ఏడు కొండలు

    తిరుమలకు కాలిబాటన నడిచివెళ్ళే భక్తులు ఏడుకొండలవాడా ! వెంకటరమణా !గోవిందా !గోవిందా ! అని ఎలుగెత్తి కీర్తించడం అందరికి తేలిసిందే.అయితే ఈ ప్రసిద్ది ఎప్పటినుండి వచ్చిందో కచ్చితంగా తేలియదు .ఏడుకొండలలో ఒక్కో కొండకు ఒక్కో నామం ఉంది .ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర కూడను వుంది

    ఇందులో మొదటిది శ్రీశైలం .ఇది ఇంచుమించు తమిళంలోని `తిరుమలై `అనే మాటకు సరిపోయ్ పదభందం .`తిరు `మంగళవాచకం .మలై అంటే కొండ .శ్రీదేవి నివసిస్తుండడం వల్ల ,భక్తులకు శ్రీప్రదం కావడం వల్ల శ్రీశైలమనే పేరు వచ్చింది

  రెండవది శేషశైలం .శ్రీమహావిష్ణువు ఆదేశం ప్రకారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వతరూపాన్ని ధరించడం చేత  `శేషశైలం `శ్రీమహావిష్ణువు వాయువుకు శేషునికి పందెం పెట్టగా ,శేషుడు వెంకటాద్రిని ఆవరించగా ,వాయువు మహావేగంతో వీచగా ,శేషుడు సువర్ణముఖరీతీరం  దాకా కదిలిపోగా ,స్వామి ఆజ్ఞతో వేంకటాద్రి విముక్తం కావడంతో ,శేషుడు తపం అవరించడం వల్ల `శేషపర్వత`ఖ్యాతి వచ్చింది .

                     మూడవది గరుడాచలం .శ్వేతవరాహ కల్పంలో వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మoతుడు శ్రీ వైకుoటము నుండి ఈ పర్వతం తీసుకురావడం వల్ల గరుడాచలం .

  నాల్గోవధి వేంకటాద్రి . `వేo `కారానికి అమృతమని అర్ధం .కటం అంటే ఐశ్వర్ర్యం.ఆశ్రితులకు అమృతాన్ని ,ఐశ్వర్ర్యంన్ని ప్రసాదించే కొండ అని అభిప్రాయం .లోకంలోని పాపాలకు `వేo`అని వ్యవహారం .ఆ పాపాలను ధహించగాలది కావడం వల్ల వెంకటశైలం .

   ఐదవది  నారాయణాద్రి .సాక్షాత్ శ్రీ మన్నానారాయణుడే వాసం చేయడం వల్ల నారాయణాద్రి నారాయణుడనే విప్రుని ప్రాద్దన మన్నిoఛి శ్రీనివాసుడు వాసం చేయడం నారాయణాద్రి

  ఆరవధి వృషభాద్రి .వృషభుడనే రాక్షసుడు తపస్సు చేయాగా ,తన పేరుతో పర్వతం పిలువబడాలని కోరగా శ్రీనివాసుడు  అనుగ్రహించడం వల్ల వృషబాద్రి

  ఇక చివరది వృషాద్రి.వృష శబ్దానికి ధర్మమని అర్ధం .తన అభివృద్ధికోసం .ఈ కొండ మీద ధర్మదేవత తపస్సు చేయడం వల్ల వ్రషాద్రి

    ఒక్కక యుగంలో ఈ కొండలన్నిటికీ ఒక్కక పేరు ప్రసిద్దంగా వుండేది .వరాహపురాణం ప్రకారం కృత యుగంలో అంజనాద్రి ,త్రేతా యుగంలో నారయణగిరి ,ద్వాపరయుగంలో సింహశైలం ,కలియుగంలో వెంకటాచలం ,బవిషోత్తర పురాణం ప్రకారం కృతయుగంలో వృషాద్రి ,త్రేతాయుగంలో అంజనాచలం ,ద్వాపరయుగంలో శేషశైలం ,కలియుగంలో వెంకటచలం అని పేర్లు .

          ఇవే కాక చింతామణి,జ్ఞానద్రి ,తిర్దాద్రి ,పుష్కరాద్రి ,ఆనందాద్రి ,నీలాద్రి ,నరసింహాద్రి ,వరహాద్రి ,వైకుంటద్రి ,శ్రీ పర్వతమనే పేర్లు ఉన్నాయి .తమిళ సాహిత్యంలో `తిరువేoగడం `అనే మాటకు ప్రాచుర్యం అర్ధం .వేంగి +కడం -వేంగి రాజ్యానికి చివరున్న ప్రదేశం కావడంవల్ల వేంగడం .

   ఏడుకొండల మీద వేంకటేశ్వరుడున్నాడు .ఇందులో మరొక అధ్యాత్మికత రహస్యం ఉంది .శరీరంలో ఏడు చక్రలున్నాయి .మూలధారం ,స్వాధిష్టనం,మణిపూరకం ,అనాహతం ,విశుద్దం ,ఆజ్ఞ ,సహాస్రారం -అని ,అధోముఖమయిన కుండలిని శక్తిని యోగాబ్యాసంతో సహస్రారానికి పయనిoపజేయడం పరమాత్మ  సాక్షాత్కరానికి మార్గమని అంటారు  http://tirumaladarshini.blogspot.in

2 comments: