బంగారు నగలు మాత్రం వేసేవారు.కాని క్రమంగా నోట్లు,నాణాలు, ముడుపు కట్టిన అనేక వస్తువులు అర్పించడం ఆనవాయితీ అయిoది. మంగళసూత్రాలతో సహా అన్ని రకాల నగలు సమర్పించడం విశేషం. ఇల్లు కట్టుకోన్నవారు ఆ ఇంటి వెండి నమూనాతో,బంగారు నమూనానో వేయడం కూడా అలవాటే

 శ్రీవారి ఆలయంలోని పెద్ద పెద్ద లోహ పాత్రల్ని `కొప్పెర`లుగా వ్యవహరిస్తారు. హుండిలోని గంగాళం కుడా ఒక కొప్పెర, కన్నడిగుల ఈ హుండిని `రామ కణజం అని  అంటారు

No comments:

Post a comment