తలయేరు గుండు దాటాక కనిపించే మండపం కుమ్మర మండపం .ఈ మండపంలో `కురువనంభి `అనే కుమ్మరి ఉండేవాడు .అతనికి `కురుకనంబి `అని కూడా పేరు .ఇతడు `తొండమాన్ `కాలం నాటివాడు .శ్రీవారి నైవేద్దయ్యనికి అవసరమయిన కుండలను సమకుర్చేవాడు .పని పాటుల వల్ల స్వామివారిని సేవించలేకపోయవాడు ..చివరకు కొయ్యతో శ్రీనివాసమూర్తిని చేసుకొని కుండలు చేశాక మిగిలిన మట్టితో పూలుగా చేసి అర్పించేవాడు .
ఆ మట్టి పూలు శ్రీవారి ఆలయంలో స్వామి పాదాల దగ్గర కనిపించేవి .తొండమాన్ ఆశ్చర్ర్య పడ్డాడు .చివరకు `కురువనంభి `కధ తెలిసింది .తనకూ ఆ యోగ్గ్యతను ప్రసాదించమని కోరాడు .అప్పుడు స్వామి `అహంకారం `వదిలి పెట్టమని `తొండమాన్ `ను ఆదెశించాడు .ఇద్దరికి సాయుజ్జం ప్రసాదించాడు .తిరుమలకు వెళ్ళే దారిలో `కురువనంభి `ఒక గోపురం కట్టించాడట .కాని ప్రస్తుతం ఆ గోపురం ఏదో తేలియదు .కురువనంభి కుటుంబీకుల బొమ్మలు ,అతని కుమ్మరిసారే వగైరాలున్న శిలాఫలకాలు ఇప్పటికి కనిపిస్తాయి .
తాళ్ళపాక అన్నమయ్యః `కురువనంభి `కధను తన సంకీర్తనల్లో చాల చక్కగా పొందుపరచాడు
కుమ్మరదాసుడైన కురువరతినంభి
యిమ్మన్న వరము లెల్ల నిచ్చినవాడు
news4andhra is an Informative Portal which provides information about the latest news and Entertainment.
ReplyDeleteTelugu Movie News, Telugu Political News and Telugu Cinema Reviews