గరుడకంబం


                                            శ్రీవారి ఆలయానికి ఎదురుగా మెట్ల మీద ఘాoటా మండపం ముoగిట్లో కనిపించే ఎత్తైన దీపస్తంబం గరుడకంబం . తమిళంలో స్తంబాన్ని `కంబం`అంటారు .ఒకప్పుడు ఈ  స్తంబం గుడి లోపల గరుడాళ్వారు వెనుక భాగంలో ఉండేది .అందువల్ల `గరుడ స్తంబమని `అని పేరు.ఇక్కడ భక్తాదులు సంఖ్యా పెరగడం వల్ల ,దర్శనంలో ఆలస్యం తగ్గించడాని కోసం ఈ గరుడ కంబాన్ని  ధ్వజ స్తంబం దగ్గరకు మార్చారు .ఆ ఫై ఆలయం వెలుపల ప్రసాదాలు అమ్మేచోట నిలబెట్టారు .మరల ఈ గరుడకంబాన్ని సన్నిది విధిలో చేర్చారు .ఇప్పుడు ఆంజనేయస్వామి గుడి సమీపాన ఉన్నది

   ఒకప్పుడు స్తంబాలు రెండే .ఒకటి శిఖరం లేనిదీ .రెండొవది  శిఖరం కలది .గరుడకంబం దేవాలయం లోపల ఉన్న రోజుల్లో భక్తాదులు దీపాలు వెలిగించి ఆ ఫై పొర్లు దండాలు పెట్టేవారు .గర్భగుడి చుట్టూ ప్రదక్షణం చేసి గరుడకంబం దగ్గర పూర్తి చేసేవారు .ఈ పొర్లు దండాల విధానాన్ని కన్నడిగులు `ప్రాణాచార `మని ఇప్పటికి వ్యవహారిస్తారు .కోరికలు నెరవేరినందుకు ప్రాణాలను భిగబట్టి చేసే పొర్లు దండం కావడం వల్ల `ప్రాణాచార `దేనినే అంగప్రదక్షణ అని అంటారు

       సన్నిధి వీధిలో ప్రస్తుతం 4 దీపస్తంబాలు ఉన్నాయి మొదటి దానిఫై చక్రం,రెండోవ దానిఫై గరుడాఆళ్వార్ ,మూడవ దానిఫై హనుమంతుడు ,నాల్గవ దానిఫై గరుడాఆళ్వార్ చిత్రితమయిన 2కోప్పరలున్నాయి .ఉషోదయ కాలంలో ముపై మూడు కోట్ల దేవతలు స్వామిని సేవించి వెళ్ళిన కొన్ని నిమిషాలలోనే `అంగప్రధక్షనానికి `అవకాశం కల్పిస్తున్నారు .దేవతల సంచారంతో తేజోమయమయిన ప్రాకారంలో ప్రదక్షణం చేయడంవల్ల శరీరంలోని  72000 సుక్ష్మనాడులలోని `అడ్డు తొలగిపోతుంది .ఫైగా మానసిక వికాసం కలుగుతుంది .ఇదే అంగ ప్రధక్షనలోని అంతరాద్ధం

      

No comments:

Post a comment