ఘంటా మండపం


               తిరుమల కొండ మీద `అవ్వచరి ` కొనకు దక్షిణం వైపున కొండ చిట్టచివర కనిపించే మండపం ఘంటా మండపం .ఇక్కడే తంతి తపాలా వారి పెద్ద లోహపు రేకు ఉంది.తిరుపతి రుయా హాస్పిటల్ రోడ్డలోల నిలబడితే ఈ రేకు బాగా కనిపిస్తుంది .కాలి నడక మార్గంలో నరసింహాలయం దాటాక ,మెట్టు దిగితే కాలినడక బస్సు మార్గంలో కలిసిపోతుంది .కుడివైపున ఉన్న అడవి మార్గం ఈ మండపానికి దారి తిస్తుంది .ఈ ప్రదేశంలో నాలుగు కాళ్ళ మండపం ఉంది .ఇక్కడ ఒక ఘంట ఉండేది .దీనిని వెంకటగిరి రాజా రఘునాధ యాదవనాయకులూ ,చంద్రగిరి రాజయిన రామదేవ రాయలకు క్రి.శ 1630 లో బహుకరించారు .తిరుమలలో శ్రీవారికి నైవేద్దయ్యం జరిగేవేళా మోగే శద్దం తరంగాలుగా మరి ఈ మండపంలోని ఘంటలను  తాకేవని ;అప్పుడు ఈ ఘంటలు మ్రోగేవని ;చంద్రగిరిలోని రాజా వారు స్వామివారికి వైవేద్దయ్యమయిoదని తెలిసి అఫై భోజనం చేసేవారని ప్రతీతి .ప్రస్తుతం ఈ మండపంలో ఘంట లేదు 

No comments:

Post a Comment