రంగనాయకుల మండపం



            శ్రీవారి ఆలయం బయట ప్రాకారం అనుకోని ఆగ్నెయదిశలో  ఉన్న మండపం రంగ మండపం .యాదవ ప్రభువయిన శ్రీ రంగనాధ యాదవరాయులు .(క్రీ.శ 1320 -క్రీ.శ .1360) ఈ మండపాన్ని కట్టించినట్లు చెబుతారు .కానీ నిర్మాణం బట్టి ఈ మండపం క్రి.శ 15 లేదా 16 వ శతబ్బం  కాలం నాటిది కావచ్చు

  ఈ మండపం చాల పెద్దది తూర్పు పడమరల కొలత  50 అడుగులు కాగా ఉత్తర దక్షిణ  వైపు కొలత 108 అడుగులు .దక్షిణంవైపు ఓకే చిన్న మందిరం ఉంది .ఈ మందిరంలో శ్రీరంగంలోని రంగానాధస్వామి ఉత్సవ విగ్రహం భద్రపరిచారని  క్రీ.శ  1371 ప్రాంతంలో  గోపన్న మంత్రి మరల ఆ విగ్రహాన్ని శ్రీ రంగం చేర్చాడాని సంప్రదాయం ,చరిత్ర రెండు చెబుతున్నాయి

  ప్రసిద్దులు ,ప్రముఖలు వచ్చిన వేళా ఈ మండపంలో ప్రసాదాలు అందుకొంటారు .ఈ మండపంలోని మనోహర శిల్పాలు ,దండచారి అయిన వామనుడు -దానం చేస్తున్న మహాబలి, విల్లుపట్టకుండా అంజలిభద్డులై కనిపించే  రామలక్ష్మనులు ,పద్మాకారం కలిగిన చెక్కడం ఉన్నాయి అన్నమయ్య కాలంనాటికీ తిరుమల మీద రంగనాధుడు ఉన్నట్లు చెప్పవచ్చు  

No comments:

Post a Comment