ఆకాశ రాజు కుల దేవత-నారాయణవనం ఆవనాక్షమ్మ


వేదాలను పరిరక్షించి వెలసిన తల్లి... ఆకాశ రాజు కుల దైవం... పద్మావతి దేవి నిత్యం కొలచిన దేవి.. ఆమ్నాయాక్షి.. శ్రీనివాసుడు, పద్మావతిలకు వివాహం నిశ్చయం అయ్యాక కల్యాణానికి ముందు ఈ అమ్మనే దర్శించుకున్నారట.చిత్తూర్ జిల్లా నారాయణవనం గ్రామానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం మరెన్నో విశేషాలకు అలవాలం

ఆమ్నాo అంటే వేదమని,అక్షి అంటే కన్నులు అని అర్ధం. వేదాలను కన్నులుగా ఉన్న అమ్మవారు కాబట్టి.ఆ తల్లికి ఆమ్నయాక్షి అనే పేరు వచ్చింది. ఆ పేరే కాల క్రమంలో ఆవనాక్షమ్మగా మారింది. ఆ అమ్మ ఆలయం చిత్తూర్ జిల్లా నారాయణ వానం గ్రామానికి కిలోమీటరు దూరంలో అరుణానది సమీపంలో ఉంది.

 అమ్మవారి ఆవిర్భావం వెనుక ఓ పురాణ కధ ఉంది. పూర్వం సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వేదాలు తస్కరించాడట..అప్పుడు పార్వతి దేవి అతణ్ణి సంహరించి వాటిని బ్రహ్మకు అప్పగించి నారాయణవనంలో ఆమ్నాయక్షిగా వేలిసిందట.అప్పట్లో అమ్మ విగ్రహం చాలా చిన్నగా ఉండేదట.తరువాత కాలంలో అగస్త్య మహర్షి ఆకాశరాజు.. ఆ చిన్న విగ్రహం వెనుకనే అవే పోలికలు ఉండేలా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టించారు.సోమకున్ని సంహరించిన ఈ అమ్మ కాళికామాతను పోలి ఉంటుంది.

                        ఆకాశరాజు కుల దేవత-ఆవనాక్షమ్మ

లక్ష్మిదేవి ఆవతారంగా చెప్పే పద్మావతి దేవి తండ్రి ఆకాశరాజు.. వాళ్ళ కుల దేవతే ఆవనాక్షమ్మ.అప్పట్లో ఆకాశరాజు కోట ముందు భాగంలో ఆలయం ఉన్నట్లు చరిత్ర చెప్పుతుంది.ఆకాశరాజు ఎక్కడికైనా వెళ్ళేముందు తప్పకుండా అమ్మవారిని దర్సిన్చుకోనేవాడట.ఆయనకు చాలాకాలం వరకు పిల్లలు పుట్టలేదు.సంతానం కోసం అమ్మవారికి ఎన్నో పూజలు చేసేవాడట.ఫలితంగా పద్మావతి దేవి జన్మించిందని పురాణాలూ చెబుతున్నాయి.పద్మావతి దేవి తండ్రితో సహా రోజు ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు చేసేదట. నారాయనవనంలోని ఉద్యానవనంలో ఓ రోజు శ్రీనివాసుడిని చూసి మోహించింది పద్మావతి దేవి.ఆ శ్రీనివాసుడిని తనకు భర్తను చేయమని ఆవనాక్షమ్మను కోరుకొందట. శ్రీనివాసుడు,పద్మావతిలకు పెళ్లి నిశ్చయంఅయ్యాక.. ఇద్దరును ఇక్కడికి వచ్చి అమ్మవారి అశ్విర్వాదం తీసుకొన్నారు. పద్మావతి ఈ ఆలయంలోగౌరీ వ్రతం చేసిందట.పరిణయం తరువాత వాళ్ళిద్దరూ తిరుమలకు వెళ్ళుత్తు అమ్మవారిని అమ్మవారిని దర్శించుకున్నట్లు" పద్మావతి పరిణయం` పుస్త్తకంలో ఉంది.


 ఆవనాక్షమ్మ ఆలయ సమీపంలోనే అగస్తేశ్వరలయం ఉంది. దీన్ని అగస్త్య మహర్షి ప్రతిష్టించారట.ఆలయాన్ని ఆకాశరాజు అభివృద్ధి చేశాడు.ఈ గుడిలోని అమ్మవారిని మరకత వల్లి అంటారు. సాధారణంగా శివాలయంలో ముందు శివలింగం దానికి ఎడమవైపు అమ్మవారు ఉంటారు.కానీ ఆలయంలో మొదట అమ్మవారి విగ్రహం ఉంది. ఆ తరువాత స్వామి విగ్రహం ఉండటం విశేషం.పద్మావతి దేవికి ఒకానొక సమయంలో జబ్బు చేసిందట.అప్పుడు అగస్త్య మహర్షి సూచన మేరకు ఆమె ఇక్కడ రుద్రాభిషేకం చేయిoచగా వ్యాధి నయమైనట్లు " వెంకటచల మహత్యంలో " ఉన్నదీ.


   జాతర

ఈ ఆలయానికి మంగళ,శుక్ర,ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యాలో వాస్తుoటారు.ఈ అమ్మవారికి పూజలు చేస్తే వివాహం కానివారికి వివాహం అవుతుందని .పిల్లలు లేని వారికీ పిల్లలు పుడతారని.భక్తుల నమ్మకం
అమ్మవారికి ఏటా ౧౮ రోజులపాటు జాతర జరుగుతుంది. ఇది ఆగష్టు 22-26 తేదీల మధ్యలో ప్రారంభమై సెప్టెంబర్ 11,12 తేదిల్లో ముగుస్తుంది.ఏటా అక్టోబర్లో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పుడు ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు మొదలవతాయి.

   ఈ ఆలయానికి దాదాపు మూడు వేల సంవత్స్తరాల చరిత్ర ఉంది.మొదట ఆకాశరాజు,తరువాత కార్వేటి వంశస్తులు,ఆ తరువాత తిరుత్తణి రాజులు.దీని అభివృద్దికి కృషిచేశారు.1967 లో ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్తానం పరిధిలోకి వచ్చింది.అప్పటి నుంచి పూజాద్రవ్యాలు వసతులు అన్ని వారె సమకూరుస్తున్నారు.ఆలయానికి వచ్చే భక్తుల కోసం రాష్ట్ర పర్యటక శాఖ అనేక వసతులు సమకూర్చింది. భక్తులు, పొంగళ్ళు పెట్టుకొనేందుకు వీలుగా షెడ్డు, ఇతర సౌకర్యాలు భాగంగా మరుగు దొడ్డ్లు నిర్మించారు.

   ఆవనాక్షమ్మ ఆలయంలో ఎన్నో విగ్రహాలు దర్సనమిస్తాయి.గర్భగుడిలో అమ్మవారి చిన్న విగ్రహంతో పాటు పెద్ద విగ్రహం, శాoకరి దేవి విగ్రహం,వేప చెట్టు కింద గణపతి విగ్రహం,ఆలయం వెనుక నాగాలమ్మ విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలో ముందు భాగంలో రెండు పెద్ద రాతి స్తంభాలు ఉన్నాయి. వీటి మధ్యలో భారీ ఘంట ఉండేదట.అమ్మవారికి పూజలు నిర్వహించే సమయంలో దీన్ని మ్రోగిస్తే చుట్టూ ప్రక్కల గ్రామాలూ, పొలాల్లో ఉన్నవారు అవనాక్షమ్మను ప్రాద్దిoచేవారని చెబుతారు.

ఆలయం-ఇలా చేరుకోవచ్చు

ఆవనాక్షమ్మ ఆలయం తిరుపతికి 40 కిలోమిటర్లు దూరంలో ఉంది.తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే బస్సు ఎక్కి నారాయణవనంలో దిగాలి. అక్కడి నుంచి కిలో మీటరు దూరం ఉంటుంది.షేర్ ఆటోలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.రైళ్ళలో వచ్చేవారు తిరుపతి,పుత్తూరు(5 కి.మీ దూరం నుంచి రావచ్చు.

ఏడు కొండలు

    తిరుమలకు కాలిబాటన నడిచివెళ్ళే భక్తులు ఏడుకొండలవాడా ! వెంకటరమణా !గోవిందా !గోవిందా ! అని ఎలుగెత్తి కీర్తించడం అందరికి తేలిసిందే.అయితే ఈ ప్రసిద్ది ఎప్పటినుండి వచ్చిందో కచ్చితంగా తేలియదు .ఏడుకొండలలో ఒక్కో కొండకు ఒక్కో నామం ఉంది .ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర కూడను వుంది

    ఇందులో మొదటిది శ్రీశైలం .ఇది ఇంచుమించు తమిళంలోని `తిరుమలై `అనే మాటకు సరిపోయ్ పదభందం .`తిరు `మంగళవాచకం .మలై అంటే కొండ .శ్రీదేవి నివసిస్తుండడం వల్ల ,భక్తులకు శ్రీప్రదం కావడం వల్ల శ్రీశైలమనే పేరు వచ్చింది

  రెండవది శేషశైలం .శ్రీమహావిష్ణువు ఆదేశం ప్రకారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వతరూపాన్ని ధరించడం చేత  `శేషశైలం `శ్రీమహావిష్ణువు వాయువుకు శేషునికి పందెం పెట్టగా ,శేషుడు వెంకటాద్రిని ఆవరించగా ,వాయువు మహావేగంతో వీచగా ,శేషుడు సువర్ణముఖరీతీరం  దాకా కదిలిపోగా ,స్వామి ఆజ్ఞతో వేంకటాద్రి విముక్తం కావడంతో ,శేషుడు తపం అవరించడం వల్ల `శేషపర్వత`ఖ్యాతి వచ్చింది .

                     మూడవది గరుడాచలం .శ్వేతవరాహ కల్పంలో వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మoతుడు శ్రీ వైకుoటము నుండి ఈ పర్వతం తీసుకురావడం వల్ల గరుడాచలం .

  నాల్గోవధి వేంకటాద్రి . `వేo `కారానికి అమృతమని అర్ధం .కటం అంటే ఐశ్వర్ర్యం.ఆశ్రితులకు అమృతాన్ని ,ఐశ్వర్ర్యంన్ని ప్రసాదించే కొండ అని అభిప్రాయం .లోకంలోని పాపాలకు `వేo`అని వ్యవహారం .ఆ పాపాలను ధహించగాలది కావడం వల్ల వెంకటశైలం .

   ఐదవది  నారాయణాద్రి .సాక్షాత్ శ్రీ మన్నానారాయణుడే వాసం చేయడం వల్ల నారాయణాద్రి నారాయణుడనే విప్రుని ప్రాద్దన మన్నిoఛి శ్రీనివాసుడు వాసం చేయడం నారాయణాద్రి

  ఆరవధి వృషభాద్రి .వృషభుడనే రాక్షసుడు తపస్సు చేయాగా ,తన పేరుతో పర్వతం పిలువబడాలని కోరగా శ్రీనివాసుడు  అనుగ్రహించడం వల్ల వృషబాద్రి

  ఇక చివరది వృషాద్రి.వృష శబ్దానికి ధర్మమని అర్ధం .తన అభివృద్ధికోసం .ఈ కొండ మీద ధర్మదేవత తపస్సు చేయడం వల్ల వ్రషాద్రి

    ఒక్కక యుగంలో ఈ కొండలన్నిటికీ ఒక్కక పేరు ప్రసిద్దంగా వుండేది .వరాహపురాణం ప్రకారం కృత యుగంలో అంజనాద్రి ,త్రేతా యుగంలో నారయణగిరి ,ద్వాపరయుగంలో సింహశైలం ,కలియుగంలో వెంకటాచలం ,బవిషోత్తర పురాణం ప్రకారం కృతయుగంలో వృషాద్రి ,త్రేతాయుగంలో అంజనాచలం ,ద్వాపరయుగంలో శేషశైలం ,కలియుగంలో వెంకటచలం అని పేర్లు .

          ఇవే కాక చింతామణి,జ్ఞానద్రి ,తిర్దాద్రి ,పుష్కరాద్రి ,ఆనందాద్రి ,నీలాద్రి ,నరసింహాద్రి ,వరహాద్రి ,వైకుంటద్రి ,శ్రీ పర్వతమనే పేర్లు ఉన్నాయి .తమిళ సాహిత్యంలో `తిరువేoగడం `అనే మాటకు ప్రాచుర్యం అర్ధం .వేంగి +కడం -వేంగి రాజ్యానికి చివరున్న ప్రదేశం కావడంవల్ల వేంగడం .

   ఏడుకొండల మీద వేంకటేశ్వరుడున్నాడు .ఇందులో మరొక అధ్యాత్మికత రహస్యం ఉంది .శరీరంలో ఏడు చక్రలున్నాయి .మూలధారం ,స్వాధిష్టనం,మణిపూరకం ,అనాహతం ,విశుద్దం ,ఆజ్ఞ ,సహాస్రారం -అని ,అధోముఖమయిన కుండలిని శక్తిని యోగాబ్యాసంతో సహస్రారానికి పయనిoపజేయడం పరమాత్మ  సాక్షాత్కరానికి మార్గమని అంటారు  http://tirumaladarshini.blogspot.in

పాదాల మండపం                      కాలి నడక మార్గంలో వెళ్ళేవారికీ అలిపిరి ప్రదేశంలో కనిపిచే మండపం ,పడాల మండపం .దీనినే పాదాల మండపం అని కూడా అంటారు .క్రీ.శ .1628 కాలం నాటిది ఈ పాదాల మండపం .ఈ మండపంలో  `పాదరక్షలు `లెక్కలేనన్ని ఉన్నాయి .`మాధవదాసు `అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక లేక ఇక్కడే శిలగా మరిపోయాడట .తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యo .ఆ రోజు ఉపవాసం చేయడం ,పిండితాళిగలు వేయడం సంప్రదాయం .ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలోని హరిజనులు ఇంటిలో ,కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి .ఆ పాద ముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు .శ్రీకాళహస్తి నుండి ఒకరు ,కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులున్ని నెత్తి పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాద రక్షలను ఆ పూజ మందిరంలో పెడతారు .

             ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయి .స్వామివారు కొండ దిగి వచ్చి పాదరక్షలు వేసుకొని అలమేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి మరల కొండ ఎక్కే వేళా పాదరక్షలను స్వామి వారు ఇక్కడ వదిలి వెళ్ళతరాని పురాణ ఇతిహాసం

    పాదాల మండపం తరువాత ముందుగా సోపాన మార్గంలో కనిపించే ప్రధమ గోపురాన్ని `మొండి గోపురం`అని అంటారు .ఇది విజయనగర రాజుల కాలం నాటిది .పిడుగు పడి శిధిలమైనది .తి.తి.దే వారు 1982 సo,,లో పుననిర్మానం చేశారు .దిన్ని సాళువ నరసింహరాయలు కట్టించాడు .ఇది పాదాల మండపం దాటగానే ఉండే గోపురం

మొదట్లో స్వామి వారికీ సాగిలబడి మొక్కుతున్నట్లు ఉన్న శిల్పలు ఉన్నాయి .వీటిలో పెద్దది కొండయ్య కుమారుడు

లకుమయ్యది
అలిపిరి

కాలినడకన తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి తోలిప్రవేశ మార్గo `అలిపిరి ` సోపాన మార్గoలో కనిపించే మొదటి ప్రదేశం ఇదే .కొందరు `ఆడిప్పడి `అంటారు .పడి అంటే మెట్టు .ఆడి అంటి అడుగున ఉన్న భాగం .తిరుమల కొండకు అడుగున ఉన్న భాగం .తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశం .

              కొందరు `అలిపిరి `ని ఆడిప్పళి అంటారు .`పుళి`అంటి చింత చెట్టు .అడుగు భాగన కనిపించే చింత చెట్టు ప్రదేశమని భావం .వైష్ణవ క్షేత్రాలలో `చింత చెట్టుకు `ప్రాధన్న్యమెక్కువ .నమ్మాఆళ్వారుకు చింత చెట్టు కిందనే జ్ఞానోదయం అయింది

    కొందరు `అలిపిరి` అంటి అల్ప శరీరం కలవాడని వివరణ ఇస్తారు .శ్రీవారు ఈ ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నారని భావన .అలిపిరిలోని దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహాలయం .ఈ ఆలయం ఫైకప్పు విడిపోవడంతో పాడయిపోయీoది .విగ్రహాలు శిధిలమయ్యాయి .చివరకు అదృశ్యమయ్యాయి .ఈ ఆలయంలోని `శిల్ప కళ `,చిత్ర `విన్యాసాలు చూడవచ్చు

  అన్నమయ్య కాలం నాటికీ ఈ ఆలయం ఉందేది .`ఆళిపురి సింగని`సేవించి అనే మాట దీనికి సాక్ష్యంప్రస్తుతం ఈ ప్రదేశం `లక్ష్మి నారాయణ `ఆలయంగా తిర్చబడింది .ఇక్కడ చూడదగిన `భోక్కసం `ఉంది .అలిపిరిలోనే `వృత్తాకారపు బండ `ఉంది .శిధిలాలయంలోని  బండ `రాగుల రాయిలా ఉంది .ఈ రెండు బండలు చూడవచ్చు

సోపాన మార్గం
                                                          కాలినడకన తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి తోలిప్రవేశ మార్గం `అలిపిరి`మార్గం .అలిపిరి నుండి సోపాన మార్గం మొదలవుతుంది .ఈ సోపాన మార్గాన్ని పునరుద్దించిన వ్యక్తి మట్టకుమార అనంతరాజు .

 ఒక్కప్పుడు కపిల తీర్ధం నుండి కొండదారి మీదుగా తిరుమలకు వెళ్ళేవారట .కాని `అలిపిరి `నుండి వెళ్ళడానికి `అనంతరాజు `సోపాన మార్గం  కట్టించాడు ఈయనే సోపానమార్గంలో రెండు గోపురాలను కట్టించాడు .వీటిలో మొదటి గోపురంలో శ్రీనివాసునితో ఉండే తిరువెంగళనాధుడు (మాట్ల కుమారుని తండ్రి ).చెన్నమ్మ (మాట్ల కుమారుని తల్లి )ఉన్నారు .తెలుగు గ్రంధలిపులలో ఈ పెర్ర్లు చెక్కబడ్డాయి .రెండోవ గోపురం గాలిగోపురం అనే పేరుతో ఉన్న అగ్ర గోపురం .దీనికి సంభందించిన శాసనం పాదాల మండపంలో తెలుగు లిపిలో ఉన్నది

    `గాలి గోపురం `అనే పేరు చిత్రమైనది .గాలి బాగా విచడం వల్ల దానికి తగిన విధంగా గోపుర నిర్మనం ఉండడం వల్ల గాలి గోపురం .కొందరు `కాళి గోపురం `అని అంటారు .`ఖాళీ `అంటే ఏమి లేదు .గొపురానికి తగ్గట్టు దగ్గరలో `గుడి `ఉండాలి .కాని ఇక్కడ గోపురంవుంది .గుడి లేదు .ఆ దృష్టితో `గుడిలేని `ప్రాంతంలో కట్టిన   గోపురం కావడం వల్ల గాలి (ఖాళీ)గోపురం అని కొందరు వివరిస్తారు     ఈ గోపురానికి విద్యుత్ దీపాలంకరణతో `తిరునామం `తీర్చారు 2001 వ సంవస్త్తరంలోదీని మరమత్తులు  చేయడం జరిగింది.శంఖు చక్రాలను అమర్చడం జరిగింది

తలయేరుగుండు

                                             గుండ్రని ఆకారం గల రాయిగుండు .పెద్ద తల ఆకారంలో కనిపించే గుండులలో మొదటిది కావడం వల్ల తలయేరు గుండు అని అంటారు .తమిళంలో `తలప్పు `తలై దీపావళి `వంటి మాటలలో తలై అంటే మొదటిది .ముఖ్యమైనది అని అర్ధాలు .సోపాన మార్గంలో మొదట కనిపించే పెద్ద గుండు తలయేరు గుండు.ఈ గుండు మీద ఆంజనేయ స్వామి అంజలిముద్రతో కనడతాడు .కొండ ఎక్కేవారు ,దిగెవారు  తలనొప్పి ,కాళ్ళ నొప్పులు లేకుండా ఉండడానికోసం అలిపిరి దగ్గరలోని గుండును తలతోను ,మోకాళ్లతోను తాకుతారు .భక్తులు ఈవిధంగా తాకగా తాకగా బాగా అరిగినట్లు గుండుఫై  `పల్లం `గుర్తులు కనిపిస్తాయి

శ్రీ పాదములు


                                      `అలిపిరి `ప్రదేశంలో తలయేరు గుండు దగ్గరే కనిపించే పాదాలు శ్రీపాదములు .శ్రీవారంటే శ్రీనివాసుడాని అభిప్రాయం .స్వామి వారి పాదలే శ్రీపాదములు

    కొండ మీద స్వామివారి  కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంభి .అతదు భగవద్రామనుజులకు రామాయణ రహస్యాలను ఇక్కడే (అలిపిరి ప్రదేశంలో )చెప్పేవారట .కొండ నుండి నంబి ,గోవిందరాజ పట్టణం నుండి శ్రీమద్రామానుజులు  ఈ ప్రదేశం చేరుకొని భగవారాధన చేసేవారు .పాట ప్రవచనం కారణంగా తిరుమలనంబికి శ్రీవారి మధ్యాహ పూజ సేవా భాగ్యం దక్కలేదనే కొరత ఉండేది .స్వామి తిరుమలనంబి విచారాన్ని గుర్తించి `శ్రీ పాదములు `గా స్వామి ఇక్కడ అవతరించాడు .తిరుమల నంబి కోరిక కూడా తీరింది .ఈ పాదాలనే అన్నమయ్య

               బ్రహ్మకడిగిన పాదము

              బ్రహ్మము దానే నీ పాదము

అని స్తుతిoచాడు