తలయేరుగుండు

                                             గుండ్రని ఆకారం గల రాయిగుండు .పెద్ద తల ఆకారంలో కనిపించే గుండులలో మొదటిది కావడం వల్ల తలయేరు గుండు అని అంటారు .తమిళంలో `తలప్పు `తలై దీపావళి `వంటి మాటలలో తలై అంటే మొదటిది .ముఖ్యమైనది అని అర్ధాలు .సోపాన మార్గంలో మొదట కనిపించే పెద్ద గుండు తలయేరు గుండు.ఈ గుండు మీద ఆంజనేయ స్వామి అంజలిముద్రతో కనడతాడు .కొండ ఎక్కేవారు ,దిగెవారు  తలనొప్పి ,కాళ్ళ నొప్పులు లేకుండా ఉండడానికోసం అలిపిరి దగ్గరలోని గుండును తలతోను ,మోకాళ్లతోను తాకుతారు .భక్తులు ఈవిధంగా తాకగా తాకగా బాగా అరిగినట్లు గుండుఫై  `పల్లం `గుర్తులు కనిపిస్తాయి

No comments:

Post a comment