మోకాళ్ళ ముడుపు


 
                                కాలినడక మార్గంలో యాత్రికులకు శ్రమ సాధ్యమయన సోపానమార్గం మోకాళ్ళ ముడుపు .ఇక్కడ మెట్లు నిటారుగా ఉంటాయి .ఒక మెట్టుకు ఇంకొక మెట్టుకు మోకాలంత దూరం ఉండడమే ,మోకాలంత ఎత్తున మరో మెట్టు ఉండడమో ఇక్కడ చూడవచ్చు .కొండ ఎక్కేవాళ్ళు మోకాళ్ళు పట్టుకొని ఎక్కడం వల్ల మోకాలి మెట్టు ,మోకాలి నెట్టు అనే పెర్ర్లు వచ్చాయి .ఒకప్పుడు `అక్కమ్మ `ఆలయాల నుండి కింద లోయలో దిగి ఆఫై మెట్లు ఎక్కే మార్గం చేరుకోనేవారు .అందువల్ల నిజంగానే ఆ సోపనమార్గ్గం మోకాలి మెట్టుగా ఉండేది .సోపానమార్గంలో కొన్ని మార్పులు చేయడం వల్ల ప్రస్తుతం అంత శ్రమ లేదు .ఇక్కడి కొండకు చుక్కల పర్వతమని పేరు

    తిరుమల సాలగ్రామమయమని ప్రతీతి .అందువల్ల పాదాలు మోపడానికి ఇష్టపడని వారు మోకాళ్లను ముడిచి ఎక్కేవారట .ఈ విధంగా కొండ ఎక్కిన వారు శ్రీమద్రామనుజులుఅని ,కన్నడ హరిదాసులయిన  వ్యాసరాయలని ,మహంతు హత్తిరామ్ బావాజి అని పెద్దలు చేబుతారు .ఈ ప్రదేశంలోనే తాళ్ళపాక అన్నమయ్యకు అలివేలు మంగమ్మ సాక్షాత్కరించిందని ,అన్నమయ్య ఆశువుగా  శ్రీ వెంకటేశ్వర శతకం చెప్పాడని అంటారు .(ఇక్కడ తిరుపతిలోని కొత్తూరు శిధిల ఆలయగోపురాన్ని 1998 లో పునఃస్తాపించడం జరిగింది

No comments:

Post a Comment