ధ్వజస్తంబ మండపంతమిళంలో ధ్వజస్తంబాన్ని `కొడిక్కoబం` అని అంటారు. `కొడి`అంటే జెండా.జెండా ఎగురవేసే స్తంబమనిబావం. బ్రహ్మత్సవ ప్రారంభ సూచకంగా గరుడ ధ్వజపటాన్ని పూజించి ఆ పటాన్ని ధ్వజస్తంబం మీదకు ఎత్తించడం సంప్రదాయం.అలాగే బ్రహ్మత్సవ ముగింపు సందర్భంగా`ధ్వజారోహణ`జరుపుతారు

   నడిమి పడికావలికి చేరువలో ధ్వజస్తంబ మండపం ఉంది. ఎతైయిన బలిపీటం.దానికి చేరువలో స్తంబం రెండు ఉన్నాయి.వీటికి పూర్తిగా బంగారు రేకుల తాపడం ఉంది. ఇక్కడ రెండు వరసలలో ఉన్న ఐదైదు రాతి స్తంబాలున్నాయి. ఈ స్తంబమండపం ముందు దశావతార చిత్రాలున్నాయి.ఇక్కడున్న స్తంబాల మిద యోగ నరసింహ,మత్స్య,హనుమ,బకాసుర సంహారం,శ్రీనివాస కళ్యాణ చిత్రాలున్నాయి.ధ్వజస్తంబం మీద గరుడాఆళ్వార్,కాళీయమర్ధనాది చిత్రాలు కనిపిస్తాయి

  కొండ మీదున్న స్తంబం చందన దారు స్తంబం .ఈ స్తంబం పడయిపోగా శ్రీ పీ.వి.ఆర్.కె.ప్రసాద్ గారు కార్యనిర్వహణదికారిగా ఉన్నపుడు 1980 లో పునద్దరించారు. దీనికోసం  కర్ణాటక రాష్ట్రం నుండి తగిన స్తంబం తెప్పించారు

No comments:

Post a comment