సీతారామ లక్ష్మణ మూర్తులు


తిరుమల మీద శ్రీరాముల వారికీ ప్రతేక్కమయిన మందిరం ఉన్నట్లు కనిపించదు.తిరుమలనంబి రామనుజులకు రామయణ ప్రవచనం చేస్తుండగా ఒకానొక బ్రాహ్మణుడు సీతారామ లక్ష్మణమూర్తులను తెచ్చియిచ్చినట్లు ,భగవద్రామానుజులు శ్రీవారి ఆలయంలో వాటిని భద్రపరిచినట్లు పురాణగాధ. ఆదిగాక గర్భలయానికి వెళ్ళే మార్గంలో రామర్ మేడై అనే మందిర మున్నట్లు శాసనాల వల్ల తెలుస్తుంది.బహుశః ఆలయ పునర్నిర్మాణ సమయంలో అవి గర్బాలయం చేరి ఉండవచ్చు.శ్రీవారి ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహలేoదుకని అడిగేవారున్నారు. వేదవతి అమ్మ వారె పద్మావతి అమ్మవారు. త్రేతాయోగంలో శ్రీరామ చంద్రులువారు వేదవతికి ఇచ్చిన వాగ్ద్దనం ప్రకారం కలియుగంలో శ్రీవెంకటేశ్వర రూపంలో పద్మావతిని వివాహమాడారు.ఈ కారణం వల్లనే శ్రీవారి ఆలయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలున్నాయి.అదిగాక సుప్రబాతంలో శ్రీరామ స్తుతి కూడా తగినంత ఉంది. కౌసల్యాసుతుణ్ణి హెచ్చరించడంతోనే అది ఆరంభమవుతుంది

  తాళ్ళపాక అన్నమయ్య కూడా శ్రీరామమూర్తిని భక్తిపారవశ్యంతో కీర్తించాడు

No comments:

Post a Comment