

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఉత్తరంగా ఒక కిలోమీటర్ దురాన ఉన్న దర్శనీయ స్తలం `శిల తోరణం` మైక్రోవేవ్ స్టేషన్` కు వెళ్ళే రోడ్ ద్వార ఈ రమణీయ స్తలాన్ని చేరుకోవచ్చు.
శిధిలత్వం,నీటి కోతల ప్రభావం కలిసి ఉన్న స్పటిక శిలలఫై పడడం వల్ల ఈ సేతువు ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ తోరణం ఇంచుమించు ధనురాకారాంలో ఉంది. 25 అడుగుల పొడవు,10 అడుగుల ఎత్తు ఉందనవచ్చు.ప్రపంచంలోని సహజ శిలా తోరణంలలో ఇది మూడోవది.వైకుంటం నుండి స్వామి(విష్ణువు) ఇక్కడే దిగాడని ప్రసిద్దె ఉంది.
ఇక్కడే కనిపించే శిలతోరణాలలాగే గోగర్భం పాప వినాశనం సమీపంలో మరి రెండు చిన్న శిలాతోరణాల ఛాయలున్న ప్రదేశాలు ఉన్నాయి
తుంబుర తీర్ధం


తుంబురుడు ఈ ప్రాంతంలో తపస్సు చేయడం వల్ల తుంబురు తిర్ధమనే పేరు వచ్చింది. ఈ తీర్ధంలో సూర్యుడు మీన రాశిలో ఉండగా పూర్ణిమనాడు స్నానం చేయడం పుణ్య పధం.ఈ సమయంలో మూడు కోట్ల యాభైలక్షల తిర్ధాలు ఈ తుంబురు తీర్ధంలో ఉంటాయని నమ్మకం.తున్భం అంటే తమిళంలో దుఖం
ఇక్కడ స్నానం చేస్తే అన్ని దుఖఃలూ,కస్థలు పోతాయని భక్తుల విశ్వసం.ఈ సమయాన్నే `తుంబురు తీర్ధముక్కోటి అని అంటారు. ఈ సందర్భంలో తీర్ధ స్నానాలు,దానాలు,ధర్మాలు చేస్తారు. తిరుమల శ్రీవారిని దర్శించి పునితులుఅవుతారు
No comments:
Post a Comment