మూలవర్లు


                                           ఈ మూర్తికి సంబందించిన రకరకలయిన అభిప్రాయాలూన్నాయి

జైన మూర్తి   జనసంచారానికి దూరంగా కొండ లోయలో ప్రశాంత వాతావరణంలో స్వామి , కుడివ్రక్షస్తలం ఫై `శ్రీవత్సo ఉండడం ,స్వామికి ఆదిములుడనే పేరుండడం వల్ల స్వామి `జినుడు` అని కొందరు

శివుడు   స్వామివారి ఆలయంలో రోజు అష్టాక్షరి మంత్రపటనం సాగడం,నాగాబరణుడై స్వామి కనపడడం, ధనుర్ర్మాసంలో బిల్వార్చన చేయడం, స్వామికి జటాజుటం ఉండడం, తలనిలాలు సమర్పించే ఆచారం ఉండడం, గర్బాలయంలో గోడను అంటినట్లు కాకుండా విగ్రహం ఆలయ మధ్యభాగంలో ఉండడం,మంగళవారం స్మార్ద శైవులు స్వామికిపొంగలి నైవేద్య్యం అర్పించడం, వినాయకచవితి రోజు `కుడుముల నైవేద్య్యం , శివరాత్రి రోజు స్వామికి అభిషేకం, ఆలయప్రాంగణంలో `నంది` మరి శైవమత శిల్పాలు కనబడం, స్వామికి విరూపాక్షుడనే పేరుఉండడం వల్ల స్వ్వామిని శివునిగా బావించేవారు కొందరు

ఆది శక్తి  పరందాముని వక్షస్తలం కొంచెం ఉబ్బెత్తుగా స్త్రీల వ్రక్షస్తలంగా కనిపించడం. జుట్టు ఎత్తుగా పొడవుగా కనిపించడం,గర్బాలయం ఫైన నాలుగు వైపులా దేవివాహనమయినా సింహ ప్రతిమలుoడడం,స్వామి బ్రహ్మోత్సవాలు కన్య మాసంలో నవరాత్రులలో జరగడం, స్వామివారికీ ప్రతి శుక్రవారం పసుపు, పచ్చ కర్పూరం,పునుగు,జవ్వాది, కుంకుమ,పాలు కలిపిన నీటితో అభిషేకం జరగడం, స్వామికి ఆటవికులు`ఉప్పాసులు` సమర్పించడం,బ్రహ్మోత్సవాలు ముగిశాక శాంతికోసం ఎర్రటి అన్నాన్ని వేపాకు పళ్ళెంలో పెట్టి సమర్పించే ఆచారం ఉండడం,ఔత్తరాహులు `బాలాజీ` అని పిలవడం ,స్వామి వ్రక్షస్తలం అనుకోని పొడుగాటి కత్తి ఉండడం , చీరకట్టి పూలతో గురువారం పూజ చేయడం వల్ల `ఆదిశక్తి అని కొందరు

కుమారస్వామి  కొండలమీద నిలిచే దేవుడు కావడం,స్వామిపుష్కరణి అనడంలో,స్వామి అంటే `కుమారస్వామి ` అనే రూడి ఉండడం ,దగ్గరలో `కుమారధార` ఉండడం, దక్షిణదేశంలో కుమారస్వామి ఆలయాలు దండిగా ఉండడం వల్ల కుమారస్వామి అని కొందరు

విష్ణువు   శ్రీవారికీ నాలుగు భుజాలున్నాయి ప్రలంబ సూత్రం, కటి సూత్రం ఉంది. మొదటిది యజ్ఞోపవితo,రెండొవది మ్రోలతాడు. ఈ రెండు లక్షణాలు పురుష విగ్రహలకే.దక్షిణ వ్రక్ష స్తలం ఫై`లక్ష్మి అమ్మవారి ఆకృతి ఉంది. బగవద్రామానుజులు ఈ విగ్రహం `విష్ణువు అని నిర్ణయిoచారు

  తిరుమల ఆలయం చాల ప్రాచినమైనది.ఆ కారణం వల్ల ఈ ఆలయంలో ఈ స్వామి ఆరాధనలో చాల ప్రతేక్కతలు కనిపిస్తాయి. కేవలం వైష్ణువాలయాలలో నేడు కనిపించే పద్దతులను బిన్నమయిన పద్దతులు శ్రీవారి ఆలయంలో కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం పాలకుల దృష్టి భక్తుల ఆరాధనలోని వైఛిత్రి హేతువులు,అలంకరణలు ఎక్కువ కావడం,వారంలో ఒకే రోజు మాత్రం అభిషేకం కావడం, అభిషేక దర్సనం, అందరికి వీలుపడకపోవడం వల్ల ఇప్పటికి స్వామి ఆకారం గురించి తరచు బిన్నాభిప్రాయలు వినిపిస్తాయి.కాని నిస్సంకోచంగా స్వామి విష్ణువే      

No comments:

Post a Comment