శ్రీరామకృష్ణ తీర్ధముక్కోటి-కుమారధార తీర్ధం

                            శ్రీరామకృష్ణ తీర్ధముక్కోటి

తిరుమలలో శ్రీవారి ఆలయానికి 9 క్రి.మీ దూరంలో `రామకృష్ణ తీర్ధం ఉంది. ఈ తీర్ధం గురించి స్కంద పురాణంలో సవివరంగా వర్ణితం
వెంకటాద్రి లో రామక్రిష్ణుడనే మహర్షి స్నానార్ధం ఒక తీర్ధం కల్పించుకొని తపస్సు చేయడం మొదలు పెట్టాడు. వందల సంవత్సరాలు గడిచాయి. అతని చుట్టూ పుట్టలు పెరిగాయి. రామక్రిషునుడు చలించలేదు,దేవేంద్రుడు ఏడు రోజులు వర్షం కురిపించాడు.పిడుగులు పడ్డాయి.కాని పుట్ట కరుగలేదు. స్వామి ప్రతక్షమయ్యాడు.నీ పేరుతో ఈ తీర్ధం విఖ్యతామవుతుంది.మకర మాసం పుష్యమి నక్షత్రయుక్త పూర్ణిమ పర్వదినం దేవతలు దిక్ఫలకులు స్నానం చేసి పునితులుఅవుతారు. ఈ తీర్ధంలో స్నానం చేసే వారు సర్వ పాప విముక్తులు అవుతారు.సర్వభిస్థములు సిద్దిస్తాయి అని అనుగ్రహించాడు


మకర మాసం, పుష్యమి నక్షత్రయుక్త పూర్ణిమ శుభ పర్వదినం మధ్యహ్న ఆరాధన పూర్తి అయ్యాక అర్చకులు, పాచకులు, ఏకాంగులు,భక్తులు మంగళ వాద్యాలతో రామకృష్ణ తీర్ధం చేరుకొంటారు. అక్కడున్న శ్రీకృష్ణస్వామికి అభిషేకం ,పుష్పాలంకరణ,ఆరాధనలు జరుగుతాయి. గోష్టి తరువాత చందన తాంబుల ప్రసాద వినియోగం ఉంటుంది. అఫై రామకృష్ణ తీర్ధం నుండి వాద్యాలతో శ్రీవారి సన్నిధి చేరుకొంటారు


                     కుమారధార తీర్ధం

 తిరుమలలో శ్రీవారి సన్నిదికి సుమారు 12 కి.మీ దూరంలో కుమారధారా తీర్ధం ఉంది. వరహః,పద్మ, వామన, మార్కండేయ పురాణాలలో ఈ తీర్ధ మహత్యం వర్ణితం. ఈ పురాణ కధల్లో ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తాయి

  మొదటిది తారకాసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యాదోషాన్ని ఈ తీర్ధం లో స్నానం చేయడం వల్ల కుమార స్వామి పోగుట్టుకోన్నాడట. కుమారస్వామి ఈ ధారలో స్నానం చేయడం వల్ల కుమారధారా తిర్ధమనే ప్రసిద్ధి వచ్చింది. వెంకటేశ్వర అస్త్తోతర శతనామావళి లో `కుమారధారికా వాస స్ఖందాభిష్ట ప్రదాయ శ్రీ వెంకటేశయ నమః అని ఉంది.

 వృద్దులయిన వారు స్వామి అనుగ్రహం వల్ల ఈ తీర్ధం లో స్నానం వల్ల కుమారులుగా పరివర్త్తనం చెండుతారట అనేది రెండోవ అంశం. దేవఋణం తీర్చడని కోసం బతకాలని ఆరాటపడే వృద్దుని మనోగతాభిప్రాయం తెలుసుకొని  శ్రీనివాసుడు ` కుమారధారా తిర్డ్డస్నానం` చేయిoచడం మర్కేండేయ పురాణంలోని కదంశాo. కుంభమాసం మఖా నక్షత్రంతో కూడిన పూర్ణిమ పర్వ దినంలో `మొక్కోటి ఉత్సవం జరుగుతుంది.

No comments:

Post a comment