పాండవ తీర్ధం-ఆకాశ గంగ




                                         పాండవ తీర్ధం

 తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ దూరంలో పాండవ తీర్ధంఉంది.వరహః పద్మ పురాణాలలో ఈ తీర్ధ మహత్యం వర్ణితం.దీనినే గోగర్భంమని కుడా అంటారు. పాండవులు ఈ తీర్ధంలో స్నానం చేయడం వల్ల పాండవ తీర్ధం.ఈ స్నాన ఫలం వల్ల పాండవులకు సమర విజయం.,రాజ్య ప్రాప్తి కలిగిందని వరహః పురాణం చెబుతుంది.

జ్ఞాతులయిన కౌరావులను చంపడం వల్ల కలిగిన పాపాన్ని పాండవులు ఈ తీర్ధస్నానంవల్ల పోగొట్టుకోన్నారని పద్మ పురాణం విశాదికరిస్తుంది

20 వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో సంఘ సంస్కర్తగా ఆధ్యాత్మ విద్యావ్యాపకుడుగా ప్రసిద్ది వహించిన శ్రీ మలయాళ స్వాములవారు ఏర్పేడు ఆశ్రమం స్తాపించడానికి ముందు ఈ ప్రాంతంలోనే కఠనమయిన తపస్సు చేశారు.తిరుమల తిరుపతి దేవస్తానం వారు అనుమతించగా ఏర్పేడు వ్యాసాశ్రమంవారు అందమయిన భవన నిర్మాణం ఇక్కడ చేపట్టారు


వృషభరాశిలో సూర్యుడు సంచరించే వేళా శుక్ల పక్షంలో గాని కృష్ణపక్షంలోగాని,ద్వాదశి తిదిలో ఆది,మంగళవారాలలో ఈ తీర్ధంలో స్నానం చేయడం పవిత్రమని,ప్రశస్తామని పెద్దలంటారు


                              ఆకాశ గంగ


తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 3 కే.మీ దూరంలో `ఆకాశ గంగ తీర్ధం ఉంది. హిమచలంలో ప్రవహించిన గంగమూడు పాయలయిoది.ఆకాశభాగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిన గంగ, ఈ ఆకాశగంగ మర్త్యగంగ శ్రీ విశ్వేశ్వరస్వామి అభిషేకాధులకు ఉపయోగపడుతూ ఉంది. ఆకాశగంగ తీర్ధమహత్యాన్ని వరాహ-పద్మ-స్కంద పురాణాలూ విశదం చేస్తున్నాయి. సంతానం లేని వ్యక్తిని భోక్తగా నియమించి శ్రాద్ధం చేయడం వల్ల గార్ధభముఖుడయిన పుణ్యశిలుని కడతేర్చిన తీర్ధం.

మేషమాసం చిత్తనక్షత్రంతో కూడిన పూర్ణిమా దినం ఈ తిర్ధనికి పర్వదినం


No comments:

Post a Comment