బంగారు బావి


తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు బావులున్నాయి. మొదటిది సంపంగి ప్రదక్షణలో రామానుజ కూటం,యామునై తురై ఎదురుగా ఉన్న బావి.రెండొవది పూల బావి. మూడోవది బంగారు బావి.తిరుమామణి మండపం ఎదురుగా కనిపించే బావి బంగారు బావి.శ్రీవారి దర్సనం చేసుకొనే బయట అడుగు పెట్టెచోట ఎదురుగా కనిపించే బావి ఇదే.ఈ బావికి బంగారు రేకుల తాపడం వల్ల బంగారు బావి అని విఖ్యాతి. స్వామివారి పూజలకు ,నైవేద్య్యములకు అవసరమైన నీరు అందించే బావి ఈ బావి.శ్రీదేవి భూదేవి సౌకర్యం నిమిత్తం ఈ బావిని నిర్మించినట్లు ప్రతీతి

  ఈ బావిని రంగదాసు నిర్మించినట్లు పురాణగాధ అతడు పూర్వజన్మలో తొండమాన్ చక్రవర్తి ఈ బావి కింద విరజానది ప్రవహిస్తుందని పెద్దల విశ్వాసం.శ్రీ వెంకటచల ఇతిహాసాలలో బంగారు బావి ప్రసక్తి కనిపిస్తుంది

 ఈ బావి నుండి నీరు తోడే పద్ధతి విజయనగర రాజుల కాలంలో హంపిలో నీరు తోడే పద్దతిని పోలివుందని చారిత్రుకులు బావిస్తున్నారు

No comments:

Post a Comment