తాళ్ళపాక అర


శ్రీవారి హుండికి ఇంచుమించు ఎదురుగా కనిపించే అర `తాళ్ళపాక అర` దీనినే సంకీర్తన భండరమని అంటారు. 15 వ శతాబ్దంకి చెందిన తాళ్ళపాక అన్నమాచార్యలు రోజుకొక్క కీర్తన వంతున వ్రాసినట్లు అదారాలున్నాయి.`భండారాన దాచివుండనీ` అనే మాటల వరుసలవల్ల అన్నమయ్య కాలం నాటికే ఈ భండాగారముండేనేమో అని కొందరు బావిస్తున్నారు. అయితే సంకీర్తన భండార వ్యవస్తను పోషించి ఓక రూపం కల్పించినవాడు విజయనగర ప్రభువుయిన అచ్యుతరాయలు.ఈ మహత్కార్యంను జరిపినవాడు తాళ్ళపాక పేద తిరుమలయ్య. సంకిర్తలను రాగి రేకుల మీద చెక్కించి భద్రపరచినవాడు పేద తిరుమలయ్య.ఈ సంకిర్తనల భండార ప్రశంస క్రి.శ 1530 లోనే శాసనాలలో కనిపిస్తూ ఉంది. క్రి.శ 1541 లో సంకీర్తన భండారాం దగ్గర దేపములు ఉంచి ఆరాదించే పద్ధతి మొదలైనది. క్రి.శ 1545 లో సంకీర్తనల ఆరాదించడాని కోసం ,20రోజుల పాటు గ్రిష్మోత్సవ సందర్బంలో నివేదనలు జరిగే కార్యక్రమం కోసం చక్కటి వ్యవస్థ ఏర్పడింది. క్రి.శ 1558 లో సంకీర్తన ఆరుళుప్పాడు ప్రారంభమయిoది.ఈ అరలోనే తాళ్ళపాక వంశీకుల సంకిర్తనలు అన్ని భద్రపరచబడ్డాయి.

 

  ఈ తాళ్ళపాక అరకు ఇరు ప్రక్కల శిలాఫలకంఫై తంబూరా పుచ్చుకొని ఒక చేతిని అలపనం చేసి విధంగా పైకెత్తి పట్టుకొన్నట్లు రెండు చిత్రాలున్నాయి అలాంటి ప్రతిమలున్న రాగి రేకులు ఆ అరలోనే దొరికాయి

 తాళ్ళపాక వారి చిత్రాలలోని `తంబూర నేటి తంబూర కంటే బిన్నమైనది. 15-16 శతాబ్దంనాటి వాగ్గేయకారుల వేషానికి తాళ్ళపాక వారి చిత్రాలు నమునాలుగా బావించవచ్చు. స్వామి పుష్కరణి మెట్ల దగ్గర స్వామికి నిలబడి సేవిస్తున్నా పేద తిరుమలాచార్య, అన్నమయ్య శిలా ప్రతిమలుఉన్నాయి

No comments:

Post a Comment