త్రోవ భాష్యకారులు


                   కాలినడకన కొండకు వెళ్ళే దారిలో మోకాళ్ళ పర్వతం త్రోవలో భాష్యకారుల సన్నిధి ఉంది .భాష్యకారులు అని అంటే శ్రీమద్రామనుజులే .కాలినడక  త్రోవలో ఉండడం వల్ల త్రోవ భాష్యకారులు .ఇక్కడ ఒక చిన్న మండపం ,ఒక దేవాలయం కూడా కనిపిస్తాయి .ఈ ఆలయాన్ని ఇటివల 2002 లో పునరుద్దించారు .

   శ్రీమద్రామనుజులు  తిరుమల వెళుతుండగా తిరుమలనంబి ఈ ప్రదేశంలోనే ఆలయ మర్యాదలతో స్వాగతం చెప్పారని పెద్దలంటారు .

   తాళ్ళపాక అన్నమయ్య త్రోవ భాస్యకారులను

       ఈతడే రామానుజులు యిహపరదైవము

       నయమై శ్రీ వేంకటేశు నగమెక్కివాకిటను

 అని కీర్తించారు

No comments:

Post a Comment