నారాయణ పాదములు- హాతిరాంజీ మఠo
తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ. దూరంలో `నారాయణ పాదం` ఉంది. శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలఫలకం ఇక్కడే కనిపిస్తుంది.

ఆషాడ శుద్ద ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిది ఇక్కడే శ్రీపాద పూజ,ఛత్రస్టాపన ఉత్సవాలు జరుగుతాయి

 శ్రీవారికి ప్రాతఃకాల మధ్యాహ్నకాల ఆరాధనం ముగిశాక అర్చకులు,ఏకాంగులు, అధికారులు,పరిచారకులు రెండు `భూచక్ర ` గొడుగులను, యమునోత్తరం నుండి పుష్పసరాలను,బంగారు బావి తిర్ద్దాన్ని సంసిద్ధం చేసుకొని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు.మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు. ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీ పాదలకు బంగారు బావి జలంతో అభిషేకం చేస్తారు. హారతి ఆరగింపులు విర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు `భూచక్ర గొడుగులను` కట్టి వెనుకకు తిరుగుతారు. నారాయణగిరి దిగి బంగళాతోటకు వచ్చి చేరుతారు.ఆఫై ప్రసాద వినియోగం,వనభోజనం జరుగుతాయి. తదనంతరం మహాద్వారం చేరుకొంటారు.ఇవేగాక అభిదేయక అభిషేకం(జూన్ నెలలో) పద్మావతి పరిణయ వైభవం (వైశాఖా శుద్ద దశమి) గోదా పరిణయ ఉత్సవం(పుష్య మాసం) అనే కొత్త ఉత్సవాలు తిరుమలలో జరుగుతున్నాయి

                           హాతిరాంజీ మఠo

 ఆలయానికి ఆగ్నేయంలో ఉన్న మఠానికి `హతిరాంజి మఠo అనే పేరు. ఈ మఠo సుమారు 5౦౦ సంవత్సవరాలనుండి తిరుమలలో ప్రసిద్ది పొందిన మఠo తిరుపతిలో కూడా `మహంత్ మఠo ఉంది.ఈ మఠoను స్తాపించినవాడు `హతిరాంజీ`.ఇతనినే బావాజీ అని అంటారు. రామానుజ సాంప్రదాయాన్ని ప్రచారం చేయడం ఈ మఠo లక్ష్యం.తిరుమల నిర్జనవాసంగా ఉన్నవేళా ఆంగ్లేయుల నుండి తిరుమల ఆలయ పరిపాలను చేపట్టి ఆలయ సాంప్రదాయాలను విచ్చిన్నం చేయకుండా కాపాడుతూ `విచారణ కర్త్తలుగా వ్యవహరించినవారు మహంతులు.వారిలో సేవాదాస్,ధర్మదాస్,భగవాన్దాస్,మహాభీర దాస్,రామకృష్ణ దాస్,ప్రయోగదాస్లు చాల ప్రసిద్దులు.

ఈ మఠoలో పంచముఖ ఆంజనేయులు,ఫూలడోలు,శ్రీరామనవమి దోలత్సవం ప్రదేశాలు చూడదగ్గవి.దశావతర చిత్రాలు దర్శించ దగ్గవి.ఈ దేవాలయంలో పెద్ద పెద్దవయిన సాలగ్రామాలు ఉన్నాయి

` హతి` అంటే ఏనుగు.భహుశ భైరాగి పేరు రాం కావచ్చు.ఏనుగంత మనిషికావడం వల్ల హతిరాం హతిరాoగా వ్యవహరింపబడి ఉండవచ్చు.లేదా శ్రీవారు ఏనుగు రూపంలో `రాం`కు దర్సనమివ్వడం వల్ల `హత్తిరాం` అయి ఉండవచ్చు. హత్తిరాం జీ కధలు కోకొల్లలు

ఉత్తరదేశం నుండి తిరుమల చేరుకొన్నవాడు `రామ్` అతని తపస్సు స్వామి చాల సార్లు పరీక్షించాడు. బోయగా,చెంచుగా, కిరాతుడుగా,పులిగా,నక్కగా, కుక్కగా,వేషాలు వేసి శ్రద్ధను పరీక్షించేవాడు.చివరకు `రాంజీ విసుగుతో కొండ దిగుతుంటే బ్రాహ్మణుని రూపంలో వెన్నంటి వచ్చి కొండవదలి పోవద్దని సలహా ఇచ్చాడు. అయినా `రాంజీ` కదిలి పోతుంటే `అవ్వచారి కోన దగ్గర సాక్షాత్కారించాడు.

ఒకప్పుడు చంద్రగిరి దేవారాయలు `హతిరాంజీ ని ఏనుగుల బలం చూపమని పరిహాసం చేశాడట.రాత్రికి రాత్రి బండ్లకొలది చేరుకులను తిని మాముల మనిషిగా బయటకు వచ్చాడట.కానీ స్వామివారె ఏనుగు రూపంలో వచ్చి హతిరాంజీ ని కాపాడాడని భక్తులు చెబుతారు

హతిరాంజీ అడవిలో దొరికే ఓ రకమైన `ఆకును` తినేవారు.ఈ ఆకును తింటే ఆకలి ఉండదు.ఇప్పటికీ తిరుమలలో ఈ ఆకు మఠoలో దొరుకుతుంది                        ఆకాశరాజు కుల దేవత-ఆవనాక్షమ్మ-నారాయణవనం 


వేదాలను పరిరక్షించి వెలసిన తల్లి... ఆకాశ రాజు కుల దైవం... పద్మావతి దేవి నిత్యం కొలచిన దేవి.. ఆమ్నాయాక్షి.. శ్రీనివాసుడు, పద్మావతిలకు వివాహం నిశ్చయం అయ్యాక కల్యాణానికి ముందు ఈ అమ్మనే దర్శించుకున్నారట.చిత్తూర్ జిల్లా నారాయణవనం గ్రామానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం మరెన్నో విశేషాలకు అలవాలం

ఆమ్నాo అంటే వేదమని,అక్షి అంటే కన్నులు అని అర్ధం. వేదాలను కన్నులుగా ఉన్న అమ్మవారు కాబట్టి.ఆ తల్లికి ఆమ్నయాక్షి అనే పేరు వచ్చింది. ఆ పేరే కాల క్రమంలో ఆవనాక్షమ్మగా మారింది. ఆ అమ్మ ఆలయం చిత్తూర్ జిల్లా నారాయణ వానం గ్రామానికి కిలోమీటరు దూరంలో అరుణానది సమీపంలో ఉంది.

 అమ్మవారి ఆవిర్భావం వెనుక ఓ పురాణ కధ ఉంది. పూర్వం సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వేదాలు తస్కరించాడట..అప్పుడు పార్వతి దేవి అతణ్ణి సంహరించి వాటిని బ్రహ్మకు అప్పగించి నారాయణవనంలో ఆమ్నాయక్షిగా వేలిసిందట.అప్పట్లో అమ్మ విగ్రహం చాలా చిన్నగా ఉండేదట.తరువాత కాలంలో అగస్త్య మహర్షి ఆకాశరాజు.. ఆ చిన్న విగ్రహం వెనుకనే అవే పోలికలు ఉండేలా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టించారు.సోమకున్ని సంహరించిన ఈ అమ్మ కాళికామాతను పోలి ఉంటుంది.

                        ఆకాశరాజు కుల దేవత-ఆవనాక్షమ్మ

లక్ష్మిదేవి ఆవతారంగా చెప్పే పద్మావతి దేవి తండ్రి ఆకాశరాజు.. వాళ్ళ కుల దేవతే ఆవనాక్షమ్మ.అప్పట్లో ఆకాశరాజు కోట ముందు భాగంలో ఆలయం ఉన్నట్లు చరిత్ర చెప్పుతుంది.ఆకాశరాజు ఎక్కడికైనా వెళ్ళేముందు తప్పకుండా అమ్మవారిని దర్సిన్చుకోనేవాడట.ఆయనకు చాలాకాలం వరకు పిల్లలు పుట్టలేదు.సంతానం కోసం అమ్మవారికి ఎన్నో పూజలు చేసేవాడట.ఫలితంగా పద్మావతి దేవి జన్మించిందని పురాణాలూ చెబుతున్నాయి.పద్మావతి దేవి తండ్రితో సహా రోజు ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు చేసేదట. నారాయనవనంలోని ఉద్యానవనంలో ఓ రోజు శ్రీనివాసుడిని చూసి మోహించింది పద్మావతి దేవి.ఆ శ్రీనివాసుడిని తనకు భర్తను చేయమని ఆవనాక్షమ్మను కోరుకొందట. శ్రీనివాసుడు,పద్మావతిలకు పెళ్లి నిశ్చయంఅయ్యాక.. ఇద్దరును ఇక్కడికి వచ్చి అమ్మవారి అశ్విర్వాదం తీసుకొన్నారు. పద్మావతి ఈ ఆలయంలోగౌరీ వ్రతం చేసిందట.పరిణయం తరువాత వాళ్ళిద్దరూ తిరుమలకు వెళ్ళుత్తు అమ్మవారిని అమ్మవారిని దర్శించుకున్నట్లు" పద్మావతి పరిణయం` పుస్త్తకంలో ఉంది.


 ఆవనాక్షమ్మ ఆలయ సమీపంలోనే అగస్తేశ్వరలయం ఉంది. దీన్ని అగస్త్య మహర్షి ప్రతిష్టించారట.ఆలయాన్ని ఆకాశరాజు అభివృద్ధి చేశాడు.ఈ గుడిలోని అమ్మవారిని మరకత వల్లి అంటారు. సాధారణంగా శివాలయంలో ముందు శివలింగం దానికి ఎడమవైపు అమ్మవారు ఉంటారు.కానీ ఆలయంలో మొదట అమ్మవారి విగ్రహం ఉంది. ఆ తరువాత స్వామి విగ్రహం ఉండటం విశేషం.పద్మావతి దేవికి ఒకానొక సమయంలో జబ్బు చేసిందట.అప్పుడు అగస్త్య మహర్షి సూచన మేరకు ఆమె ఇక్కడ రుద్రాభిషేకం చేయిoచగా వ్యాధి నయమైనట్లు " వెంకటచల మహత్యంలో " ఉన్నదీ.


   జాతర

ఈ ఆలయానికి మంగళ,శుక్ర,ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యాలో వాస్తుoటారు.ఈ అమ్మవారికి పూజలు చేస్తే వివాహం కానివారికి వివాహం అవుతుందని .పిల్లలు లేని వారికీ పిల్లలు పుడతారని.భక్తుల నమ్మకం
అమ్మవారికి ఏటా ౧౮ రోజులపాటు జాతర జరుగుతుంది. ఇది ఆగష్టు 22-26 తేదీల మధ్యలో ప్రారంభమై సెప్టెంబర్ 11,12 తేదిల్లో ముగుస్తుంది.ఏటా అక్టోబర్లో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పుడు ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు మొదలవతాయి.

   ఈ ఆలయానికి దాదాపు మూడు వేల సంవత్స్తరాల చరిత్ర ఉంది.మొదట ఆకాశరాజు,తరువాత కార్వేటి వంశస్తులు,ఆ తరువాత తిరుత్తణి రాజులు.దీని అభివృద్దికి కృషిచేశారు.1967 లో ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్తానం పరిధిలోకి వచ్చింది.అప్పటి నుంచి పూజాద్రవ్యాలు వసతులు అన్ని వారె సమకూరుస్తున్నారు.ఆలయానికి వచ్చే భక్తుల కోసం రాష్ట్ర పర్యటక శాఖ అనేక వసతులు సమకూర్చింది. భక్తులు, పొంగళ్ళు పెట్టుకొనేందుకు వీలుగా షెడ్డు, ఇతర సౌకర్యాలు భాగంగా మరుగు దొడ్డ్లు నిర్మించారు.

   ఆవనాక్షమ్మ ఆలయంలో ఎన్నో విగ్రహాలు దర్సనమిస్తాయి.గర్భగుడిలో అమ్మవారి చిన్న విగ్రహంతో పాటు పెద్ద విగ్రహం, శాoకరి దేవి విగ్రహం,వేప చెట్టు కింద గణపతి విగ్రహం,ఆలయం వెనుక నాగాలమ్మ విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలో ముందు భాగంలో రెండు పెద్ద రాతి స్తంభాలు ఉన్నాయి. వీటి మధ్యలో భారీ ఘంట ఉండేదట.అమ్మవారికి పూజలు నిర్వహించే సమయంలో దీన్ని మ్రోగిస్తే చుట్టూ ప్రక్కల గ్రామాలూ, పొలాల్లో ఉన్నవారు అవనాక్షమ్మను ప్రాద్దిoచేవారని చెబుతారు.

ఆలయం-ఇలా చేరుకోవచ్చు

ఆవనాక్షమ్మ ఆలయం తిరుపతికి 40 కిలోమిటర్లు దూరంలో ఉంది.తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే బస్సు ఎక్కి నారాయణవనంలో దిగాలి. అక్కడి నుంచి కిలో మీటరు దూరం ఉంటుంది.షేర్ ఆటోలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.రైళ్ళలో వచ్చేవారు తిరుపతి,పుత్తూరు(5 కి.మీ దూరం నుంచి రావచ్చు.No comments:

Post a comment