ఉగ్ర శ్రీనివాసమూర్తి-


శ్రీవారి ఆలయంలోని స్నపనమూర్తి ఉగ్ర శ్రీనివాసుడు ఈ స్వామిని `వెంకటత్తురైవర్ అంటారు.శ్రీదేవి భూదేవిలతో స్వామి కనిపిస్తారు. ఈ మూర్తి చేతిలో చక్రం ప్రయోగ బంగిమలో కనిపిస్తుంది

  భోగ శ్రీనివాసమూర్తి లేని కాలంలో ఈ స్వామికి ప్రాదాన్యముoడేది. అంతే కాకుండా తిరువిదులలో ఈ స్వామి ఉరేగేవాడట .ఒక బ్రహ్మత్సవకాలంలో స్వామి ఊరేగే వేళా మంటలు లేవడం, ఇళ్ళు కాలిపోవడం లాంటివి జరుగగా ప్రజల ప్రాద్దనతో గర్బ గుడిలోనే నిలిచిపోయారు. మహాసంప్రోక్షణం, గ్రహణకాలంలో ఈ స్వామికి తిరుమంజనం జరుగుతుంది ద్వాదశారాధాన ఉత్థాన ఏకాదశి ముక్కోటి ద్వాదశి పర్వదినాలలో ఉగ్రశ్రీనివాసమూర్తికి  పూజలు జరుగుతాయి,కైశికీ ద్వాదశి రోజు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఉబయనాంచారులతో బంగారు తిరుచ్చిలో వెoచేసీ ఆనందనిలయం విమాన ప్రదక్షణం చేసి నాలుగు వీధులలో ఊరేగే సూర్యోదయాతూప్పార్యం జరుగుతుంది కైశికభక్త చరిత్ర కాలక్షేపం జరుగుతుంది. ప్రసాద వినియోగానంతరం శ్రీవారు సన్నిదానం చేరుకొంటారు.

   సూర్యుని కిరణాలూ ఈ స్వామిని తాకరాదని,ఒక వేళా అలా జరిగితే అనర్దమని పెద్దల నమ్మకం


No comments:

Post a comment